పోర్న్ మితిమీరితే.. అంగ స్తంభన సమస్యలు.. తాజా అధ్యయనం...

First Published | May 18, 2021, 4:32 PM IST

పోర్న్  వీడియోల‌ను చూసినంత సేపు.. చాలా ఆనందంగా అనిపించినా, అది స్లో పాయిజన్‌లా మీ మెదడును తొలిచేస్తుంది. మిమ్మల్ని ఒక మానసిక రోగిలా మార్చేస్తుందని హెచ్చ‌రిస్తోంది ఓ తాజా స్ట‌డీ. 

పోర్న్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతీ ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్, దాంట్లో డాటా.. ఇంటర్నెట్ లో ఎన్నో పోర్న్ సైట్లు.. ఇంకేముంది.. గంటల తరబడి వాటినే చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది.
undefined
దీనికి లాక్ డౌన్ కూడా తోడైంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం.. రెండో వ్యక్తితో సంబంధం లేకపోవడంతో పోర్న్ సైట్ల‌ను ఆశ్ర‌యించేవారు, ఆ వీడియోల‌ను చూసేవారు అమాంతం పెరిగిపోయార‌ని ప‌లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.
undefined

Latest Videos


మనదేశంలో పోర్న్ సైట్ల‌పై నిషేధం ఉంది. అయినా ఇంటర్నెట్ లో ఈ వీడియోలు ఏదో ఒక రూపంలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే, పోర్న్ వీడియోలు అతిగా చూస్తే ప్ర‌మాద‌మే అని హెచ్చ‌రిస్తోంది ఓ అధ్య‌య‌నం.
undefined
ఆ వీడియోల‌ను చూసినంత సేపు.. చాలా ఆనందంగా అనిపించినా, అది స్లో పాయిజన్‌లా మీ మెదడును తొలిచేస్తుంది. మిమ్మల్ని ఒక మానసిక రోగిలా మార్చేస్తుందని హెచ్చ‌రిస్తోంది ఆ స్ట‌డీ.
undefined
పోర్న్ వీడియోల‌పై తాజాగా 118 ప్రశ్నలతో ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా సర్వే నిర్వ‌హించారు బెల్జియం, డెన్మార్క్, యూకేలకు చెందిన పరిశోధకులు.. మొత్తం 3,267 మంది పురుషులు ఈ స‌ర్వేలో పాల్గొన్నారు.
undefined
ఇందులో హస్త ప్రయోగం, పోర్న్ ఎన్నిసార్లు చూస్తారు? ఎంతసేపు చూస్తున్నారు? భాగస్వామితో సెక్సును ఎంజాయ్ చేస్తున్నారా? లాంటి ప్రశ్నలను సంధించారు.
undefined
పోర్న్ పై జ‌రిగిన ఓ తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.. ఆ స్ట‌డీ విష‌యానికి వ‌స్తే.. పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో అంగ స్తంభన సమస్యలు ఎదుర్కొంటారని, పోర్న్ అతిగా చూసేవారికి సాధారణ సెక్స్‌పై ఆసక్తి క్ర‌మంగా త‌గ్గిపోతుంద‌ని.. ఇత‌రుల సెక్స్‌ను చూస్తూ ఆనందించే మానసిక సమస్యలు వ‌స్తాయ‌ని పేర్కొంది.
undefined
ఇక‌, స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన యూనివర్విటీ ఆఫ్ యాంట్వెర్ప్ హాస్పిటల్ ప్రొఫెసర్ గుంటెర్ డే విన్ అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు.
undefined
అత్యధికంగా పురుషులు పోర్న్ వీడియోలు చూస్తున్నార‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. వారంలో సుమారు 70 నిమిషాలు పోర్న్ చూస్తున్నార‌ని.. వీరిలో కొందరు 5 నుంచి 15 నిమిషాలు మాత్రమే చూసి వ‌దిలేస్తే.. ఇంకా కొంత‌మంది మాత్రం.. ఎక్కువగా అవే చూస్తున్నారని వెల్ల‌డించారు.
undefined
అయితే.. వీరిలో 35 ఏళ్ల వయస్సు లోపు పురుషుల్లో 23 శాతం మందికి అంగ స్తంభన సమస్యలు వ‌స్తున్నాయ‌ని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉండొచ్చ‌ని అంచ‌నా వేశారు.
undefined
పోర్న్ చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటు ప‌డేవారు.. త‌మ భాగ‌స్వామితో సెక్స్ చేసే స‌మ‌యంలో మాత్రం.. అంగం స్తంభన సమస్యల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని ప్రొఫెసర్ విన్ వెల్ల‌డించారు.
undefined
అతిగా పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేసేవారిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని... వారు సెక్స్ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేద‌ని పేర్కొన్నారు.. ఏదైనా అతిచేయ‌వ‌ద్దు అని పెద్ద‌లు చెబుతారు.. అతిగా పోర్న్ చూసినా.. మాన‌సిక స‌మ‌స్య‌లు పెరిగిపోయి.. అస‌లుకే ప్ర‌మాదం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది.
undefined
అతిగా పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేసేవారిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని... వారు సెక్స్ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేద‌ని పేర్కొన్నారు.. ఏదైనా అతిచేయ‌వ‌ద్దు అని పెద్ద‌లు చెబుతారు.. అతిగా పోర్న్ చూసినా.. మాన‌సిక స‌మ‌స్య‌లు పెరిగిపోయి.. అస‌లుకే ప్ర‌మాదం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది.
undefined
click me!