మీ రిలేషన్ షిప్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలనుకుంటున్నా? మీకోసం కొన్ని చిట్కాలు

First Published | Aug 20, 2023, 3:42 PM IST

రిలేషన్ షిప్ బాగుండాలంటే.. భాగస్వాములిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. వారి ఇష్టాఇష్టాలను, అవసరాలను తెలుసుకువాలి. అలాగే..
 

జీవిత భాగస్వామితో మీ బంధం బలపడాలంటే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, భావోద్వేగం, అంకితభావం ఖచ్చితంగా ఉండాలి. అయితే కొంతమంది చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తూ ఉంటారు. అలాగే రిలేషన్ షిప్ ను మెయిన్ టైన్ చేస్తుంటారు. కానీ ఇవి మాత్రమే సరిపోవు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండటానికి. 
 

మీ జీవిత భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి, సంతృప్తి చెందడానికి, శాశ్వత ఆనందాన్ని పొందడానికి కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా రిలేషన్ షిప్ లో ఫెయిల్ అయినా.. ప్రస్తుత సంబంధంలో ఇలాంటి రాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. 


మీకు తెలుసా? ప్రతి సంబంధం డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలవడానికి, కలిసి ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ రిలేషన్ షిప్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు కలిసి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు వంటి విషయాలను పంచుకోవడం వల్ల మీ రిలేషన్ షిప్ సాఫీగా సాగుతుంది. అలాగే మీ రిలేషన్ షిప్ జీవితకాలం ఉండాలంటే మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడండి. ఇవి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. 
 

రిలేషన్ షిప్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమంటే? 

ఇద్దరి మధ్యనున్న ఆకర్షణ, మోహం దశల తర్వాత రిలేషన్ షిప్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడం. అంటే ఒకరినొకరు నమ్మడం, సహకార భావన, భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడం వంటివి దీనిలో ఉంటాయి. సరైన కమ్యూనికేషన్, ఒకరినొకరు గౌరవించుకోవడం, జంటగా మారడానికి సుముఖత వంటివి మీ రిలేషన్ షిప్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి అవసరపడతాయి. ఇందుకోసం కొన్ని చిట్కాలు..
 

సమయం

మీ భాగస్వామితో మీరు రోజంతా గడపాల్సిన పని లేదు. కాకపోతే రోజుకు కొన్ని నిమిషాలైనా ఒకరికోసం ఒకరు కాస్త సమయాన్ని కేటాయించాలి. ఇది ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. విడిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. నాకోసం వీరున్నారు అన్న భావనను కలిగిస్తుంది. 
 

చిన్న చిన్న హావభావాలు

థ్యాంక్స్, ఐ లవ్ యూ, లవ్ యూ టూ వంటివి చిన్న చిన్న మాటలే కావొచ్చు. కానీ ఇవి మీ రిలేషన్ షిప్ ను బలపరుస్తాయి. ప్రేమను తెలియజేస్తాయి. అందుకే సమయం వచ్చినప్పుడల్లా మీ భాగస్వామికి ఇలాంటి మాటలు చెప్తూ ఉండండి. 
 

ప్రోత్సాహం

రిలేషన్ షిప్ లో ఉన్నవారు ఒకరిని చూసి ఒకరు ఈర్శ పడకూడదు. ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఉత్సాహపరుచుకోవాలి. ఇవి మీ ఇద్దరు ఎదగడానికి సహాయపడతాయి. అలాగే మీ మద్దతు వారికి ఉంటుందన్న భరోసను కలిగిస్తాయి.
 

ఓపెన్ కమ్యూనికేషన్

రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. ఇది మీ బలహీనతలను పోగొడుతుంది. అలాగే మీ మనసులో ఎలాంటి భయాలను లేకుండా చేస్తుంది. అలాగే మీ భావోద్వేగ సంబంధం బలపడుతుంది. అందుకే ఏ విషయమైనా ఓపెన్ గా అడగండి. అన్ని విషయాలను షేర్ చేసుకోండి.

చిన్న చిన్న విషయాలే కావొచ్చు. కానీ ఇవి మీ బంధంలో చిచ్చుపెడతాయి.  ఇది మీ ఇద్దరు విడిపోవడానికి దారితీస్తుంది. అందుకే ఏదున్నా చేప్పేయండి. ఇది మీ కనెక్షన్ ను పెంచుతుంది. సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. భద్రత, నమ్మకం, భావోద్వేగ శ్రేయస్సు భావాలు కూడా పెరుగుతాయి. 
 

ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం, కొత్త విషయాలను ప్రయత్నించడం, భాగస్వామిని మెచ్చుకోవడం, వారికి మద్దతుగా ఉండటం , ఓపెన్ గా మాట్లాడటం వంటివి సాధారణ విషయాలే కావొచ్చు. కానీ ఇవి మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడతాయి. 
 

Latest Videos

click me!