శృంగారంలో సిగ్గు పక్కన పెట్టాల్సిందే..!

First Published | Jun 10, 2021, 10:33 AM IST

ఈ విషయంలో చాలా మందిని సిగ్గు ఆపేస్తూ ఉంటుంది. అది చివరకు.. కనీసం సెక్స్ ఎంజాయ్ చేయడానికి కూడా అడ్డుగా మారే ప్రమాదం ఉంది. 

రోజురోజుకీ సమాజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ.. శృంగారం గురించి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బహిరంగంగా చర్చించడం తప్పుగా భావిస్తుంటారు. దానిని చాటు మాటు వ్యవహారంగానే భావిస్తుంటారు.
అసలు శృంగారం గురించి మాట్లాడటం.. ముఖ్యంగా పిల్లల ముందు దాని గురించి అవగాహన కల్పించడం... సన్నిహితులతో చర్చించడానికి కూడా ఇష్టపడరు.

ఈ సెక్స్ విషయంలో చాలా మంది తమ కోరికలు, ఇష్టాలను కనీసం బయటకు చెప్పడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఈ విషయంలో చాలా మందిని సిగ్గు ఆపేస్తూ ఉంటుంది. అది చివరకు.. కనీసం సెక్స్ ఎంజాయ్ చేయడానికి కూడా అడ్డుగా మారే ప్రమాదం ఉంది. మరి దీనిని ఎలా అధిగమించాలో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
ఫ్లర్టింగ్.. దీనిని చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ.. దీనిలో చాలా పవర్ ఉంటుందట. ఫ్లర్టింగ్ అంటే ఇష్టపడని.. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ ఉండరట.
శృంగారంలో పడక గదిలో మీకు ఏం కావాలనే విషయాన్ని ఫ్లర్టింగ్ ద్వారా మీ పార్ట్ నర్ కి తెలియజేయాలట. శృంగారం కేవలం పడకగదిలోనే ప్రారంభం కాదట. ఎక్కడ ఎలా అయినా.. మాటలతో కూడా మొదలుపెట్టవచ్చని సూచిస్తున్నారు. ఫ్లర్టింగ్ తో రొమాంటిక్ నోట్ ఇస్తే.. తర్వాత దానిని పూర్తిగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.
మీకు శృంగార భావన కలిగినప్పుడు.. ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ కి తెలియజేయడానికి సిగ్గు అడ్డొస్తుందా..? అయితే.. మీరు సెక్సీగా డ్రెస్ చేసుకొని.. మీ పార్ట్ నర్ ముందు నిలపడితే సరిపోతుంది. వాళ్లకి మీ మనసులో ఉన్న విషయం అర్థమౌతుంది.
మీకు శృంగార భావన కలిగినప్పుడు.. ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ కి తెలియజేయడానికి సిగ్గు అడ్డొస్తుందా..? అయితే.. మీరు సెక్సీగా డ్రెస్ చేసుకొని.. మీ పార్ట్ నర్ ముందు నిలపడితే సరిపోతుంది. వాళ్లకి మీ మనసులో ఉన్న విషయం అర్థమౌతుంది.
ఇక మీ పార్ట్ నర్ ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసి ఒత్తిడిలో ఉన్నారనుకోండి.. సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు. అలాంటప్పుడు వారి మూడ్ మొత్తం మీరు మార్చేయాలి. ఒత్తిడి తగ్గించడానికి.. ముందు పడక గదిని అందంగా అలంకరించాలి. గదిలో మంచి వాసనలు వెదజల్లే ఏర్పాట్లు చేయాలి. అప్పుడు మీ పార్ట్ నర్ కి కూడా రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుంది.
చాలా మంది మహిళలు.. సెక్స్ లో తమకు కావాల్సిన విషయాన్ని డైరెక్ట్ గా అడగలేరు. ఆ విషయంలో ఎక్కువగా సిగ్గుపడుతుంటారు.
అయితే.. కావాల్సిన దానిని అడగడంలో తప్పులేదు. అయితే.. మీ పార్ట్ నర్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ.. వారు తమను ఎంతో సంతృప్తిపరచగలరనే విషయాన్ని తెలియజేస్తూ.. మీకు కావాల్సినది అడగడంలో తప్పులేదని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!