ఉదయాన్నే ఇలా చేస్తే... రాత్రి రెచ్చిపోవచ్చు..!

First Published | Feb 18, 2021, 3:04 PM IST

శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి బాగా ఎంజాయ్ చేయాలని ప్రతిఒక్కరూ ఏవేలో కలలు కంటుంటారు. కానీ కొంతమంది మంచం మీదకి వెళ్లగానే డీలా పడిపోతుంటారు. ఎప్పటికప్పుడు ఇలానే నిరాశపడుతుంటారు.

శృంగారం గురించి ప్రతి ఒక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. ఎలా ఆలోచించినా.. దానిపై ఆసక్తి మాత్రం అందరికీ ఉంటుంది. శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి బాగా ఎంజాయ్ చేయాలని ప్రతిఒక్కరూ ఏవేలో కలలు కంటుంటారు. కానీ కొంతమంది మంచం మీదకి వెళ్లగానే డీలా పడిపోతుంటారు. ఎప్పటికప్పుడు ఇలానే నిరాశపడుతుంటారు.
దానికి కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉదయాన్నే లేచి పడక గదిని, ముఖ్యంగా మంచాన్ని శుభ్రం చేసుకునే వాళ్లు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటారట. పరిశోధనలో రెండు గ్రూపులుగా విడదీసి మరీ పరిశోధన చేయగా.. ఈ విషయం వెల్లడయ్యింది.

ఉదయాన్నే లేచి అలానే వెళ్లిపోయే వారు, మంచాన్ని, పడకగదిని శుభ్రం చేసుకునే వాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీశారు. వీరిలో మంచాన్ని సర్దుకోకుండా అలాగే వదిలేసే వారికన్నా.. ఉదయాన్నే లేవగానే మంచాన్ని శుభ్రంగా, అందంగా ఉంచుకునే వారు 25శాతం శృంగారంలో ఎక్కువ సేపు గడుపుతున్నారని తేలిందట
మంచం చిందరవందరగా ఉండటం వల్ల మూడ్ ఆఫ్ అయి.. శృంగారంపై సగం ఆసక్తిని కోల్పోతారట. ఇలా మంచం శుభ్రంగా లేకపోవడం కారణంగా ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని 55శాతం మంది తెలపగా.. 9శాతం మంది అలాంటి ఇబ్బందిలేమీ లేవని చెప్పారట.
కాబట్టి మీరు కూడా ఎక్కువ సేపు శృంగారంలో ఎంజాయ్‌ చేయలేకపోవడానికి ఇది కారణం అయిండొచ్చో లేదో ఓసారి ఆలోచించుకోండి. వీలైనంత వరకు ఉదయాన్నే లేవగానే ఓ ఐదు నిమిషాలు మీ పడక గది కోసం కేటాయించి మీ మంచాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకొండి.
మంచం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కేవలం శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడమే కాదు. మీ రోజూవారి పనుల్లో కూడా చాలా పాజిటివ్ గా, సక్సెస్ ఫుల్ గా ఉంటారట.
ఉదయాన్నే పడకగదిని శుభ్రం చేసుకునే వారిలో 66శాతం మంది రోజంతా సంతోషంగా గడుపుతున్నారని సర్వేలో తేలింది. ఇలా చేయడం వల్ల మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందట.
అంతేకాదు.. మంచాన్ని శుభ్రం చేసుకునే వారిలో 38శాతం మంది హాయిగా నిద్రపోతున్నట్లు తెలిసిందట. కాబట్టి ఉదయాన్నే లేవగానే మంచాన్ని, పడకగదినీ శ్రుభంగా ఉంచుకుని మీ శృంగార జీవితంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి.

Latest Videos

click me!