పురుషులకు శృంగారం ఒక్కటే సరిపోదు.. అవి కూడా కావాలి..

First Published Apr 17, 2021, 4:28 PM IST

స్త్రీల మనసు లోతు అని, అర్థం చేసుకోవడం కష్టం అని అంటారు. అయితే పురుషులు కూడా ఇలాంటి స్వభావమే కలిగి ఉంటారని ముఖ్యంగా రిలేషన్స్ లో ఇది బాగా తెలుస్తుందని పరిశోధకులు అంటున్నారు. 

స్త్రీల మనసు లోతు అని, అర్థం చేసుకోవడం కష్టం అని అంటారు. అయితే పురుషులు కూడా ఇలాంటి స్వభావమే కలిగి ఉంటారని ముఖ్యంగా రిలేషన్స్ లో ఇది బాగా తెలుస్తుందని పరిశోధకులు అంటున్నారు.
undefined
అందుకే రిలేషన్ షిప్ లో పురుషులు స్త్రీల నుంచి ఏం కోరుకుంటారనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఒక రిలేషన్ షిప్ లోకి వెళ్లే ముందు స్త్రీలు చాలా ఆలోచిస్తారు. ఒక్కసారి నమ్మకంగా రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టారా.. అంత తొందరగా వదిలిపెట్టరు. కానీ పురుషులు అలా కాదు.. ఎంత తొందరగా ప్రేమలో పడతారో, అంత తొందరగానూ దాన్నుండి బయటపడతారు.
undefined
దీనికి స్త్రీ, పురుషుల స్వభావం, మానసిక స్థితి, కోరికలు, మనస్తత్వాలు, అభిరుచులు, వారి హార్మోన్లలో తేడా ఇవన్నీ పనిచేస్తాయి. అందుకే స్త్రీలు రిలేషన్ లో పడడం కష్టం.. కానీ పురుషులు తేలిక. అయితే ఆ బంధంలో నిలిచి ఉండడం పురుషులకు కాస్త కష్టమే. వారికి స్త్రీలనుంచి కొన్ని ప్రత్యేకమైనవి అందాలి. అప్పుడే వారు రిలేషన్ ను ఎక్కువ కాలం పొడిగించగలుగుతారు.
undefined
కండీషన్లు, డిమాండ్లు చేసే స్త్రీలంటే పురుషులకు అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా అంతులేని ప్రేమను అందించాలని కోరుకుంటారు. బదులుగా షరతులు విధిస్తే ఆ బంధం బంధనంగా మారిపోతుంది.
undefined
రొటీన్ గా ఉండడం నచ్చదు. మెకానికల్ గా ఉండలేరు. పురుషులకు జీవితం నీటిమీద ఆకులా హాయిగా తేలిపోవాలి. స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. ఇందులో తేడా వస్తే రిలేషన్ షిప్ కు బ్రేక్ పడ్డట్టే.
undefined
పురుషులు స్త్రీలనుండి శృంగారాన్ని మాత్రమే కోరుకోరు... ఓ మంచి స్నేహితురాలిని ఆశిస్తారు. నిజమైన స్నేహంతో తన మనసులోని అన్ని విషయాలు షేర్ చేసుకోగలిగే తోడు కోసం వెతుకుతారు.
undefined
ఎంత రిజర్వ్ డ్ గా ఉండే పురుషుడైనా తన భాగస్వామి దగ్గర ఓపెన్ అవుతాడు. ఆ సమయంలో అతన్ని అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటారు.
undefined
మంచి స్నేహితులుగా ఉన్న జంటలు శృంగారంలోనూ హాయిగా ఎంజాయ్ చేయగలుగుతారు. భర్త అన్ని విషయాలూ చూసుకుంటుంటే.. భార్య కామ్ గా ఉండే రోజులు పోయాయి. అన్ని విషయాల్లోనూ ఇద్దరి భాగస్వామ్యం కోరుకుంటారు. అలాంటప్పుడు ఇద్దరి మధ్య మంచి అవగాహన, కమ్యూనికేషన్ ఉండాలి.
undefined
దంపతుల మధ్య ప్రేమను మరింతగా పెనవేసుకునేలా చేయడంలో శృంగారం ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రేమ ఉన్న చోట శృంగారం మరింత వన్నె తేరుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. అంతేకాని రిలేషన్ షిప్ కానీ, వివాహం కానీ శృంగారాన్ని తప్పనిసరిగా చేయాల్సిన పనిగా చూడడం కరెక్ట్ కాదు. ప్రేమకు, శృంగారానికి లింక్ ఉంటుంది.
undefined
రతిక్రీడ కేవలం పిల్లలు పుట్టించడానికే అనుకుంటే పొరపాటు. శారీరక సుఖాన్ని అందించడానికి అనుకోవడమూ కరెక్ట్ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని, అత్మీయతను, ఆప్యాయతను పెంపొందించడానికి ఇదొక అద్భుతమైన మార్గం.
undefined
ఈ విషయం స్త్రీ, పురుషులిద్దరూ అర్తం చేసుకోవాలి. లేకపోతే ఆ బంధానికి అర్థం ఉండదు. పురుషులకు కోరికలు ఎక్కువ, తొందరగా మొదలుపెడతారు. స్త్రీలు కూడా కోరికలుంటాయి. కానీ కాస్త మెల్లగా రతిక్రీడలోకి దిగుతారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఈ క్రీడలో ఇద్దరూ పోటాపోటీగా పాల్గొంటారు.
undefined
భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. వారు చేసే పనుల్ని అర్థం చేసుకుని మెచ్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పురుషులు తమ భాగస్వామి అయిన స్త్రీ నుంచి సపోర్ట్ ను ఎక్కువగా కోరుకుంటారు. అలా లేనప్పుడు ఆ మద్ధతు దొరికే వైపుకు అతని దృష్టి మరలే అవకాశం ఉంటుంది.

రిలేషన్ షిప్ లో పురుషులు కమిట్ మెంట్, రాజీలేని విశ్వసనీయతను కోరుకుంటారు. తమ భాగస్వామి తనకు మాత్రమే అంకితమై ఉండాలని కోరుకుంటారు. ఇందులో ఏదో తేడా ఉందన్న చిన్న అనుమానం కూడా వారు భరించలేరు. అందుకే 'రోమింగ్-ఐ' ఉన్న స్త్రీలను ఎప్పుడూ పురుషులు అంగీకరించరు.

click me!