ఒంటరిగా మహిళ కనపడితే చాలు.. తమ శృంగార కోరికలు తీర్చుకోవాలని తాపత్రయపడే మగమహారాజులు మన సమాజంలో చాలా మంది ఉంటారు. అయితే.. వారి మనసులో కోరికను చాలా మంది భయటపెట్టరు. కొందరు మాత్రమే తమ మనసులో ఏముందు సిగ్గు లేకుండా అడిగేస్తుంటారు.
వారి కోరిక విని అటువైపు స్త్ర్రీ వారిని చీదరించుకున్నా కూడా పట్టించుకోని బాపతి కూడా కొందరు ఉంటారు. ఇక మరికొందరు.. అవతలి వ్యక్తి అభిప్రాయం తో సంబంధం లేకుండా.. దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతుంటారు.
అయితే.. తాజాగా కొన్ని పాశ్చాత్య దేశాల్లో వింత సంస్కృతి మొదలైంది. అద్దె ఇంటి కోసం ప్రయత్నించే ఒంటరి మహిళలలపై ఈ కామాంధులు కన్ను వేస్తున్నారు.
రెంట్ కోసం ఇళ్లు ఖాళీగా ఉందా అని వచ్చిన అడిగిన వారికి తమ మనసులో మాట బయటపెడుతున్నారు. ఒప్పుకున్నవారికి ఇళ్లు ఇచ్చి తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు.
మొన్నటి వరకు ఇలా ఇంటికి వచ్చిన వారిని మాత్రమే అడిగారు. ఇప్పుడు దాంట్లో వారు ఆరితేరిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ చెప్పి చెప్పి అడిగి, అడిగి విసిగిపోయేరేమో ఈ మేరకు ప్రకటన ఇచ్చారు.
మా శృంగార కోరికలు తీర్చేవారికి ఇంటిని అద్దె కట్టాల్సిన పనిలేకుండా ఉచితంగా ఇస్తామంటూ కొందరు ప్రకటన ఇవ్వడం విశేషం. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లండన్‌తోపాటు మొత్తం యూకేలో ఇప్పుడు రెంట్ ఫర్ సెక్స్ ప్రకటనలు ఎక్కువయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ తరహా ప్రకటనలు ఇప్పుడు అక్కడ పత్రికల్లో, ఇతర చోట్ల బహిరంగంగానే కనిపిస్తున్నాయి.
దీని ఉద్దేశం ఏమిటంటే.. ఎవరైనా యువతి లేదా మహిళ ఒంటరిగా ఉండి అలాంటి ఆమెకు ఇల్లు అద్దెకు కావల్సి వస్తే ఇంటిని రెంట్‌కు ఇస్తారు. కాకపోతే ఇంటి రెంట్‌ను ఇవ్వాల్సిన పనిలేదు.
అందుకు బదులుగా ఇంటి యజమానితో శృంగారంలో పాల్గొనాలి. ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలోనే ఇంటి యజమాని ఇలాంటి నిబంధన పెడతాడు.
అందుకు నచ్చితే ఇంట్లో రెంట్‌కు దిగవచ్చు. అనంతరం ఇంటి యజమాని చెప్పినప్పుడు అతనితో శృంగారంలో పాల్గొనాలి. దీంతో నెల నెలా అసలు రెంట్ ఇవ్వాల్సిన పనే లేదు.
తొలుత ఈ విధానం కేవలం లండన్ నగరంలో మాత్రమే కనపడేది. ఇప్పుడు యూకే మొత్తం పాకేసింది. అయితే ఇలా చేయడం చట్ట వ్యతిరేకమట. ఇందుకు అక్కడ 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.
కానీ ఇంటి యజమానులు మాత్రం మహిళలు తమ అంగీకారంతోనే శృంగారంలో పాల్గొంటున్నారని, అలాంటప్పుడు తాము తప్పు చేసినట్లు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రకం నేరాన్ని ప్రముఖ మీడియా సంస్థ ఒకటి తమ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం విశేషం.
ఇది యూకేలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కొత్తగా యూఎస్ కి కూడా పాకేసింది. ఈ కరోనా వైరస్ కాలాన్ని యూఎస్ లో మరింత ఎక్కువగా ఇంటి యజమానులు వినియోగించుకోవడం గమనార్హం.
కరోనా నేపథ్యంలో జన సంచారం కాస్త తక్కువగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోవడం బెటర్ అని చూసే మహిళలపై కన్నేసి వారి కామ వాంఛ తీర్చుకుంటున్నారు.