వీటి కోసమైనా రోజూ సెక్స్ చేయాలి..!

First Published | Feb 2, 2021, 3:08 PM IST

కేవలం శారీరక, మానసిక తృప్తి కలగడమే కాదు.. అనేక ప్రయెజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు చూస్తే..  వీటికోసమైనా శృంగారంలో రోజూ పాల్గొనాలి అని అనిపించకమానదు..

శృంగారం అనగానే.. రెండు శరీరాల కలయికగా చాలా మంది భావిస్తారు. కానీ.. మనసుల కలయిక భావించాలి. శృంగారంలో పాల్గొంటే కేవలం శారీరక, మానసిక తృప్తి కలగడమే కాదు.. అనేక ప్రయెజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు చూస్తే.. వీటికోసమైనా శృంగారంలో రోజూ పాల్గొనాలి అని అనిపించకమానదు..కానీ ప్రతి రోజు సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ఉపయెగాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
undefined
శృంగారంలో చురుగ్గా పాల్గొనే వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని తాజాగా చేసిన అధ్యయనంలో తెలిసింది. ఎక్కువ సెక్స్ చేసే వారు క్రిములు, వైరస్ లాంటి ఇతర సమస్యలతో పోరాడే శక్తి కలిగి ఉంటున్నారట.
undefined

Latest Videos


వారంలో ఒకటి రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారి కన్నా.. ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు స్టడీలు చెబుతున్నాయి.
undefined
మూత్రం ఆపుకోలేని పరిస్థితి నుంచి బయటపడేందుకు బలమైన కటి అంతస్థు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు పరిస్థితుల కారణంగా చాలా సేపు మూత్రం నియంత్రించుకోవాల్సి వస్తుంది.
undefined
అయితే రోజు సెక్స్ చేయడం అనేది మూత్రాశయ కండరాలకు వ్యాయామంలా మారి కటి అంతస్థు బలంగా తయారవుతుంది.
undefined
శృంగారానికి బ్లడ్ ప్రెజర్ కు చాలా దగ్గరి సంబంధం ఉంటుందట. ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల బీపీ తగ్గుతుందని చాలా స్టడీల్లో తేలిందట.
undefined
శృంగారం అనేది ఓ రకమైన వ్యాయామం. నిమిషానికి 5క్యాలరీలను కరింగించే శక్తి సెక్స్ కు ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచడమే కాక.. మీ కండరాలకు వ్యాయామంలా పనిచేస్తుంది.
undefined
శృంగార జీవితాన్ని తృప్తిగా గడిపే వారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారు. సెక్స్ మీ హార్ట్ రేట్ పెంచడమే కాక, మీ ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరోన్ స్థాయిలను బ్యాలన్స్ చేస్తుంది.
undefined
వీటిలో ఏది తగ్గినా ఓస్టియెపొరొసిస్, గుండె జబ్బు లాంటి రకరకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లైనా సెక్స్ చేస్తే గుండెను కాపాడుకున్నవారవుతారు.
undefined
కాళ్ల నొప్పులు, నడుము నొప్పి లాంటివి రాగానే వెంటనే ఆస్పిరిన్ లాంటి మాత్రల కోసం వెతుకుతుంటారు. దీనికి బదులు ఉద్వేగాన్నిపెంచుకునే ప్రయత్రం చేయండి.
undefined
ఎందుకంటే.. యోని ఉద్దీపన అనేది దీర్ఘకాలిక వెన్ను నొప్పి, కాలు నొప్పి లాంటి వాటిని నిరోధిస్తుంది. దీంతో పాటు చాలా మంది మహిళల్లో జననేంద్రియ స్వీయ-ప్రేరణ అనేది తిమ్మిరి, తలనొప్పి, ఆర్థరైటిక్ నొప్పులను తగ్గిస్తుంది.
undefined
తరచుగా స్థలనం చేసే పురుషుల చాలా తక్కువ శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు కొన్ని స్టడీలు చెబుతున్నాయి. దీనికి భాగస్వామి కూడా అవసరం లేదు. లైంగిక సంపర్కం, రాత్రిపూట ఉద్గారాలు మరియు హస్త ప్రయోగం వీటిలో ఏదైనా మంచి ఫలితం ఉంటుంది.
undefined
సెక్స్ చేసిన తర్వాత త్వరగా నిద్రపడుతుంది. మీలో ఉద్వేగం పెరగడం వల్ల ప్రొలాక్టిన్ బయటకొచ్చాక మీకు తెలియకుండానే శరీరం అలసిపోయి.. మిమ్మల్ని త్వరగా నిద్రపుచ్చుతుంది.
undefined
మీ భాగస్వామితో దగ్గరగా ఉంటే మీ ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుంది. ముట్టుకోవడం, హత్తుకోవడం లాంటివన్నీ మీ శరీరంలో హార్మోన్లను రిలీజ్ అవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా సెక్స్ చేయడం వల్ల మీ బ్రెయిన్ హ్యపీ కెమికల్ రిలీజ్ చేసి.. మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.
undefined
click me!