తొలిసారి శృంగారం... అమ్మాయిల వర్జినిటీపై అసలు నిజం ఇదే..!

First Published | Feb 26, 2021, 2:22 PM IST

తొలి కలయిక విషయంలో భయాలను వదిలేయాలి. అంతేకాకుండా అమ్మాయిలు, అమ్మాయిలు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

తొలి కలయిక ఎన్నో మధురానుభూతులు అందిస్తుంది. చాలా మంది తమ జీవితంలో తొలి కలయిక చాలా స్పెషల్ గా ఉండాలని కలలు కంటూ ఉంటారు. అయితే.. రియాల్టీలోకి వస్తే.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా భయపడిపోతారు.
తొలి కలయిక సమయంలో.. అమ్మాయిలు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుందని.. కొందరికైతే రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉందని ఏవేవో వినే ఉంటారు. ఈ క్రమంలో తెలీకుండానే మనసులో ఏవో భయాలు మొదలతౌయి. దీంతో.. ఆనందించాల్సిన సమయాన్ని ఆస్వాదించలేక ఇబ్బంది పడతారు.

మరి అలా కాకుండా ఉండాలి అంటే.. ముందు తొలి కలయిక విషయంలో భయాలను వదిలేయాలి. అంతేకాకుండా అమ్మాయిలు, అమ్మాయిలు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
ముఖ్యంగా అమ్మాయిలు వర్జినిటీ ఎలా కోల్పోతారనే విషయం, తొలి కలయిక నొప్పిగా ఉంటుందనే విషయం ఇలా చాలా రకాల అనుమానాలను వారిని వేధిస్తూనే ఉన్నాయి. అయితే... వీటి గురించి ఓ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది.
చాలా మంది సెక్స్ గురించి తెలుసుకుంటున్నారు కానీ... స్త్రీల హైమన్ పొర, యోనికి సంబంధించిన విషయాలను అసలు పట్టించుకోకపోపవడం గమనార్హం.
స్త్రీలు వర్జినిటీ కోల్పోవడం అంటే హైమన్ పొర చిరిగిపోవడమేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ... హైమన్ పొర ఎప్పటికీ చిరిగిపోదని నిపుణులు చెబుతున్నారు.
ఈ హైమన్ పొర చాలా సన్నగా ఉంటుంది. దీనిలో నుంచి రుతుస్రావం సమయంలో విడుదలయ్యే రక్తం లేదా యోనిలోని ద్రవాలు బయటకు వెళ్లేలా ఓ చిన్న రంధ్రం ఉంటుంది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇది ఇంకాస్త వెడల్పుగా తయారౌతుంది. అంతేకానీ... హైమన్ పొర పూర్తిగా చిరిగిపోదని నిపుణులుసూచిస్తున్నారు.
ఇక మరో విషయం.. తొలికలయిక అనగానే చాలా మంది అమ్మాయిలు కంగారు పడిపోతుంటారు. అదే మొదటిసారి కావడంతో... నొప్పి కలగడం చాలా సహజం. అయితే... ఈ నొప్పి నుంచి బయటపడేందుకు కూడా మార్గం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తొలి కలయిక కు ముందు అమ్మాయిలకు హస్త ప్రయోగం అలవాటు ఉంటే తొలికలయిక పెద్దగా బాధించదని చెబుతున్నారు. అంతేకాకుండా శృంగారం మొదలుపెట్టేటప్పుడు ఫ్లోర్ ప్లేతో మొదలెడితే... నొప్పి పెద్దగా తెలిసే అవకాశం ఉండదని సూచిస్తున్నారు.
అంతేకాదు.. తొలిసారి కలయిక తర్వాత రక్త స్రావం జరగుతుంది అనేది కూడా భ్రమే. చాలా మంది గేమ్స్ లో పాల్గొనే అలవాటు, సైకిల్ తొక్కడం లాంటివి ముందే చేసి ఉంటారు. వాటి కారణంగా హైమన్ పొర ముందుగా సాధారణం కంటే కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తొలికలయిక లో బ్లీడింగ్ వచ్చే అవకాశం చాలా తక్కువ.
సినిమాల్లో చూపించినట్లు.. మెడికల్ పరీక్షల తో వర్జినిటీనీ ప్రూవ్ చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. హైమన్ పొర వెడల్పుగా మారడానికి సెక్స్ ఒక్కటే కారణమని కూడా చెప్పలేం. కాబట్టి కన్యత్వాన్ని దీనిని బట్టి పరీక్షంచలేమని చెబుతున్నారు.

Latest Videos

click me!