శృంగారంలో అమ్మాయిలకు నచ్చని విషయాలు ఇవే

First Published | Mar 18, 2020, 2:48 PM IST

చాలా మంది శృంగారానికి ముందు బెడ్రూమ్ లో పెద్ద గా మ్యూజిక్ పెడుతూ ఉంటారు. అది మీకు నచ్చిందని మీ పార్ట్ నర్ కి కూడా నచ్చాలని రూల్ లేదు. కాబట్టి.. వాళ్ల అభిరుచిని బట్టి  ఫాలో అయితే బెటరని నిపుణులు చెబుతున్నారు.
 

శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం. దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా, సాఫీగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరో ప్రాణి భూమి మీదకు రావాలంటే ఇది తప్పనిసరి.
అలాంటి శృంగారం విషయంలో దంపతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం భారిన పడి ఇబ్బంది పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు

అంతేకాకుండా... చాలామంది దంపతులు శృంగారం మధ్యలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే... ఆ పొరపాట్ల కారణంగా అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది శృంగారానికి ముందు బెడ్రూమ్ లో పెద్ద గా మ్యూజిక్ పెడుతూ ఉంటారు. అది మీకు నచ్చిందని మీ పార్ట్ నర్ కి కూడా నచ్చాలని రూల్ లేదు. కాబట్టి.. వాళ్ల అభిరుచిని బట్టి ఫాలో అయితే బెటరని నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలా మంది బెడ్రూమ్ లోకి వెళ్లినా ఫోన్ ని మాత్రం వదిలిపెట్టరు. దానిని కూడా వాళ్ల వెంటే తీసుకొని వెళతారు. అయితే.. సరిగ్గా రొమాన్స్ పీక్స్ కి వెళ్లిన సమయంలోనే ఆ ఫోన్ కూడా మోగుతుంది
అంతే.. అప్పటిదాకా ఉన్న మూడ్ కాస్త పోతోంది. ఇది మీ పార్ట్ నర్ కి విపరీతంగా కోపం తెప్పించే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆ సమయంలో కనీసం మీ ఫోన్లను సైలెంట్ లో పెట్టుకోవడం బెటర్.
ఇక చాలా మంది శృంగారంలో రొమాన్స్ ది పెద్ద విషయం అన్న విషయం మర్చిపోతారు. డైరెక్ట్ గా శృంగారంలోకి వెళ్లిపోతారు. అయితే... ఇది అమ్మాయిలకు ఏ మాత్రం నచ్చదని నిపుణులు చెబుతున్నారు.
ముద్దులతో మొదలుపెట్టి రొమాన్స్ లో పీక్స్ కి తీసుకువెళ్తేనే అసలు శృంగారంలో మజా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి శృంగారాన్నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని చెబుతున్నారు.
ఇక చాలా మంది అదో హడావిడీ పనిగా చేస్తుంటారు. అదో ఆఫీసు పనిలాగా... ఎంత త్వరగా ముగుద్దామా అని చూస్తుంటారు. అది కూడా అమ్మాయిలను మెప్పించలేదని చెబుతున్నారు. ప్రశాంతంగా.. ఎంజాయ్ చేస్తూ.. స్త్రీలను సుఖపెట్టేవారిపైనే మగువలు మనసుపడతారని చెబుతున్నారు.
ఇక కొందరు లవ్ లో ఉన్నప్పుడు శృంగారం కోసం తమ ప్రేయసిని అడుక్కున్నంత పని చేస్తారు. అలా కక్కుర్తిగా అడ్డుకోవడం ఏ అమ్మాయికి నచ్చదు. ప్రేమగా వాళ్లని ఒప్పించే పద్ధతి ఒకటి ఉంటుంది. అలా కాకుండా.. కొందరు కాళ్లు పట్టుకొని మరీ అడుగుతుంటారు. అలాంటి వాళ్ల పట్ల అమ్మాయిలకు ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకొందరు అవతల పార్ట్ నర్ ఎంత ఉత్సాహం చూపించినా.. వీళ్లు మాత్రం చాలా నీరసంగా ఉంటారు. ఉత్సాహపరిచే మాటలు మాట్లాడకపోగా.. నీరసంగా... ఎదుటివారి ఉత్సాహాన్ని కూడా నీరుకారుస్తారు. అలాంటి వాళ్లు అబ్బాయిలు అస్సలు నచ్చరని నిపుణులు చెబుతున్నారు.
ఇక అమ్మాయిల విషయానికి వస్తే... శృంగారం విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత స్త్రీల యోని భాగం వద్ద బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోతుంది. రతి అనంతరం ఆ బ్యాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుంది. ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి.
శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే.. ఆ బ్యాక్టీరియా మూత్రంతో పాటు బయటకు పోతుంది. అలా కాకుండా చాలా మంది రతి క్రీడలో పాల్గొనడానికి ముందే మూత్రవిసర్జన చేస్తారు. అలా చేస్తే.. ఆ తర్వాత మూత్రం రాదు. దీంతో బ్యాక్టీరియా అక్కడే ఉండిపోయి..  ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది.
అంతేకాదు.. మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా స్త్రీలు కచ్చితంగా నీటితో జననాంగాలను శుభ్రం  చేసుకోవాలి. కేవలం స్త్రీలే కాదు... పరుషులు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే... లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

click me!