అందమైన అనుబంధానికి.. ప్రతీరోజూ కొత్తగా ప్రేమలో పడండి..

First Published | Feb 11, 2021, 11:42 AM IST

ప్రేమ అందరికీ ఉంటుంది. కానీ అది వ్యక్తీకరించాలి. మీ మనసులోని అప్యాయతను అందమైన పదాల్లో తెలపగలగాలి. కొన్ని విషయల్లో నిర్మోహమాటంగా ఉండాలి. అదే సమయంలో ఎదుటి వ్యక్తి బాధపడకుండా సున్నితంగా చెప్పాలి. ప్రపంచంలో తనకంటే ఏదీ ముఖ్యం కాదు అనేభావన మీ భాగస్వామిలో కలిగించాలి. 

ఏ బంధాన్ని నిలబెట్టుకోవడానికైనా దానికి మనమెంత ప్రాముఖ్యత ఇస్తున్నామనేది తెలిసి ఉండాలి. ముఖ్యంగా జీవితకాలం కలిసి ప్రయాణం చేస్తున్నవాళ్లు ఒకరి కోసం ఒకరు ఏం చేస్తున్నారు అనేదానిమీద చాలా క్లారిటీ ఉండాలి.
ప్రేమ అందరికీ ఉంటుంది. కానీ అది వ్యక్తీకరించాలి. మీ మనసులోని అప్యాయతను అందమైన పదాల్లో తెలపగలగాలి. కొన్ని విషయల్లో నిర్మోహమాటంగా ఉండాలి. అదే సమయంలో ఎదుటి వ్యక్తి బాధపడకుండా సున్నితంగా చెప్పాలి. ప్రపంచంలో తనకంటే ఏదీ ముఖ్యం కాదు అనేభావన మీ భాగస్వామిలో కలిగించాలి.

తనతో గడిపే సమయం మీకెంత అపురూపమో చెప్పగలగాలి. మరి ముఖ్యంగా కొన్ని విషయాలు పదే పదే చెబుతుండాలి. అప్పుడే మీ బంధం ఇంకా బలంగా తయారవుతుంది. కలకలం సంతోషంగా సాగుతుంది.. అలాంటి విషయాలు ఏంటో .. ఎలా చెప్పాలో మీ కోసం..
నీతో గడిచిన క్షణాలు నాకు ఎంతో అద్భుతం. నిన్ను గెలవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాను. అది రోజులు, నెలలు, సంవత్సరాలైనా సరే ఎప్పటికీ నిన్ను గెలుచుకుంటూనే ఉంటాను.. అదే నీకు నా వాగ్ధానం.. అని చెప్పండి.
విమర్శలను ఎదుర్కోండి : మన మధ్య వచ్చే సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడానికి నేను ఎళ్లవేళలా సిద్దంగా ఉంటాను. అది ఎంత కష్టతరమైనదైనా సరే పారిపోను, దాటవేయను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తాను.
నీతో ఉన్నంతసేపు బోర్ అనేది ఉండదు : నువ్వు చెప్పిన స్టోరీనే పదే పదే చెప్పినా వింటాను. అది 4-7 సార్లు సేమ్ స్టోరీ చెప్పినా నేను మొదటిసారి విన్నంత ఉత్సాహంగానే వింటాను. కాకపోతే నిన్ను నొప్పించకుండా అది ఇంకోసారి చెబితే నాకు పిచ్చక్కుతుంది అంటూ సరదాగా గుర్తు చేస్తాను.
హద్దులు దాటకండి : ఏ విషయమైన మనసువిప్పి మాట్లాడడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీ ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరించను. ఒకరి విషయాల్లో ఒకరు ఎంత వరకు జోక్యం చేసుకోవాలో, చేసుకోవద్దో క్లియర్ గా మాట్లాడుకుందాం. దాని ప్రకారమే నడుచుకుందాం.
హద్దులు దాటకండి : ఏ విషయమైన మనసువిప్పి మాట్లాడడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీ ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరించను. ఒకరి విషయాల్లో ఒకరు ఎంత వరకు జోక్యం చేసుకోవాలో, చేసుకోవద్దో క్లియర్ గా మాట్లాడుకుందాం. దాని ప్రకారమే నడుచుకుందాం.
గతం గతహా... : నాతో పరిచయానికి ముందు నీ గతంలో ఏం జరిగిందో నాకు అప్రస్తుతం. అది ఇప్పటికీ నిన్ను వేధిస్తున్నా సరే. నేను దాని గురించి మాట్లాడను. అసలు నాకు అది అంత అవసరమైన విషయం కాదు. నాకు ప్రస్తుతమున్న నువ్వు ముఖ్యం.
నువ్వు ఇష్టపడేవారిని ఇష్టపడతా.. : నీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను నువ్వు ఎంతగా ఇష్టపడతావో.. అంతగా ఇష్టపడడానికి ప్రయత్నిస్తాను. మనిద్దరం వేరు వేరు బ్యాక్ గ్రౌండ్స్ నుండి వచ్చినా సరే నా ప్రయత్నాన్ని వదలను.
సర్దుకుపోదాం : మన మధ్య ఏవైనా గొడవలు వచ్చినప్పుడు నేను హార్షగా ఉండను. నిన్ను నొప్పించేలా వ్యవహరించను. సర్దుకు పోవడానికి ప్రయత్నిస్తాను. మన బంధం బలపడాలంటే.. నిన్ను కాపాడుకోవాలంటే నాకు అదే ముఖ్యం.
ప్రతీరోజూ కొత్తగా ప్రేమలో పడతా : ప్రతిరోజూ నీతో మళ్లీ మళ్లీ కొత్తగా ప్రేమలో పడడానికి కావల్సిన కారణాలు వెతుక్కుంటా. నీతో అద్భుతమైన ఆ ఆనంద క్షణాలను పదే పదే కోరుకుంటా.
నీకోసమే నేను : నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నీకోసం ఎంత సమయాన్నైనా వెచ్చిస్తా. వేరే ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, బిజీ షెడ్యూల్ నా కోసం ఎదురు చూస్తున్నా నువ్వే నా మొదటి ప్రాధాన్యత.
నీ ఇష్టాలే నా ఇష్టాలు : నీకు ఇష్టమైనవన్నీ నాకూ, ఇష్టాలే.. అవి ఎంత బోరింగ్ గా, భయంకరంగా ఉన్నా నీ ఇష్టాలు, పనులను నేను ఇష్టపడతాను. వాటిని నీతో షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.

Latest Videos

click me!