భాగస్వాముల మధ్య శృంగారం తనువుల దాహం తీర్చడానికి మాత్రమే కాదు.. వారి శారీరక, మానసిక ఆరోగ్యానికీ.. దీర్ఘకాల అన్యోన్యతకు బాటలు వేస్తుంది. అయితే చాలాసార్లు కలయిక స్త్రీలలో నొప్పిని కలిగిస్తుంది. అది కొన్నిసార్లు చాలా తీవ్రంగా కూడా ఉంటుంది.
75శాతంమంది స్త్రీలు తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ నొప్పి బారిన పడినవారేనట. ఇక కొంతమందిలో అయితే కలయిక అనేది పీడకలగా మారుతుందట. తీవ్రమైన నొప్పి వారిని శృంగారం అంటేనే భయపడేలా చేస్తుంది.
మరి దీనికి కారణాలేంటి.. ఆనందాన్ని కలిగించాల్సిన సెక్స్ ఇలా నొప్పితో మెలికలు తిరిగేలా చేయడానికి కారణమేంటి? నిజంగా ఈ నొప్పి శారీరకమైనదా? లేక మానసికమైనదా?
చాలామంది స్త్రీలు కలయికలో నొప్పి అనేది సహజమే అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. తరాలుగా సెక్స్ చుట్టూ ఉన్న అపోహల్లో ఇదీ ఒకటి. అందుకే స్త్రీలు నొప్పిని పంటిబిగువున భరిస్తుంటారు. తప్పితే మనసువిప్పి చెప్పుకోవడానికి, చర్చించడానికి ప్రయత్నించరు.
ఆరోగ్యకరమైన శృంగారం, సెక్స్ ఎడ్యుకేషన్, దాని చుట్టూ ఉన్న వైద్యపరమైన సహాయం ఇలాంటి వాటి విషయంలో యుక్తవయసు పిల్లలు, పెద్దవారిలో అవగాహన చాలా అవసరం. అయితే నిజానికి కలయికలో నొప్పి ఎందుకు వస్తుందంటే...
వెజైనాలో కావాల్సినన్న ద్రవాలు ఊరకపోవడం వల్ల కలయిక నొప్పిగా ఉంటుంది. వెజైనాలో డ్రై నెస్ వల్ల అది వ్యాకోచం చెందదు.. దీనివల్ల శృంగారం బాధాకరంగా మారుతుంది. అందుకే ఫోర్ ప్లే లాంటివాటి వల్ల లూబ్రికెంట్స్ త్వరగా వచ్చేలా ప్రయత్నించాలి. ఇలా లుబ్రికెంట్స్ సరిగా లేకుండా శృంగారంలో పాల్గొంటే.. ఆ డ్రైనెస్ ఇన్ఫెక్షన్లకూ దారి తీసే ప్రమాదం ఉంది.
దీనికోసం చాలామంది బయట దొరికే లూబ్రికెంట్స్ ను వాడుతుంటారు. అయితే దీనికంటే సహజసిద్దంగా లుబ్రికేషన్ అవ్వడమే మంచిది. దీనివల్ల శృంగారంలో నొప్పి ఉండదు. అంతేకాదు ఫోర్ ప్లే తో లుబ్రికెంట్స్ తో పాటు స్త్రీలు కూడా కలయికను ఆస్వాదిస్తారు.
పుడెండల్ నరం దెబ్బతినడం వల్ల కూడా నొప్పి కలుగుతుంది. సెక్స్పుడెండల్ నాడి అనేది పెరినియం బాహ్య జననేంద్రియాలు, యూరేత్రల్ స్పింక్టర్, ఆనల్ స్పింక్టర్‌తో కలిపే ప్రధాన నాడి. ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది వీటిల్లో ఒకటి మెదడు సంకేతాలను వాగస్-క్లైటోరల్ నెట్‌వర్క్‌కు ప్రసారం చేయడం. ఈ నరం దెబ్బతినడం వల్ల యోగిలో ఎలాంటి సెన్సేషన్ లేకపోవడంతో నొప్పిని కలిగిస్తుంది.
అయితే ఈ నరం దెబ్బతిన్న విషయం చాలాసార్లు నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. అంటే ఇది దెబ్బ తిన్న విషయం తెలియదు. వెజినల్ ట్రామా, కాన్పు సమయంలో వెజైనా ప్రాంతంలో ఎక్కువగా కట్ చేయడం, ఎక్సర్ సైజ్, యోగా లాంటివి చేసేప్పుడు సరైన పద్ధతిలో చేయకపోవడం. గంటలతరబడి కూర్చుని ఉండడంలాంటివి దీనికి కారణమవుతాయి.
హెచ్పీవీ, కల్మీడియా, గనేరియా లాంటి సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా కలయికలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. హఠాత్తుగా నొప్పి, రక్తస్రావం, మంట, అబ్ నార్మల్ డిశ్చార్జ్.. వీటిల్లో ఏదో ఒకటి లేదా సెక్స్ సమయంలో అన్నీ ఉండడం కూడా నొప్పికి కారణమవుతుంది.
కలయికలో తరచుగా ఇలాంటి నొప్పిని అనుభవిస్తున్నట్లైతే ..వెంటనే ఎస్టీఐ టెస్ట్ చేయించుకోవాలి. అయితే చాలామంది ఆరోగ్య నిపుణులు ఆరునెలలకొకసారైనా ఈ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కలయిక సమయంలో హఠాత్తుగా నొప్పి వస్తున్నట్లైతే మీకు ఎండోమెట్రియోసిస్, క్రానిక్ వల్వోడెనియా లేదా కటి సంబంధిత సమస్య లాంటి దీర్ఘకాలిక నొప్పి ఉండొచ్చు. ఆకస్మిక నొప్పి, దీర్ఘకాలిక నొప్పి మధ్య తేడాను చెప్పడం చాలా కష్టసాధ్యమైన విషయం.
ఎందుకంటే రెండూ తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు హఠాత్తుగా వల్వోడెనియా, వాజినిస్మస్ లేదా డైస్పెరేనియా వంటి పరిస్థితులను అనుభవించవచ్చు. మునుపటి శారీరక గాయం వల్ల నొప్పి తెలుస్తుండడం. లేదా.. డిప్రెషన్, ఎన్విరాన్మెంటల్ ఒత్తిడి వల్ల కూడా నొప్పిరావచ్చు.
అన్ని సమస్యలకూ పరిష్కారాలుంటాయి. దీనికి కూడా చికిత్స దొరకుతుంది. వెంటనే సరైన వైద్యులను సంప్రదించాయిలి. పెల్విక్ ప్లోర్ స్పెషలిస్టును కలవడం వల్ల మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. అంతేకాదు దీనికి మానసిక పరమైన సమస్యలే కారణమైనా డాక్టర్లు సంప్రదించాల్సిందే.