శృంగారంలో ఇలాంటి ఫోబియాలకు మీకూ ఉన్నాయా..?

First Published | Feb 5, 2021, 3:00 PM IST

పతుల మధ్య కలయిక విషయంలో ఉండే అపోహలపై తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చాలా మందికి లైంగిక జీవితం పట్ల పెద్దగా అవగాహన ఉండదు. చదువుకోనివారికే కాదు.. విద్యావంతుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది కలయిక అంటేనే భయపడిపోతున్నారు. అంతేకాదు.. ఏవేమో అనుమానాలు మనసులో పెట్టుకొని బాధపడిపోతున్నారు.
ఈ క్రమంలో జీవితభాగస్వామితో సంతోషంగా కలయికలో పాల్గొనకుండా, వారికి పూర్తిగా సహకరించకుండా మానసకింగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలో కలయిక అంటేనే అనాసక్తి కలుగుతుంది.

దీంతో.. శృంగారాన్ని యాంత్రికంగా భావించి.. పూర్తి స్థాయిలో ఆనందించలేని పరిస్థితికి వచ్చేస్తారు. అయితే.. అవన్నీ వట్టి అపోహలు అన్న విషయాన్ని దంపతులు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దంపతుల మధ్య కలయిక విషయంలో ఉండే అపోహలపై తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శృంగారం విషయంలో ఎక్కువగా అనుమానాలు ఏ విషయంలో కలుగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించగా.. సుఖ వ్యాధులు వస్తాయేమో అని భయపడిపోతున్నారట.
శృంగారం విషయంలో ఎక్కువగా అనుమానాలు ఏ విషయంలో కలుగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలించగా.. సుఖ వ్యాధులు వస్తాయేమో అని భయపడిపోతున్నారట.
కాగా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. సుఖ వ్యాధులు వస్తాయి అనుకోవడం కేవలం వారి భయమేనని చెబుతున్నారు. సుఖవ్యాధులు అందరికీ రావని సూచిస్తున్నారు.
సుఖ వ్యాధులు వస్తాయనే భయంతో శృంగారానికి దూరంగా ఉండటాన్ని సిప్రిడోఫోబియా అంటారట. దీని నుంచి బయటపడాలంటే.. వారి సమస్యను సంబంధిత వైద్యులకు చెప్పాలట. వారి ద్వారా ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు.
చిన్న వయసులో సెక్స్ లో పాల్గొనడం, ఒకరికన్నా ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉండటం.. పెళ్లికి ముందే హద్దులు దాటడం లాంటివి చేసేవారికి మాత్రం ఇలాంటి సుఖవ్యాధులు వస్తాయని లేకపోతే రావని చెబుతున్నారు.
అంతేకాకుండా.. ఆనందకరమైన శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. కొన్ని సూచలనలు ఫాలోకావాలని నిపుణులు చెబుతున్నారు.
శృంగార జీవితం ఆనందంగా ఉండాలంటే.. మంచి పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం తీసుకోవాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా అలసట, ఒత్తిడి లాంటివి ఉండవు.
కొన్ని రకాల అనారోగ్యాలు కూడా లైంగిక జీవితానికి ఆటంకంగా మారే ప్రమాదం ఉందట. కాబట్టి.. అలాంటివాటిని కూడా అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. వాటిలో మధుమేహం, హై బీపీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లాంటివి ముందు వరసలో ఉంటాయి.
భార్యభర్తల మధ్య జరిగే తగాదాలు కూడా లైంగిక జీవితానికి ఆటంకంగా మారతాయి. కాబట్టి చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే..వీలైనంత వరకు దూరం చేసుకోవాలి.

Latest Videos

click me!