పెళ్లి.. ఆ తర్వాత పిల్లలు కలగడం చాలా సహజం. అయితే... చాలా మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత కలయిక పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. దానికి కారణం కూడా లేకపోలేదు. కలయికలో పాల్గొన్న ప్రతిసారి నొప్పి బాధిస్తూ ఉంటుంది.
దీంతో.. భర్తకు దూరంగా ఉండటం మొదలుపెడతారు. విషయం ఏంటో అర్థంకాక భర్తలు తీవ్ర అసహనానికి గురౌతూ ఉంటారు. అయితే.. ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా భర్తతో చనువుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఆ నొప్పిని తగ్గించి తిరిగి మునుపటిలా శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
కలయికకు ముందు వేడి నీటితో షవర్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. మనసు, శరీరం హాయిగా ఉంటుంది. ఆ సమయంలో కలయికను ఆస్వాదించగలిగే హార్మోన్లు కూడా విడుదల అవుతాయి.
ఆ హార్మోన్ విడుదల అయిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక.. విశ్రాంతి తీసుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సమయంలో కలయికలో పాల్గొంటే పెద్దగా నొప్పి బాధించదు. ఒకవేళ నొప్పి కలిగినా.. ఆ ప్రదేశంలో ఐస్ ప్యాక్ తో సున్నితంగా మర్థన చేస్తే సరిపోతుంది.
అంతేకాకుండా... సెక్స్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. మీరు రెగ్యులర్ గా చేసే శృంగార భంగిమ కారణంగా ఏవైనా గాయాలు అయ్యి.. నొప్పి పెడుతున్నట్లయితే.. ఆ సెక్స్ పొజిషన్ మార్చుకోవాలి. కొత్త రకం భంగిమలు ప్రయత్నించడం ద్వారా కూడా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. కలయికను కూడా ఆస్వాదించవచ్చు.
కొందరికి కలయిక సమయంలో యోనిలో బాధ కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కలయికకు కాస్త దూరంగా ఉంటూ.. ఓరల్ సెక్స్ ఎంజాయ్ చేయాలి. అలా చేయడం వల్ల దూరంగా ఉన్నామనే భావన కలగకుండా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత సమస్య తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ప్రయత్నించవచ్చు.
లేదంటే.. ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్ కి ఎక్కువ సమయం కేటాయించి.. చివరగా.. తీవ్ర ఉద్రేకం కలిగిన సమయంలో.. సంభోగంలో పాల్గొంటే సరిపోతుంది. దాని వల్ల ఎక్కువ సేపు సెక్స్ చేయకున్నా.. భాగస్వామితో ఎక్కువ సమయం ఎంజాయ్ చేసిన భావన కలుగుతుంది.
ఇక మహిళలు డెలివరీ తర్వాత వ్యాయామంపై దృష్టి పెట్టాలి. తరచూ డాక్టర్ల సలహాతో వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరం ఫిట్ గా మారి మునుపటిలా ఉంటుంది. అప్పుడూ కూడా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. టిప్స్ ఫాలో అయితే.. డెలివరీ తర్వాత కూడా శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.