కొత్త పెళ్లి కూతురికి తొలి రాత్రి బెంగ..

First Published | Aug 13, 2020, 1:02 PM IST

మొదటిసారిగా.. మీరు మీ లైఫ్ పార్టనర్ తో బెడ్రూం పంచుకుంటారు. కాబట్టి.. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే.. ఆ ఇబ్బందిని జయిస్తే.. కలయిక ఆనందంగా ఉంటుంది.

పెళ్లి అనేది జీవితంలోకి కొత్త ఆనందాలు, కొత్త సంతోషాలను తీసుకువస్తుంది. అంతేకాదు.. భర్తతోపాటు.. కొత్త మనుషులు.. కొత్త ప్రపంచలోకి అడుగుపెట్టాల్సి ఉంది. దీంతో.. పెళ్లి అనగానే అమ్మాయిలకు భయం మొదలౌతుంది. అయితే.. దీనితో పాటు.. తొలి రాత్రి భయం కూడా అమ్మాయిల్లో చాలా సర్వసాధారణం.
ఎందుకంటే.. పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో ఇంట్లో.. పరిచయం లేని వ్యక్తితో.. కొత్త బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ ఆలోచనే వారిని భయానికి గురిచేస్తుంది. తెలీకుండానే ఒత్తిడికి గురౌతారు. అయితే.. మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

అందరికీ తెలిసిన విషయమే అయినా.. పెళ్లిలో హడావిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పెళ్లిలో అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. అంతేకాకుండా.. అన్నీ వేడుకల్లో పాల్గొని దాదాపు ఎవరికైనా అలసట వస్తుంది. దీంతో.. అదే రోజు రాత్రి తొలి రాత్రి వేడుక ఏర్పాటు చేస్తే.. మీకు అంతగా శక్తి ఉండకపోవచ్చు.
ఇక చాలా మంది సినిమాలను చూసి.. తొలిరాత్రి అనగానే ఏవేవో ఊహించుకుంటారు. కాబట్టి ముందుగా సినిమాల్లో చూపించినదంతా నిజమని భ్రమ పడొద్దు. అంతేకాకుండా.. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మీరు మీలా ఉంటేనే.. మీ భర్తకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా.. తొలి రాత్రి పేరులోనే ఉంది.. అది తొలి అనుభవమని. మొదటిసారిగా.. మీరు మీ లైఫ్ పార్టనర్ తో బెడ్రూం పంచుకుంటారు. కాబట్టి.. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే.. ఆ ఇబ్బందిని జయిస్తే.. కలయిక ఆనందంగా ఉంటుంది.
ఇక పెళ్లి ఇల్లు అనగానే.. ఇంటి నిండా జనాలు ఉంటారు. తొలి రాత్రి కన్నా ముందు లైఫ్ పార్ట్ నర్ తో కాసేపు గడపాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే... ఇంటి నుంచి చుట్టాలు ఉండటంతో.. కావాల్సినంత ఫ్రీడమ్ దొరికే అవకాశం ఉండదు.
మీ జీవితంలో తొలి రాత్రి ఒక ముఖ్యమైన ఘట్టమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో శోభనం గదిని అలంకరించేటప్పుడు.. దానికి కాస్త దూరంగా ఉండటం మంచిది.
గదిని అలంకరించే సమయంలో.. మీరు అక్కడ ఉంటే.. వారి ముందు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాబట్టి.. దానికి దూరంగా ఉంటే.. కాస్త ఇబ్బంది తగ్గిపోతుంది.
కొన్ని భారతీయ సంప్రదాయాలకు వరుడు మరియు వధువు మొదటి రాత్రి వేర్వేరు బెడ్ రూములలో పడుకోవాల్సిన అవసరం ఉంది. అది వారి ఆచారం కూడా కావొచ్చు.
ఇక నిజజీవితాన్ని సినిమాలాగా పోల్చి చూసుకోవద్దు. మీ భర్తను ప్రేమగా కౌగిలించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండాలి. అన్ని విషయాలు చర్చించుకోవచ్చు.
తొలి రాత్రి అనగానే.. శృంగారం అనే భావన తొలగించుకోవాలి. ఆ రోజు కచ్చితంగా కలయికలో పాల్గొనాలనే ఆలోచచను బుర్ర నుంచి తీసేయాలి. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనసులను ఏకం చేసుకోవాలి.
ఈ రోజు మీ జీవితంలో అతి ముఖ్యమైన రోజు అన్న విషయం గుర్తుంచుకోవాలి. మంచిగా ఉంటూ.. అన్నీ విషయాలను ప్రేమగా పంచుకోవాలి. అప్పుడు ఈ రోజు మీకు జీవితంలో ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది.
ఇక తొలి రాత్రి కచ్చితంగా సక్సెస్ అవ్వాలనే భ్రమలో కూడా ఉండొద్దు.. మరోసారి ప్రయత్నించవచ్చు..

Latest Videos

click me!