శృంగారం లేని వైవాహిక జీవితం.. ఏం జరుగుతుందంటే?

First Published | Feb 14, 2024, 2:24 PM IST

వైవాహిక జీవితంలో భార్యా భర్తల మధ్య లైంగిక కార్యకలాపాలు చాలా అవసరమంటారు నిపుణులు. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచడమే కాకుండా, గొడవలు, కొట్లాటలు, మనన్పర్థలు రాకుండా చేస్తుంది. మరి వైవాహిక జీవితంలో సెక్స్ లేకుంటే ఏమౌతుందో తెలుసా? 

పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లితో రెండు మనసులు ఒక్కటవ్వడమే కాదు రెండు శరీరాలు కూడా ఒక్కటవుతాయి. దంపతుల మధ్య లైంగిక కార్యకలాపాలు ఉంటేనే వారు ఒకరినొకరు నమ్ముతారు. అలాగే ఇద్దరి మధ్యన ప్రేమ పెరుగుతుంది. అలాగే గొడవలు, కొట్లాటలు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది భార్యాభర్తలిద్దరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 

కానీ వివాహం విఫలమైనప్పుడు వీరి మధ్య ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొనకుండా పడకగదిలో గడపడం మొదలుపెడితే వారి మధ్య మనస్పర్థలు వస్తాయి. చిన్నచిన్న విషయాలకు కూడా కొట్లాడుకుంటారు. వాదించుకుంటారు. 
 


భార్యాభర్తల మధ్య సెక్స్ లైఫ్ ముగిసిపోతే ... ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా వరకు ప్రభావితమవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. దీనివల్ల చిన్న చిన్న పొరపాట్లను కూడా అతిగా చేసి ఒకరినొకరు దూషించుకుంటారు. అలాగే మానసికంగా దెబ్బతీసే ధోరణి కూడా బాగా పెరుగుతుంది. భార్యాభర్తలు ఇష్టపూర్వకంగా శృంగారానికి నో చెప్తే ఇద్దరి జీవితంలో ద్వేషం ఏర్పడుతుంది.
 

ఈ సమస్య ఇలా కొనసాగితే ముందుగా ఇద్దరికీ నిద్రలేమి సమస్య వస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల సెల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఎప్పటికీ తగ్గని దూరం ఏర్పడుతుంది. ఇది తెలుసుకోకుండా ఎవరో తెలియని వ్యక్తులతో తమ మనసులోని మాటలను చెప్పడం మొదలుపెడతారు. కానీ ఇది కూడా మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. 
 

సెక్స్ కోరిక పెరిగినా భాగస్వామితో సెక్స్ లో పాల్గొనే  ఇష్టం లేకపోవడం వల్ల పోర్న్ వీడియోలు చూసే అలవాటు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎప్పుడో ఒకసారి వాహేతర సంబంధాల ద్వారా వివాహ సుఖాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest Videos

click me!