వైవాహిక జీవితానికి తొలి మెట్టు శృంగారం.. పెళ్లైన యువతీయువకుల మధ్య ఎంత చక్కటి శృంగారం ఉంటే వారి భావి జీవితం అంత అరమరికలు లేకుండా సాగుతుంది. అయితే పెళ్లైన కొత్తలో ఉన్న ఉత్సాహం రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోతుంది. అంతేకాదు పెళ్లైన కొత్తలో వెంటనే మూడ్ లోకి వచ్చే జంటలు ఆ తరువాత క్రమంగా టైం తీసుకుంటుంటాయి.
దీంతో ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే భాగస్వాములిద్దరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవడమే కాదు. తమ మీద ఎదుటివారికి ఆసక్తి కలిగేలా, ప్రేమ కురిసేలా ప్రవర్తించాలి.
మొదటి రాత్రి ప్రతీ జంటలో ఓ కొత్త అనుమానం ఉంటుంది. నెర్వస్ నెస్ తో పాటు ఇది వారి లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. అదేంటంటే తాము తమ పార్ట్ నర్ కి సెక్సీగా కనిపిస్తున్నానా లేదా అనే అనుమానం. అయితే ఈ అనుమానాన్ని మనసులోకి రాకుండా చేస్తేనే హ్యాపీగా ఉండొచ్చు.
ఇంకా ముఖ్యంగా మీ మనసులోని శృంగార కోరికల గురించి మీ పార్ట్ నర్ తో ముచ్చటించడం ద్వారా వారిలో మంచి మూడ్ పెరుగుతుంది. భాగస్వాములిద్దరూ మంచి మూడ్ లో ఉంటే వారి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. మూడ్ బాగాలేదనుకున్నప్పుడు మూడ్ ను పెంచుకునే పని కూడా మీదే. ఇలాంటి సమయంలో మీ పార్ట్ నర్ తో పడకగదిలో మూడ్ పెంచుకునేందుకు డర్టీ టాక్ ప్రారంభించండి.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మీరు మీ భాగస్వామి చెవిలో చెప్పే కొంటె మాటలతో వారిలో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి మాటల వల్ల మీ, మీ భాగస్వామి మూడ్ కూడా పెరుగుతుంది. ఇవి ఇరువురి మధ్య దగ్గరితనాన్ని పెంచడంతో పాటు.. మీ భాగస్వామికి ఆనందాన్ని కూడా అందిస్తాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన మాటలు, పనుల వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.
మీ పార్ట్ నర్ లో లైంగిక కోరికలను రేకెత్తించడానికి మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీ భాగస్వామి లైంగిక మూడ్‌ని పెంచే ముందు.. ముందుగా వారి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.
అలాంటి వాటికి మీరు కారణాలను కనుగొంటే.. మీ భాగస్వామి మూడ్ బాగు చేయడం మీకు చిటికెలో పని. దీంతో మీ కలయిక ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన శృంగారం గురించి కలలు కనడం ఏ మాత్రం తప్పు లేదు.
అందుకే మీ పార్ట్ నర్ బెడ్రూంలోకి రాగానే గోముగా ‘అబ్బా.. దీని కోసం నేను రోజూ చాలా వెయిట్ చేస్తున్నా.. తెలుసా' అంటూ వారిని రెచ్చగొట్టండి. వారిని కూడా రోజంతా అలా ఆలోచించేలా చేసేయండి.
మీకు మీ భాగస్వామిలో ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. దాన్ని అస్సలు ఆపొద్దని.. అలాగే కంటిన్యూ చేసేయమని ప్రోత్సహించండి. దాని వల్ల ఆ పనిని తరచూ చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో వారికి మీ మీద మరింత ఇష్టం పెరుగుతుంది. ఇది కూడా త్వరగా మూడ్ లోకి రావడానికి దోహదపడుతుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... శృంగార కార్యం గురించి మీ పార్ట్ నర్ మాట్లాడేంత వరకు ఎదురు చూడొద్దు. మీరే ముందుగా మొదలుపెట్టండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య శారీరకంగా మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా మితి మీరితే ప్రమాదం అన్న సంగతి తెలిసిందే కదా.
మీ భాగస్వామి రోజంతా ఆఫీసులో లేదా ఎక్కడైనా బయట పని చేసి వచ్చిన తర్వాత, తనను ప్రేమగా ఓదార్చండి. అదే సమయంలో ప్రైవేట్ ప్లేసులో టచ్ చేస్తూ.. ఓదార్పు మసాజ్ ఇచ్చేందుకు ట్రై చెయ్యండి. దీని వల్ల మీ భాగస్వామి మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. అందుకోసం సెక్సీ దుస్తులను ధరించండి. అప్పుడు మీ పార్ట్ నర్ నుండి ఒక రకమైన అట్రాక్షన్ ను గుర్తిస్తారు. అదే సమయంలో చెవిలో కొంటె మాటలను చెప్పేయండి.
మీ జీవిత భాగస్వామిని లైంగికంగా ప్రేరేపించడానికి మరో సులువైన మార్గం ఆ టైంలో ఎక్కువసేపు మూలుగుతున్నట్టు శబ్దం చేయడం, మీ పార్టనర్ చెవిలో గుసగుసలాడుతూ, బెడ్ మీద ఉన్నప్పుడు మీ ెదుటివారినుండి మీరేం ఆశిస్తున్నారో తెలపండి.
మీ భాగస్వామిని త్వరగా మూడ్ లోకి తీసుకురావాలంటే వాళ్ల ఫోన్‌ను సెక్సీ సందేశాలతో పింగ్ చేయవచ్చు. శృంగారం అనేది ఒక టైంకు సంబంధించిందే కాదు.. రోజూ జరిగే విషయాలు ఆ టైంలో మిమ్మల్ని పీక్ కు చేర్చడంతో సాయపడతాయి.
ఇద్దరికీ ఓకే అయితే రొమాన్స్ కు టైం అంటూ ఉండదు. అందులో షవర్ సర్ ఫ్రైజ్ ఒకటి. శృంగారానికి ముందు స్నానం చేసే సమయంలో మీరు అకస్మాత్తుగా మీ పార్ట్ నర్ ను షవర్ వద్దకు వెళ్లి సర్ ప్రైజ్ చేయండి. ఇద్దరం కలిసి స్నానం చేయాలనే కొత్త ఆలోచనను తనతో షేర్ చేసుకోండి.
ఇది ఆటోమేటిక్ గా మీ ఇద్దరిలో మూడ్ తెప్పిస్తుంది. దీంతో పాటు ఎదుటివారికి ఎంచక్కా పొగిడేయండి. మీరు తనతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీలవుతారో, శృంగారాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేయండి. అలా చెబితే తనలో కోరికలు రెట్టింపు అవ్వడమే కాదు.. మీ కోరికలన్నీ తీరిపోతాయి.