వైవాహిక బంధంలో ఎన్ని కష్టాలు (Difficulties) వచ్చినా ఒకరికి ఒకరు తోడుంటూ ధైర్యం చెప్పుకుంటే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతాయి. భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ వారి బాధ్యతలను సమానంగా (Equally) పంచుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ఏ కష్టంలోనైనా నీ వెంట నేనున్నాననే భరోసా ఉండాలి.
ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు (Hides) లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఒకరి గురించి ఒకరు పట్టించుకునే సమయం దొరకడం లేదు. కానీ మీ భాగస్వామి బాగోగులను అడిగి తెలుసుకోవడం మీ బాధ్యత (Responsibility). మీ పని ఒత్తిడి కారణంగా మీరు ఎంత బిజీగా ఉన్నా వారితో కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించాలి.
భాగస్వామి మాటలకు, ఇష్టాలకు గౌరవం (Respect) ఇవ్వాలి. అయితే జీవితంలో తప్పులు సర్వసాధారణం. ఏ కారణం చేతైనా మీ భాగస్వామి తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అంతే కానీ వాటిని వేలెత్తి చూపుతూ మరింత ఇబ్బందికి (Trouble) గురి చేయరాదు. వారు ఏ దారిలో వెళితే మంచి జరుగుతుందో ఆ దారిని మీరు నిర్దేశించాలి.
తప్పు దారిలో వెళ్తుంటే వారిని మందలిస్తూ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయాలి. భాగస్వామి చేసే ఏ చిన్న పనినైనా చులకనగా చూడరాదు. వారిని ప్రోత్సహిస్తూ (Encouraging) ముందుకు సాగేలా తమ వంతు ప్రయత్నం చేయాలి. మీ మధ్య జరిగిన చిన్నచిన్న గొడవలను (Conflicts) వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.
అంతే కానీ వాటిని సాగదీస్తూ బంధం విడిపోయే వరకు తీసుకురాకూడదు. మీ వైవాహిక జీవితంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం (Believe) అనేది ఉండాలి. నమ్మకం లేని బంధం విడిపోవడానికి దారితీస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, నమ్మకం అనేవి పునాదిరాళ్లు (Cornerstones) వంటివి. ఇవి లేని బంధం శాశ్వతం కాదు.
నలుగురిలో ఉన్నప్పుడు భాగస్వామి గురించి చులకనగా మాట్లాడరాదు. మీ వైవాహిక బంధం గురించి ఇతరులతో పంచుకోవడం (Sharing) మంచిది కాదు. మీ వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి జోక్యం (Intervention) చేసుకోకుండా చూసుకోవాలి. మీ మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను మీరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
వైవాహిక బంధంలో సర్దుకుపోవడం (Adjusting) అలవరచుకోవాలి. అన్ని పనులను ఇద్దరూ సమానంగా పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. భాగస్వామి తీసుకునే నిర్ణయంలో తప్పులు ఉంటే మీరు వాటిని తెలియజేసే ప్రయత్నం చేయాలి. వారు చెడు అలవాట్లకు (Bad habits) బానిసలవుతుంటే దాని కారణంగా కలిగే నష్టాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఇలా ఈ నియమాలు పాటిస్తే మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది.