మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చే సరికి.. మరిన్ని అపోహలు పెరిగిపోతాయి.
అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.
వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ పీరిడయ్స్ సమయంలోనూ శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొన్న సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనినే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. వీటితోపాటు ఎండార్ఫిన్ కూడా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ల కారణంగా పీరియడ్స్ లో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి హార్మోన్స్ కేవలం భావ ప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే విడుదలౌతాయి. అవి మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి. అందుకే ఆ సమయంలోనూ శృంగారంలోనూ పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. పీరిడయ్స్ సమయంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పీరియడ్స్ వేళ సెక్స్ చేయాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.. అయితే.. కొంత చిరాకు కూడా కలిగిస్తుందనేది నమ్మదగ్గ వాస్తవం. అలాంటప్పుడు.. హాట్ షవర్ కింద ట్రై చేయాలంట.. అప్పుడు పీరియడ్స్ రక్తం చిరాకు కలిగించకుండా ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో.. సెక్స్ చేస్తున్నప్పుడు ఒత్తిడి మరింత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి... ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్ షీట్ ముందు రంగు ఎంచుకోవాలి. దాని వల్ల రక్తపు మరకలు కనడపతాయనే భయం ఉండదు.
ఆ సమయంలో కలయికలో పాల్గొనాలనే ఆసక్తి ఇద్దరికీ ఉండాలి. ఒకరికి ఉంటే సరిపోదు. కాబట్టి ఈ విషయాలను ఇద్దరూ మాట్లాడుకోవాలి. ఇద్దరికీ అంగీకారమైతేనే దానిని ఆస్వాదించాలి.
ఇక పీరియడ్స్ సమయంలో కలయిక కాబట్టి.. అసౌకర్యంగా ఉండకుండా ఉండేందుకు.. బెడ్రూమ్ లో సువాసన వెదజల్లే క్యాండిల్స్ లేదా.. రూమ్ ఫ్రెషనర్స్ ఉపయోగించాలి. ఆ సువాసనలు మీ మూడ్ మార్చేస్తాయి.
ఇక పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం రాదని చాలా మంది అనుకుంటారు. అది చాలా పొరపాటు అంట. ఆ సమయంలోనూ గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయట. కాబట్టి.. సేఫ్టీ వాడటం తప్పనిసరి.