భార్యను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేయాలంటే..?

First Published | May 31, 2021, 1:01 PM IST

భార్య.. భర్త కోసం ఎన్నో చేస్తుంది. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. వాటిని చాలా మంది గుర్తించరు. ఒక్కసారి వాటిని గుర్తించి.. ప్రేమగా భార్యకు థ్యాంక్స్ చెప్పగలిగితే.. ఆమె మళ్లీ మీకు ఫిదా అయిపోవడం ఖాయమట.

ప్రేమ పుట్టిన మొదట్లో చాలా బాగుంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ తగ్గిపోతుంది. దీంతో.. దంపతుల మధ్య బేధాలు రావడం మొదలౌతుంటాయి. అయితే... కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే.. మీ భార్యతో మీరు ప్రతిరోజూ మళ్లీ మళ్లీ ప్రేమలో పడతారట.
మీరు కూడా మీ భార్యను మళ్లీ.. మళ్లీ ప్రేమలో పడేయాలి అనుకుంటే... ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మరి అవేంటో మనమూ చూసేద్దామా..?

ప్రేమ ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. అయితే.. కొత్తలో దానిమీద పెట్టిన దృష్టి.. తర్వాత పెట్టలేకపోవడం వల్ల ప్రేమ తగ్గిపోయిందని అందరూ అనుకుంటారు. అయితే.. ఆ ప్రేమ మళ్లీ మధురంగా మీ జీవితంలో అనిపించాలంటే.. గతంలో మీరు ఆనందంగా గడిపిన క్షణాలు, మధుర స్మృతులను గుర్తుతెచ్చుకోవాలట. అప్పుడు మళ్లీ ఆనందం మీకు సొంతమౌతుంది. మీరు మీ భార్యకు ఆ విషయాలను గుర్తుచేసి.. ఇప్పటికీ ఆ ప్రేమ అలానే ఉందని నమ్మకంగా చెప్పాలి.
భార్య.. భర్త కోసం ఎన్నో చేస్తుంది. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. వాటిని చాలా మంది గుర్తించరు. ఒక్కసారి వాటిని గుర్తించి.. ప్రేమగా భార్యకు థ్యాంక్స్ చెప్పగలిగితే.. ఆమె మళ్లీ మీకు ఫిదా అయిపోవడం ఖాయమట.
ఇక భార్యభర్తలన్నాక కోపతాపాలు, ఆగ్రహాలు వస్తూనే ఉంటాయి. అయితే.. అవి పెద్దవైనా.. చిన్నవైనా వెంటనే మర్చిపోవాలట. అప్పుడే.. ఆనందంగా ఉండగలరని చెబుతున్నారు. భార్య ఏదైనా పొరపాటుచేస్తే.. దానిని మనసులో పెట్టుకొని బాధపడటం కంటే.. మర్చిపోతే.. వారు హాయిగా.. మీతో ప్రేమగా ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
భార్యకు తొలిరోజుల్లో మీ ప్రేమను మాటల్లో తెలియజేసి ఉంటారు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ దానిని మర్చిపోతారు. అయితే.. ప్రతిరోజూ మీ భార్యకు ప్రేమను తెలియజేయడంలో ఎలాంటి తప్పులేదని.. మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో.. వారి మీద మీకు ఎంత ఎఫెక్షన్ ఉందో రోజూ చెప్పాలట. అలా చేయడం వల్ల మీ భార్య మళ్లీ మీ ప్రేమలో పడుతుంది. అలా చెప్పేటప్పుడు మీ భార్య చేతిని ప్రేమగా మీ చేతుల్లోకి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ఇప్పటికీ.. ఎప్పటికీ.. మీ భార్యతో ఏదైనా విషయం చెప్పాలంటే... వారి కళ్లల్లోకి చూడాలట. అలా కళ్లల్లోకి చూస్తే ప్రేమను తెలియడం లేదా.. మాట్లాడటం వల్ల మీకు వారి మీద ఎంత ప్రేమ ఉందనే విషయం వారికి స్పష్టంగా అర్థమౌతుంది. వాళ్లు కూడా మిమ్మల్ని నిజంగా ఎక్కువగా ప్రేమిస్తారు.
ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటే కూడా ప్రేమ పెరుగుతుందట. రోజూ చేసే పనులు కాకుండా ఏవైనా కొత్త చేస్తే బాగుటుందని సూచిస్తున్నారు.
సరదాగా అప్పుడప్పుడు.. ఏదైనా హాలిడే ట్రిప్ కి వెళ్లాలట. అలా వెళ్లడం వల్ల దూరమైన ప్రేమ.. మళ్లీ దగ్గరౌతుంది.
ఇక మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకంటూ సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలోనూ ఆఫీసు పనంటూ ల్యాప్ టాప్.. లేదా ఇంకేదో పనంటూ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోకూడదు. వాటికి కాస్త బ్రేక్ ఇచ్చి.. మీ భార్యతో సరదాగా గడిపే ప్రయత్నం చేయండి.

Latest Videos

click me!