అతి జాగ్రత్త.. ఇద్దరూ కండోమ్ వాడితే..?

First Published May 16, 2020, 12:49 PM IST

కండోమ్ ఒక్కసారి వినియోగించింది... మళ్లీ వినియోగించడకూడదు. అది పురుషులైనా.. స్త్రీలైనా ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. లేదని మళ్లీ మళ్లీ వినియోగిస్తే.... లైంగికపరంగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 

సురక్షిత శృంగారానికి కండోమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి కండోమ్ వినియోగించడం ఇష్టం ఉండదు. దాని వలన పూర్తి అనుభూతి పొందలేమనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే... ఆ భావనను పక్కన పెట్టి... కండోమ్ వినియోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇప్పటివరకు పురుషులు మాత్రమే కండోమ్ వినియోగించేవారు. అయితే... కేవలం పురుషులే కాదు... స్త్రీలకు కూడా ప్రత్యేకంగా కండోమ్స్ మార్కెట్లో లభ్యమౌతున్నాయి..
undefined
చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. కండోమ్ ఇద్దరిలో ఒకరు వినియోగిస్తే సరిపోతుందా..? ఇద్దరూ వాడాలా అనే అనుమానాలు ఉంటాయి.
undefined
అయితే... ఇద్దరిలో ఎవరో ఒక్కరు వినియోగిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ వాడితో కండోమ్ చిరిగిపోవడం కానీ... జారీపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది.
undefined
ఇక మరో విషయం ఏమిటంటే... కండోమ్ ఒక్కసారి వినియోగించింది... మళ్లీ వినియోగించడకూడదు. అది పురుషులైనా.. స్త్రీలైనా ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. లేదని మళ్లీ మళ్లీ వినియోగిస్తే.... లైంగికపరంగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
undefined
ఫీమేల్ కండోమ్ వాడకంలో చాలా మంది స్త్రీలకు కొన్ని అనుమానాలు ఉంటాయి. కండోమ్ గర్భాశయం లోపలికి వెళ్లిపోతే ఏవైనా సమస్యలు వస్తాయేమో అని కంగారు పడుతుంటారు.
undefined
అయితే... అలాంటి బయం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిమేల్ కండోమ్ నిర్దేశిత పరిమాణంలో ఉంటాయి. కాబట్టి గర్భాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. కానీ.. దీనిని పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
undefined
పాలీ యురేథేన్ అనే పదార్థంతో ఫీమేల్ కండోమ్స్ తయారు చేస్తారు. ఈ కండోమ్స్ కి ఉండే రింగ్ ని సైతం దీనితోనే తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఫ్లెక్స్ బుల్ గా ఉంటాయి. ఇక ఈ కండోమ్స్ లో ప్రత్యేకంగా సైజులు ఉండవు.ఫ్రీ సైజు మాత్రమే లభిస్తాయి.
undefined
స్త్రీలు.. పీరియడ్స్ సమయంలో కూడా ఫీమేల్ కండోమ్స్ ని నిస్సందేహంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఫీమేల్ కండోమ్స్ వాడటం వలన అవాంఛిత గర్భం రాకుండా ఆపవచ్చు. అదేవిధంగా లైంగిక చర్య ద్వారా సంక్రమించే సుఖ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటిని వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!