భారత్‌లాంటి సంప్రదాయదేశంలో శృంగారాన్ని ఎక్కువమంది రహస్యంగానూ, బూతుగానూ భావిస్తారు. దానిగురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు తటపటాయిస్తారు.
ఎవరైనా తెగించి మాట్లాడితే వాళ్లను తేడాగాళ్ళుగా చూస్తారు. తీవ్రవిమర్శతో వారితో విభేదిస్తుంటారు. అయితే అంతర్గతంగా చాలామక్కువతో ఈ సంభాషణలను ఎంజాయ్‌చేస్తారట.
కొన్ని దేశాల్లో శృంగారం విషయంలో కొన్ని వింత సంప్రదాయాలను పాటిస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికా నైజర్‌ప్రాంత వొడాబీ తెగ వ్యక్తులు ఇతరుల భార్యలను దొంగలించవచ్చు.
వైవాహిక జీవితం సాగుతుండగా వేరే భార్యపట్ల ఆకర్షణకు లోనవుతే ఆమెను ఆమె అనుమతి లేకుండా తీసుకెళ్లవచ్చట. దీనికి ఆమె భర్తకూడా వ్యతిరేకించడు.ఆమె తర్వాత తిరిగొచ్చినా తిరస్కరించడు.
కాంబోడియాలో కేంగ్ గిరిజనులు వయసుకొచ్చిన తమ కుమార్తెలకోసం లవ్‌హర్ట్ పేరుతో గుడిసెలు నిర్మిస్తారు. ఈ కుటీరంలోకి అబ్బాయిలను పంపిస్తారు. అమ్మాయి ఎవరితో ఆనందంగా గడుపుతుందో అతడినే జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటుంది.
ఈజిప్టులోని ఓ గిరిజనతెగలో బహిరంగ ప్రదేశాల్లోనే రతిక్రియలో పాల్గొంటారు. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని అక్కడివారి విశ్వాసం.
పుపువా న్యూగినియాలోని ట్రొబ్రైండర్స్ గిరిజనతెగ బాలురు, బాలికలు అతిచిన్నవయసులో శృంగారంలో పాల్గొంటారు. అది వారి ఆచారం. ఆస్ట్రియా గ్రామీణప్రాంతాల్లో ఓ దురాచారం ఉంది.
పెళ్ళికాని యువతి యాపిల్‌పండు ముక్కని తనచంకలో పెట్టుకుని అది కిందపడకుండా నృత్యం చేయాలి. డ్యాన్స్ పూర్తైన తర్వాత ఆ పండుముక్కని ఆమె ఎవరికైతే అందిస్తుందో అతనే ఆమె భర్త.
మురియాతెగలో కౌమారంలో ఉన్న యువతీయువకులకోసం ప్రత్యేక శృంగారగృహాలు నిర్మిస్తారు. వారు శారీరకంగా తొలుత దగ్గరైతేనే మానసికంగా దగ్గరవుతారని వారి విశ్వాసం.
హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లోనూ ఓ ఆచారం ఉంది. అన్నదమ్ములందరికీ ఒక్కతే భార్య.
ఆ నిబంధన ప్రకారం కుటుంబంలోని అన్నదమ్ములంతా ఒకే యువతిని పెళ్లి చేసుకుంటారట. ఇలా పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఉండటం గమనార్హం. ఆ ప్రాంతాల్లో ప్రజలంతా వ్యవసాయ భూమిపైనే ఆధారపడి జీవిస్తుంటారు.
ఎంత లేదనుకున్నా ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు మగపిల్లలు ఉంటారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారి భావనట.
మంద ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుందనే సామేత వినే ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే మందను తగ్గించాలని అనుకున్నారు. అందులో భాగంగానే... ఇలా ఇంట్లో కొడుకులందరికీ ఒకే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఎప్పుడో తాతల కాలంలో ఈ ఆచారం మొదలుపెట్టగా... ఇప్పటికీ అక్కడి ప్రాంతవాసులు దీనినే ఫాలో అవుతూ వస్తుండటం విశేషం.
ఆ ఇంట్లో ఎంత మంది అన్నదమ్ములంటే అంతమందికి ఆమె ఒక్కతే భార్యగా కొనసాగుతుంది. దాని వల్ల ఇప్పటివరకు తమకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని వారు చెబుతుండటం గమనార్హం.
దాదాపు మనదేశంలో పెళ్లికి, వివాహ బంధానికి చాలా గౌరవం ఇస్తాం. ఒక పెళ్లి చేసుకొని... వారికి విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం కూడా నేరంగా భావిస్తూ ఉంటాం. అలాంటి దేశంలో ఇప్పటికీ ఇలాంటి ఆచారాలు ఉన్నాయంటే విడ్డూరంగా అనిపిస్తూనే ఉంటుంది.