ప్రేమలో పడినవారందరూ ఇలానే చేస్తారా..?

First Published | Apr 22, 2021, 1:00 PM IST

ప్రసిద్ధ జీవ మానవ శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ ప్రేమ విషయంలో చేసిన పరిశోధనలో మూడు ముఖ్య విషయాలు తెలిశాయి. వాటిలో సెక్స్(లస్ట్) , ఎట్రాక్షన్, ఎటాచ్మెంట్ ఇలా మూడు ముఖ్య విషయాలు ఉంటాయట.

ప్రేమ ఓ తీయని అనుభూతి. ఇది ప్రేమ అంటే అని ఒక్క మాటలో చెప్పలేం. సినిమాల్లో చాలా మంది కవులు పాటల రూపంలో విభిన్న రకాలుగా ప్రేమను వివరించే ప్రయత్నం చేశారు. ఆ కవులు చెప్పిన వాటిలో నిజమెంత ఉందో తెలియదు కానీ... దీనిపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పలు విషయాలు తెలిశాయి.
సైన్స్ ప్రకారం... ప్రేమలో పడినవారిలో మూడు లక్షణాలు ఉంటాయట. మనకు తెలీకుండానే.. మూడు ఎమోషన్స్ ప్రేమలో పడినవారిలో కనపడతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రసిద్ధ జీవ మానవ శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ ప్రేమ విషయంలో చేసిన పరిశోధనలో మూడు ముఖ్య విషయాలు తెలిశాయి. వాటిలో సెక్స్(లస్ట్) , ఎట్రాక్షన్, ఎటాచ్మెంట్ ఇలా మూడు ముఖ్య విషయాలు ఉంటాయట.
ఈ మూడు హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి. ఈ హార్మోన్లు మెదడు పనితీరు ఆధారంగా విడుదలౌతాయి. ఎట్రాక్షన్, ఎటాచ్మెంట్ లకు భిన్నమైనది లస్ట్. స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజన్, టెస్టోసెరాన్ లు విడుదలైనప్పుడు వారికి సెక్స్ చేయాలనే ఆలోచనలు వస్తాయి.
డోపామైన్ , నోర్‌పైన్‌ఫ్రైన్ హార్మోన్లు ఆకర్షణకు కారణం అవుతాయి. రొమాంటిక్ రిలేషన్ షిప్ మొదలైన కొత్తలో ఈ హార్మోన్లు విడుదలౌతాయి.
దీని తర్వాత ప్రేమ అనేది మొదలౌతుంది. ఆక్సిటోసిన్, వాసోప్రెస్సిన్ వంటి హార్మోన్లు ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి సహాయం చేస్తాయి. ఇవే ప్రేమ పుట్టడానికి కారణమౌతాయి.
ఒక మనిషిపై ఒకరికి ప్రేమ పుట్టడానికి కేవలం సెకనులో ఐదో వంతు సమయం సరిపోతుందట. ఈ విషయం కూడా సైన్స్ ప్రకారం నిరూపితమైనదే.
చాలా మంది ప్రేమలో పడిన కొత్తలో తమకు ఆకలి తెలియడం లేదని.. నిద్ర పట్టడం లేదని చెబుతుంటారు. అయితే.. అది నిజమేనట. ప్రేమలో ఉన్న సమయంలో డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ హార్లోన్లు విడుదల అవుతాయి. అవి మనిషికి ఎక్కువ సంతోషం, ఎక్సైట్మెంట్ పెరుగుతాయట. ఆ క్రమంలో.. ఆకలి ఆలోచన.. నిద్ర పోవాలనే ఆశ తగ్గిపోతాయట.
అంతేకాదు... ప్రేమలో పడిన వారిలో చాలా మార్పులు వస్తుంటాయి. వాళ్ల అలవాట్లలో మార్పులు వస్తుంటాయి. వాళ్ల లుక్స్ లో కూడా మార్పులు వస్తుంటాయి.
నొప్పులు తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ ఎలాగో.. చాలా ఎమోషన్స్ కి లవ్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుందట.
ప్రేమలో ఉన్నవారు ఎక్కువ కేరింగ్ కోరుకుంటారు.. అంతేకాకుండా... పొగడ్తలను కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా థ్యాంక్స్ చెప్పేస్తుంటారు. ప్రేమలో పడినవారిలో గ్రాటిట్యూడ్ బాగా పెరిగిపోతుందట.
ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్ నర్ కి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారట.. థ్యాంక్స్ చెప్పడం లాంటివి చేస్తారట. ఇది చాలా మంచి విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Latest Videos

click me!