వయసులో పెద్ద అమ్మాయితో ప్రేమ..? ఈ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే..!

First Published | Sep 20, 2021, 1:09 PM IST

ఒక మహిళ వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. ఆమె అందంగా ఉందని.. అని చెబితే ఎక్కువగా ఇష్టపడతారట. ఆమెలో ఇంకా అందంగా ఉందని గుర్తించాలట.

Dating

మనం ప్రేమించే అమ్మాయి.. కచ్చితంగా మనకన్నా చిన్నగానే ఉండాలి అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో.. పెద్దా, చిన్నా అనే తేడా లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే.. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. 


ముఖ్యంగా.. చాలా మంది అబ్బాయిలు.. తమకన్నా వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అయితే.. అలా పెద్దవారిని పెళ్లి చేసుకువాలని అనుకుంటే.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos


తమకన్నా.. చిన్నవారి కంటే.. పెద్దవారు చాలా తెలివిగా ఆలోచిస్తారట.  ఎందుకంటే.. పెద్దవారికి అనుభవం కలిగి ఉంటారు. వారికి అనుభవం ఉంటుంది కాబట్టి.. ఎలాంటి సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా వారు అర్థం చేసుకోగలుగుతారట. కాబట్టి.. ఎలాంటి సమస్య ఉండదని వారు భావిస్తున్నారట.

ఒక మహిళ వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. ఆమె అందంగా ఉందని.. అని చెబితే ఎక్కువగా ఇష్టపడతారట. ఆమెలో ఇంకా అందంగా ఉందని గుర్తించాలట.

అలా వారి అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తే.. వారు సులభంగా మీకు దగ్గరౌతారట. అమ్మాయి వయసు మ్యాటర్ కాదు.. వారు అందంగా మీకు కనిపిస్తున్నారనే విషయం మాత్రం వారికి అర్థం అవ్వడం ముఖ్యమని సూచిస్తున్నారు.
 

ఇక... వయసులో మీకన్నా చిన్నవారు లేదంటే.. మీ వయసు వారైతే.. మీరు ప్రేమిస్తున్నామని చెప్పగానే వెంటనే సమాధానం చెప్పకుండా వెంట తిప్పుకుంటారు. కానీ... మీకన్నా వయసులో పెద్దవారైతే అలా చేయరట.  ఎక్కువ సమయం వేస్ట్ చేయాలని చూడరట. నచ్చితే నచ్చారని చెబుతారు.. లేదంటే లేదు అంతే. కాబట్టి.. ఈ విషయంలో పెద్దవారే బెస్ట్ అని చెబుతున్నారు.

అంతేకాదు.. తమకన్నా చిన్నవారితో రిలేషన్ లో ఉన్నవారు.. తమ జీవితంలోకి వచ్చేవారితో చాలా నిజాయితీగా ఉంటారట. మోసం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట.  అయితే.. వారితో ఉండాలంటే.. మీరు కూడా అంతే నిజాయితీగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజాయితీగా ఉన్నవారినే వారు ఎక్కువగా నమ్ముతారు. ఇష్టపడాతరట. 
 

భవిష్యత్తులో ఏ విషయంంలోనైనా అండగా ఉంటారట. మీరు కూడా అంతే అండగా ఉంటామని వారికి నమ్మకం కలిగించాలట. అప్పుడే.. వారితో జీవితం బాగుంటుందని సూచిస్తున్నారు.

ఇక చాలా మంది వారు తమకన్నా వయసులో పెద్దవారు అనే విషయాన్ని ప్రతి నిమిషం గుర్తు  చేస్తూ ఉంటారట. మీరు ఈ వయసులోనూ ఇంత అందంగా ఉన్నారు. ఈ వయసులోనూ మీ చర్మం నిగారిస్తోంది.. మీరు అచ్చం మా అమ్మలా ఉన్నారు లాంటి కామెంట్స్ వేస్తూ ఉంటారట. నిజానికి అలాంటివి వారికి పెద్దగా నచ్చవట. వారి వయసు ని ప్రతిసారీ గుర్తు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!