శృంగారానికి కాలంతో పని లేదు.. సమయంతోనూ పనిలేదు. కానీ.. చాలా మంది దీనిని చీకటి వ్యవహారంగా చూస్తారు. రాత్రి సమయంలో మాత్రమే దీనిని ఆస్వాదించాలని.. పగలు దీనికి అనువైన సమయం కాదని చెబుతుంటారు. అయితే... రాత్రి మాత్రమే కాదు.. పగలు కూడా దీనిని ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పగటి పూట అంటే దానికి కూడా ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. ఏ సమయంలో చేస్తే... ఎలాంటి అనుభూతి పొందుతారో నిపుణులు వివరింస్తున్నారు.
ఆయుర్వేద ప్రకారమైతే అర్ధరాత్రికి ముందుగా శృంగారంలో పాల్గొంటే మంచిదట. దాంతో శృంగారానికి, నిద్రకు మంచి సమయం ఉంటుందట. చంద్రుడు ఆకాశంలో ఉన్న పౌర్ణమి సమయాల్లో శృంగారంలో పాల్గొనాలని ఆయుర్వేదం చెబుతున్నది. ఇక సైన్స్ ప్రకారమైతే శృంగారంలో పాల్గొనేందుకు ఏ సమయం అనువుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
ఉదయం 6 నుంచి 8 మధ్య... ఈ సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండడమే కాదు, ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుందట. కానీ మహిళలకు ఆ సమయంలో అంతగా ఆసక్తి ఉండదట. కనుక ఈ సమయం జంటలకు అనువుగా ఉండదట.
ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య... ఈ సమయంలో ఎండార్ఫిన్లనబడే హార్మోన్లు విడుదలవడం వల్ల స్త్రీలకు శృంగార వాంఛ పెరుగుతుందట. కానీ పురుషుల్లో అదే సమయంలో కొంత ఆ వాంఛ తగ్గుతుందట. కానీ ఇద్దరికీ అనుమతి అయితే ఈ సమయంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చట.
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య... ఈ సమయంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ బిజీ వర్క్ ఉండి శృంగార వాంఛ, పవర్ తగ్గుతుందట. కనుక ఈ సమయం జంటకు అనువుగా ఉండదట.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య... ఈ సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందట. అంతే కాదు పురుషుల నుంచి విడుదలయ్యే వీర్యం కూడా నాణ్యమైందిగా ఉంటుందట. కనుక ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే పిల్లలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అదే వారు అవసరం లేదనుకుంటే ఈ సమయంలోనూ శృంగారంలో పాల్గొనకూడదు.
సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య... ఈ సమయంలో స్త్రీ, పురుషులిద్దరికీ బాగా ఆకలి వేస్తుందట. అంతేకాదు, శృంగార వాంఛ, పవర్ తక్కువగా ఉంటుందట. కనుక ఈ సమయం కూడా శృంగారానికి అనువు కాదు.
రాత్రి 8 నుంచి 10 గంటల వరకు... ఈ సమయంలో ఇద్దరిలోనూ శక్తి నిల్వలు పెరిగి శృంగారానికి అనువుగా తయారవుతారట. కనుక ఈ సమయం శృంగారానికి అత్యంత అనువైందట.
రాత్రి 10 నుంచి 12 గంటల వరకు... స్త్రీ, పురుషులు శృంగారంలో పాల్గొనేందుకు ఇది కూడా అనువైన సమయమేనట. ఎందుకంటే ఆ సమయంలో వారి హార్మోన్లు బాగా ఎక్కువగా పనిచేస్తుంటాయట.
వేసవి కాలంలో కన్నా శీతాకాలంలోనే ఎక్కువగా శృంగారంలో పాల్గొనాలని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు, స్త్రీలు గర్భం దాల్చాక, రుతు సమయంలో, బాగా భోజనం చేసిన తరువాత శృంగారంలో పాల్గొనకూడదట. అలా చేస్తే గ్యాస్ ఎక్కువగా ఉద్భవిస్తుందట.