ఈ సమయాల్లో ఆడవాళ్లకు సెక్స్ కోరికలు ఎక్కువ

నెలలోని కొన్ని రోజుల్లో ఆడవాళ్లకు విపరీతమైన లైంగిక వాంఛ కలుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అవును కొన్ని అధ్యయనాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. అది ఏయే రోజులంటే? 
 

పీరియడ్స్ కు ముందు వచ్చే కొన్ని లక్షణాలు, పీరియడ్స్ సమయంలో వచ్చే ఇబ్బందుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో కొంతమందికి తిమ్మిరి ఉంటుంది. కొంతమందికి మైకంగా అనిపిస్తుంది. మరికొందరికి కడుపు ఉబ్బరం ఉంటుంది. కానీ పీరియడ్స్ కు ముందు, పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనాలనే కోరిక కూడా చాలా మంది ఆడవారికి ఉంటుందట. దీనికి పీరియడ్స్ లక్షణాలే కారణమంటున్నారు నిపుణులు. అయితే ఇది అందరి విషయంలో ఉండదు. కానీ కొంతమంది మహిళలు పీరియడ్స్ సమయంలో లేదా తర్వాత చాలా అనుభూతి చెందుతారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి. 
 

పీరియడ్స్ కు, లైంగిక వాంఛకు సంబంధం ఉందా?

సెక్స్ కోరికకు ఉద్వేగం హార్మోన్లతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. మీ పీరియడ్స్ హార్మోన్లు దీనికి ఎంతో బాధ్యత వహిస్తాయి. రుతుక్రమం మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2 దశలను కలిగి ఉంటుంది. ఫోలిక్యులర్ దశ, లుటియల్ దశ.



ఏ సమయంలో మహిళలకు లైంగిక వాంఛ ఎక్కువగా కలుగుతుంది? 

2019 లో నిర్వహించిన ఒక అధ్యయనం 600,000 మందికి పైగా మహిళల రుతు చక్రాలను పర్యవేక్షించింది. దీన్ని ఓ యాప్ లో నమోదు చేయగా 14వ రోజు చాలా మంది మహిళలు అండోత్సర్గము చేయలేదని తేలింది. కాగా అండోత్సర్గం సమయంలో.. అంటే అండం అండాశయం నుంచి బయటకు వచ్చి గొట్టంలోకి వెళ్లినప్పుడు చాలా మంది మహిళలు ఎక్కువ లైంగిక కోరికను అనుభవించారు. 2013 అధ్యయనం ప్రకారం.. నిరంతర లైంగిక కోరిక ఈ సమయంలో లైంగిక సంక్రమణ అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రుతుచక్రం తక్కువగా ఉన్న రోజుల్లో లిబిడో దానంతట అదే తగ్గిపోతుంది. ఇంకా ఏయే సమయాల్లో ఆడవారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అండోత్సర్గము సమయంలో

అండోత్సర్గముకు ముందు మహిళలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. 2015 లో ఒక సమీక్ష నిర్వహించబడింది.. దీనిలో ఈ సమయంలో మహిళలు సెక్స్ లో ఎక్కువ చొరవ చూపుతున్నారని గమనించారు. అండోత్సర్గము తర్వాత 24 గంటల తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయట. ఈస్ట్రోజెన్ హార్మోన్ మూడు రకాలలో ఒకటైన ఎస్ట్రాడియోల్ మహిళల్లో లైంగిక కోరికలను పెంచుతుంది. అయితే రుతువిరతి తర్వాత ఆడవారిలో ఎస్ట్రాడియోల్ తగ్గుతుంది.  దీనివల్ల అప్పుడు వారికి లైంగిక కోరిక తగ్గుతుంది.
 

సెలవు దినాలలో..

ఒక వ్యక్తి సెక్స్ కోరిక కూడా సమయంపై ఆధారపడి ఉంటుందట. అవును ఈ విషయాన్ని పరిశోధనలే చెబుతున్నాయి. సెలవు దినాలలో కాలేజీ వయసు మహిళల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. సెలవు దినాల్లో ఆడవాళ్లు శృంగారంలో పాల్గొనే సగటు సంభావ్యత 22%. మిగతా రోజుల్లో ఇది 9 శాతంగా ఉంటుంది. అందుకే సమయం కూడా లైంగిక వాంఛ, ఉత్తేజానికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు.
 

ఫోలిక్యులర్ దశ

రుతుచక్రం మొదటి దశ ఫోలిక్యులర్ దశ. ఇది సుమారు 1-14 రోజులు ఉంటుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ప్రొజెస్టెరాన్ స్థాయిల కంటే ఎక్కువగా ఉంటాయి. లుటినైజింగ్ హార్మోన్ పెరిగినప్పుడు, ఫోలిక్యులర్ దశ చివరలో మహిళలు సెక్స్ కోసం ప్రేరేపించబడతారు. ఇది అండోత్సర్గము ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ సమయంలో గర్భందాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 

లూటియల్ దశ

దీనిని రుతుచక్రం రెండో దశ అంటారు. అండోత్సర్గము తర్వాత లూటియల్ దశ ఉంటుంది. ఈ దశలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు ఈస్ట్రోజెన్ స్థాయిలను అధిగమించడం ప్రారంభిస్తాయి. కానీ పీరియడ్స్ సంభవించినప్పుడు ఈ రెండూ క్షీణించడం ప్రారంభిస్తాయి. ఇది కొత్త చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో సెక్స్ పట్ల కోరిక తక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళ తన భావోద్వేగాలను భిన్నంగా ప్రాసెస్ చేస్తుంది. 

Latest Videos

click me!