భర్తలు రొమాంటిక్ గా మారేందుకు చిట్కాలు..!

First Published | Feb 1, 2023, 11:22 AM IST

పిల్లల టాపిక్ కాకుండా వేరే విషయాలు మాట్లాడుకోవాలి. పిల్లల గురించి కాదు అంటే... ఇంటి పనుల గురించి మాట్లాడుకోవడం కాదు. మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకోవాలి.

భర్తలు రొమాంటిక్ గా ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ... చాలా మందికి ఆ రొమాంటిక్ సెన్స్ ఉండదు. రొమాన్స్ అంటే... సెక్స్ కాదు.. చిన్న చిన్న విషయాలను కూడా రొమాంటిక్ గా మార్చుకోవచ్చు. భర్తలు రొమాంటిక్ మారేందుకు ఎలాంటి చిట్కాలు ఫాలో కావాలో ఓసారి చూద్దాం..


1.రొమాన్స్ అంటే... భార్య చేతిని ప్రేమగా పట్టుకున్నా... మనసుకు హత్తుకున్నా చాలు. అది కూడా అందరి ముందు చేయాలి అంటే కొందరు ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కనీసం వారి పక్కన కూర్చున్నా చాలు. ఎంత బిజీగా ఉన్నా... కాసేపు పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుకున్నా కూడా అది రొమాంటిక్ గానే ఉంటుంది.


2.చాలా మంది దంపతులు... మాట్లాడుకోవడం మొదలపెడితే చాలు... కేవలం తమ పిల్లల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ... రొమాంటిక్ గా ఉండాలి అనుకుంటే... పిల్లల టాపిక్ కాకుండా వేరే విషయాలు మాట్లాడుకోవాలి. పిల్లల గురించి కాదు అంటే... ఇంటి పనుల గురించి మాట్లాడుకోవడం కాదు. మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా రొమాంటిక్ గా ఉంటుంది.

3.ఒకరిపై ఒకరు సరదాగా జోక్స్ వేసుకోవడం చాలా కామన్. కానీ... మరీ సిల్లీ జోక్స్ వేసుకోకుండా ఉండాలి. ఒక్కోసారి అవి మనసుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

4.రొమాన్స్ అంటే ముద్దులు, హగ్గులు అని అనుకుంటారు చాలా మంది. కానీ... ఇంట్లో పనులతో అలసిపోయిన భార్య చేతులు, పాదాలకు మసాజ్ చేయడం కూడా.. రొమాంటిక్ గానే ఉంటుంది.
 

5.భార్యను ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన బహుమతులు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యూట్ గా ఉండేవి, ఆమెకు నచ్చేవి చిన్న చిన్న బహుమతులను కూడా  ఇవ్వచ్చు. ఇది కూడా రొమాంటిక్ గానే ఉంటుంది.
 


6.ఇక.. ఏదైనా మంచి సందర్భం వచ్చినప్పుడు... వారికి మీ బడ్జెట్ ని పక్కన పెట్టి కొంచెం ఖరీదైన బహుమతులు ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ఆమె తనకు తాను కొనుక్కోలేని వాటిని మీరు గిఫ్ట్ ఇవ్వడం బెటర్.
 

7.ఎప్పుడూ ఫోన్ లో మెసేజ్ లు చేయడం కాకుండా... రొమాంటిక్ గా... చిన్న నోట్స్ రాసి ఆమెకు మీ ప్రేమను తెలియజేయాలి. అది కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
 

Latest Videos

click me!