వర్క్ టెన్షన్.. హడావిడిగా శృంగారం.. మంచిదేనా?

First Published | Mar 30, 2021, 3:18 PM IST

కొందరైతే ఈ విషయంలో మొక్కుబడిగా వ్యవహరిస్తారు. మరికొందరు అసలు శ్రద్ధ కూడా కనిపించరు. అయితే... ఇది ఇలానే కొనసాగితే మీ దాంపత్య బంధానికి బీటలు బారడం ఖాయం.

ప్రేమ అయినా, పెళ్లి అయినా... కొత్తలో బాగానే ఉంటుంది. ఆ బంధంలో ప్రతి ఒక్కటీ తాజాగా ఉంటాయి కాబట్టి.. దానిని ఆసాంతం ఆస్వాదించగలుగుతారు.
కొంత కాలం తర్వాత ప్రేమ మీద, పెళ్లి మీద చాలా మంది బోర్ కొట్టేస్తుంది. తమ జీవిత భాగస్వామికి కనీసం సమయం కేటాయించరు. రోజూ చూసే ముఖమే కదా... రోజూ మాట్లాడే మాటలే కదా అని తేలికగా తీసి పారేస్తుంటారు.

శృంగారం విషయంలోనూ చాలా మంది ఈ విధంగానే ప్రవర్తిస్తుంటారు. మొదట్లో శృంగారం పట్ల అత్యుత్సాహం చూపించిన వారే.. తర్వాత దాని గురించి ఆలోచించడమే మానేస్తారు.
కొందరైతే ఈ విషయంలో మొక్కుబడిగా వ్యవహరిస్తారు. మరికొందరు అసలు శ్రద్ధ కూడా కనిపించరు. అయితే... ఇది ఇలానే కొనసాగితే మీ దాంపత్య బంధానికి బీటలు బారడం ఖాయం.
అయితే... కొన్ని రకాలుగా శృంగారంలో మార్పులు చేసుకుంటే... బోర్ కొట్టకపోగా.. సెక్స్ పట్ల మళ్లీ ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు జీవితంలో ఒక్కసారైనా ఇలా సెక్స్ లో పాల్గొనాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..
యాంగ్రీ సెక్స్..భార్య, భర్తలు అన్నాక.. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. చాలా మంది గొడవ జరిగినప్పుడు తమ పార్ట్ నర్ తో కొంతకాలం మాట్లాడకుండా , అసలు సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు.
దీని వల్ల పెద్దగా లాభం ఉండదట. అదే అలా కాకుండా గొడవ జరిగినవెంటనే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి.. వెంటనే సెక్స్ లో పాల్గొంటే.. చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికంటే.. గొడవ తర్వాత శృంగారంతో చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చనేది నిపుణుల సలహా.
నిద్ర లేస్తూనే..సాధారణంగా శృంగారానికి రాత్రిపూటే మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే.. రాత్రి సమయంలో కన్నా.. ఉదయం పూట చేస్తే ఇంకా బాగుంటుందట. దీని వల్ల ఒత్తిడి, టెన్షన్లు తగ్గిపోయి.. ఆ రోజు మొత్తం ఉల్లాసంగా గడుపుతారు.
రాత్రంతా..చాలా మందికి రాత్రి మొదలుకొని మళ్లీ తెల్లారేవరకు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కాకపోతే అది ఆచరణలో సాధ్యం కాదు. కానీ.. ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేయమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు.
అలాంటి వాళ్లు.. వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండటం కారణంగా.. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తుంటారు. వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలో జీవిత భాగస్వామితో కొంచెం ఫాస్ట్ గా సెక్స్ చేసినా మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు అలా చేసినా బాగుంటుందని సూచిస్తున్నారు.

Latest Videos

click me!