రిలేషన్ షిప్ లో సెక్స్ అంత ముఖ్యమా?

First Published | Feb 29, 2024, 2:55 PM IST

రిలేషన్ షిప్ లో సెక్స్ ఒక్కటే ముఖ్యం కాదు. కానీ ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేమను పెంచుతుంది. అదే రిలేషన్ షిప్ లో సెక్స్ లేకుంటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

రిలేషన్ షిప్ లో సెక్స్ కామన్ విషయం. సంబంధంలో సెక్స్ అనేది భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. అలాగే ఇది మీ బంధాన్ని బలంగా చేస్తుంది. కానీ ఇదే రిలేషన్ షిప్ లో ముఖ్యమైన విషయమా? అసలు రిలేషన్ షిప్ లో సెక్స్ ఎందుకు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


రిలేషన్ షిప్ లో సెక్స్ ముఖ్యమా?

సెక్స్ అనేది రిలేషన్ షిప్ శారీరక రూపం. ఇది సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ను పెంచుతుంది. అలాగే భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుతుంది. అంతేకాదు రిలేషన్ షిప్ లో సెక్స్ భాగస్వాముల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. సెక్స్ బిజీ లైఫ్ లో మంచి విశ్రాంతినిస్తుంది. అలాగే భాగస్వాములు సన్నిహిత సంబంధాలను నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. 
 

Latest Videos


ఆరోగ్యకరమైన ప్రేమ సంబంధానికి రెగ్యులర్ సెక్స్ అవసరమని చాలా మంది నమ్ముతారు. అయితే సెక్స్ ను ఇష్టపడని వారు , తక్కువ లిబిడో ఉన్నవారితో పాటుగా చాలా మంది సెక్స్ పై ఎక్కువగా ఆధారపడకుండా సంతృప్తికరమైన సంబంధాలను ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. 
 

రిలేషన్ షిప్ లో సెక్స్  లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు 


సెక్స్ లో పాల్గొనడం వల్ల మీకు మంచి శారీరక ఆనందం కలుగుతుంది. మీరు క్రమం తప్పకుండా లైంగిక ఆనందాన్ని పొందడం వల్ల ప్రతి భాగస్వామి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇది శరీర సానుకూలతను కూడా ప్రోత్సహిస్తుంది. 
 


సాన్నిహిత్యాన్ని పెంచుతుంది

సెక్స్ వల్ల కలిగే ఒక రకమైన శారీరక సాన్నిహిత్యం ఆక్సిటోసిన్ హార్మోన్ ను బాగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ సాన్నిహిత్యం, ఎమోషనల్ కనెక్షన్ భావోద్వేగాలను పెంచుతుంది. దీంతో సెక్స్ లో పాల్గొనడం వల్ల భాగస్వాముల మధ్య సంబంధం బలంగా మారుతుంది. సంబంధంలో సాన్నిహిత్యం, భావోద్వేగ ఆరోగ్యం, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది.
 

ఒత్తిడి దూరం 

మంచి సెక్స్ అనేది ఒత్తిడిని తగ్గించే చర్య. ఇది ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది మీరు విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే భావప్రాప్తిని పొందితే మీరు కంటినిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
 

ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొనాలి?

ఒక జంట ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనాలనే విషయానికొస్తే.. అది ఆ జంటపై ఆధారపడి ఉంటుంది. సోషల్ సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. సాధారణ శ్రేయస్సు లైంగిక ఫ్రీక్వెన్సీతో ముడిపడి ఉందని కనుగొన్నారు. కానీ ఒక నిర్దిష్ట స్థాయికి మాత్రమే. వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొన్న  జంటల్లో రిలేషన్ షిప్ సంతృప్తి క్రమంగా పెరుగుతుందని కనుగొన్నారు.
 

click me!