శృంగారానికి మించి.. పురుషులు కోరుకునేదేమిటి..?

First Published | Sep 8, 2021, 1:22 PM IST

వారికి ఆ ఆనందం కలిగించడానికి.. సెక్స్ పరంగా కోరికలు పెంచడానికి.. భార్యలు సుతిమెత్తగా.. భర్తను తాకాలట. 

sexual relation

పురుషులు ఎప్పుడూ శృంగారానికి సంబంధించన ఆలోచనలు కలిగి ఉంటారని.. వారిని వెంటనే మూడ్ వచ్చేస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు.. వారి కోరిక తీర్చుకోవడానికి.. మహిళలకు మూడ్ ఉన్నా లేకున్నా.. బలవంత పెడతారని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదట.

అందరూ నమ్మే.. ఈ విషయం  కారణంగా.. పురుషుల్లో చాలా ఒత్తిడి పెరుగుతుందట. దానిని నిజం అని నమ్మించడానికి వారు అబద్దాలు కూడా చెప్పాల్సి వస్తోందట. మరి పురుషులను ఆ ఒత్తిడి నుంచి బయట పడేసి.. వారిని సెక్స్ పట్ల ఆసక్తిపరంగా చేయడమెలాగో, అసలు కలయికను మించి వారు ఏం కోరుకుంటున్నారో దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో  ఇప్పుడు చూద్దాం..


సెక్స్ సమయంలో.. లైంగిక స్పర్శ అనేది చాలా ముఖ్యం.  అయితే.. లైంగిక కోరిక పెంచడానికి కూడా చిన్న స్పర్శ అందిస్తుంది. అయితే.. వారికి ఆ ఆనందం కలిగించడానికి.. సెక్స్ పరంగా కోరికలు పెంచడానికి.. భార్యలు సుతిమెత్తగా.. భర్తను తాకాలట. వారి అలసట తీరేలా తలకు మసాజ్ చేయాలట. ఇలా చేయడం వల్ల వారిలో ఉన్న ఇన్ సెక్యురిటీ ఫీలింగ్ తగ్గి.. భార్యకు సులభంగా దగ్గరౌతారట.

relationship

అందరిలోనూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఫ్లర్టింగ్ కేవలం అబ్బాయిలు మాత్రమే  చేయాలని అనుకుంటారు. అయితే.. అమ్మాయిలు కూడా.. తమ భర్తతో ఫ్లర్టింగ్ చేయడంలో ఎలాంటి తప్పులేదట. ముఖ్యంగా పెళ్లైన కొత్తలో.. చాలా మంది తమ భర్తలతో  చాలా చనువుగా.. వారిని ఆకర్షించాలనే ప్రయత్నాలు  చేస్తుంటారు.

అయితే.. ఈ ప్రయత్నం.. పెళ్లై కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చేయాలట. వారికి కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించాలి. వారికి నచ్చినట్లు ముస్తాబవ్వాలి. పడకగదిలో వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే.. మీ భర్త ఎన్ని సంవత్సరాల తర్వాతైనా మీకు దాసోహం అయిపోతారు.

మీ భర్తకు ఏది ఇష్టమె.. ఏది ఇష్టం ఉండదో అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు.. తన కోసం మీరు ఎలా ఉండాలో కూడా అడిగి తెలుసుకోవచ్చు. దానిలో ఎలాంటి తప్పు లేదు.

చాలా మంది.. భార్యలు ఇంట్లో కష్టపడుతూ ఉంటారు.. వారిని మెచ్చుకోవాలి అంటూ చెబుతుంటారు. అయితే.. మీ కోసం మీ భర్త ఏదైనా చేస్తే.. దానిని మీరు కూడా మెచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారు మీ కోసం చేసే చిన్న పని అయినా.. ప్రశంస అందిస్తే.. వారు ఆనందిస్తారు. మీకు మరింత దగ్గరౌతారు.

relationship

దంపతులు ఆనందంగా ఉండాలంటే  వారి మధ్య ఉన్న ఇగోలు పక్కన పెట్టాలని చెబుతుంటారు. ఆడవారు ఇగో లేకుండా భర్తతో ప్రేమగా ఉంటే.. వారి మధ్య అసలు ఎలాంటి బేధాభిప్రాయాలురావని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!