సెక్స్ తర్వాత దురద.. ఏం చేయాలంటే?

First Published | Feb 25, 2024, 2:33 PM IST

కొంతమంది ఆడవారికి సెక్స్ తర్వాత యోని దురద పెడుతుంటుంది. అసలు దీనికి కారణాలేంటి? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సెక్స్ భార్యాభర్తలిద్దరికీ మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కొంతమంది ఆడవారికి సెక్స్ తర్వాత యోని దగ్గర దురద పెడుతుంటుంది. కానీ చాలా మంది ఈ సమస్య గురించి చెప్పుకోరు. హాస్పటల్ కు కూడా వెళ్లరు. కానీ మీరు లైట్ తీసుకునేంత చిన్న సమస్య అయితే ఇది కాదు. అవును సెక్స్ తర్వాత మీకు యోని దగ్గర దురద పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇలా దురద ఎందుకు పెడుతుంది? దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


లేటెక్స్ అలెర్జీ

లేటెక్స్ అలెర్జీ అనేది కండోమ్ రబ్బరులో కనిపించే ప్రోటీన్లకు ప్రతిచర్య. కండోమ్ అలెర్జీ ఉంటే కూడా సెక్స్ తర్వాత యోని దురద పెడుతుంది. మీకు లేటెక్స్ కండోమ్లకు అలెర్జీ ఉంటే దురద తేలికపాటి నుంచి తీవ్రమైందిగా ఉంటుంది. 
 

Latest Videos


యోని పొడిబారడం

సెక్స్ తర్వాత దురదకు యోని పొడిబారడం కూడా ఒక కారణమే. దీనివల్ల యోని చర్మం పూర్తిగా పొడిబారుతుంది. యోని గోడలను లూబ్రికేషన్ చేయడానికి తగినంత లూబ్రికెంట్ ఉత్పత్తి కానప్పుడు ఇలా జరుగుతుంది. కొంతమంది చర్మం సహజంగా పొడిగానే ఉంటుంది. లేదా వారికి తామర వంటి చర్మ సమస్యలు ఉంటాయి. సబ్బు వంటి ఉత్పత్తులతో ఎక్కువగా కడగడం లేదా ఉపయోగించడం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం వల్ల దురద ఉంటుంది. ఇది సెక్స్ సమయంలో చికాకు, జలదరింపునకు కారణమవుతుంది. 

ఘర్షణ

నిపుణుల అభిప్రాయం ప్రకారం..  మీరు సెక్స్ లో పాల్గొనేటప్పుడు అది ఘర్షణ, చికాకును కలిగిస్తుంది. ఇది యోనిలో దురదకు కారణమవుతుంది. లూబ్రికెంట్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం పెరుగుతుంది. యోని దాని స్వంత సహజ లూబ్రికెంట్ ను ఉత్పత్తి చేయగలదు. కానీ రుతువిరతి ఇది తగ్గుతుంది. 
 

బ్యాక్టీరియల్ వాగినోసిస్

యోనిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదల బాక్టీరియల్ వాగినోసిస్ కు దారితీస్తుంది. ఫలితంగా సెక్స్ సమయంలో దురదతో పాటుగా చేపల వాసన, యోని ఉత్సర్గ వస్తుంది. ముఖ్యంగా అసురక్షిత శృంగారం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అందుకే సెక్స్ తర్వాత యోనిలో మరింత చికాకు, దురద కలుగుతుంది. 
 

స్పెర్మ్ అలెర్జీ

స్పెర్మ్ అలెర్జీ ఎక్కువగా ఆడవాళ్లను ప్రభావితం చేస్తుంది. అలాగే దీనిని స్పెర్మ్ అలెర్జీ లేదా సెమినల్ ప్లాస్మా సున్నితత్వం అని కూడా పిలుస్తారు. వీర్యంలో ఉండే ప్రోటీన్ శరీరంలోని ఏ భాగంలోనైనా అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. స్పెర్మ్ తో సంబంధంలోకి వచ్చే అవయవాలలో యోని, చర్మం, నోరు ఉన్నాయి. శారీరక సంబంధం ఉన్న 10 నుంచి 30 నిమిషాల్లో లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
 

ఏం చేయాలంటే? 

సెక్స్ తర్వాత దురద రావొద్దంటే సరైన పరిశుభ్రతను పాటించండి. ఇందుకోసం సెక్స్ కు ముందు, తర్వాత పరిశుభ్రతను పాటించాలి. చేతులను కడగడం, జననేంద్రియ భాగాలను నీళ్లతో కడగాలి. అలాగే సంభోగం తర్వాత దురదగా అనిపిస్తే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. అలాగే శృంగారానికి ముందు, తర్వాత తగినంత నీటిని తాగాలి. దీంతో శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం మర్చిపోకూడదు. ఇది సంక్రమణ ప్రమాదాన్ని 50% తగ్గిస్తుంది.

click me!