భర్త పక్కనుంటే మూడ్ రావడం లేదు కానీ...!

First Published | Mar 11, 2021, 3:08 PM IST

నా భర్త నా పక్కన ఉన్నప్పుడు.. సెక్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు మూడ్ రావడం లేదు. కానీ..ఆయన ఇంట్లో లేని సమయంలో.. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం విపరీతంగా మూడ్ వస్తోంది

శృంగారం అనేది యూనివర్శల్ గా అందరికీ నచ్చే కామన్ పాయింట్. దీని గురించి చర్చలు జరపకున్నా.. తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉంటుంది. ఎవరితోనూ చర్చించకపోవడం వల్ల చాలా మందికి ఈ శృంగారం విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. కొందరు మాత్రం ధైర్యం చేసి.. తమకు ఉన్న సమస్యలను, అనుమానాలను నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కొందరు తమకు శృంగారం విషయంలో ఎదురౌతున్న సమస్యలను వివరించారు. మరి వారికి నిపుణులు ఎలాంటి పరిష్కారం చెప్పారో ఓసారి చూద్దాం..

‘‘నాకు పెళ్లై మూడు సంవత్సరాలు అవుతోంది. నా వయసు 29 సంవత్సరాలు. పిల్లలను కనాలనే ఆలోచన ఇప్పట్లో లేదు. ఇద్దరం ఉద్యోగస్తులం. కానీ.. తన శృంగార జీవితం మాత్రం ఆనందంగా లేదు. నా భర్త నా పక్కన ఉన్నప్పుడు.. సెక్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు మూడ్ రావడం లేదు.
కానీ..ఆయన ఇంట్లో లేని సమయంలో.. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం విపరీతంగా మూడ్ వస్తోంది. ఆయన ఎంత ప్రేరేపించినా.. నాకు మూడ్ మాత్రం రావడం లేదు. ఒక్కోసారి ఆయన అసంతృప్తికి గురౌతున్నాడు. నాకు కూడా అసౌకర్యంగా అనిపిస్తోంది. నాలో ఏదైనా సమస్య ఉందా..?’’ దీనికి నిపుణులు ఏమని సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
ఇదేమీ పెద్ద సమస్య కాదని.. బయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా మందిలోకామన్ గా ఉంటుందని.. అయితే.. సదరు వివాహిత విషయంలో కాస్త ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మీరు సంతోషాన్ని నిజ జీవితంలో పొందకుండా.. ఊహల్లో పొందుతున్నారు. అందుకే శృంగారాన్ని ఆస్వాదించడం లేదని చెప్పారు.
శృంగారం కన్నా పని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. భర్తతో ప్రేమగా ఉంటడం.. ఇద్దరూ కలిసి సమయం గడపడం లాంటివి చేయడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెప్పారు.
‘ నా వయసు 45 సంవత్సరాలు. నాకు దాదాపు పెళ్లై 18 సంవత్సరాలు అవుతోంది. ఈ మధ్య నాకు హస్త ప్రయోగం అలవాటు అయ్యింది. దీంతో.. నా భార్యతో శృంగారానికి పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నాను. దీంతో.. నా భార్య నన్ను అనుమానంగా చూస్తోంది. నేను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నాననేది ఆమె భయం. అయితే.. నేను ఎంత ప్రయత్నించినా భార్యకు దగ్గరకాలేకపోతున్నాను. దీనికి పరిష్కారం చెప్పండి.’
మీరు ఏదైనా ఊహలో జీవిస్తూ ఉండొచ్చు. దానికి ఎట్రాక్ట్ అయిపోయి.. రియాల్టీకి దూరమైపోతున్నారు. చాలా మంది శృంగారాన్ని ఓ మెకానిజంగా మార్చేస్తున్నారు. దీంతో దానిని మనస్పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. అలా కాకుండా.. విభిన్న పద్ధతుల్లో శృంగారాన్ని ట్రై చేయడం వల్ల భార్యకు దగ్గరయ్యే అవకాశం ఉంది.
భార్యతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే.. ఆమె పట్ల ఫీలింగ్స్ కలిగే అవకాశం ఉంటుంది. హస్త ప్రయోగానికి బానిసవ్వడం కూడా అంత మంచిదేకాదు. దానికి దూరంగా ఉంటే.. భార్యతో ఆనందంగా శృంగారాన్ని ఆస్వాదించొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!