మీలో ప్రేమ ఎంత మాయ చేస్తుందో.. తెలుసా..

First Published | Apr 1, 2021, 4:20 PM IST

ప్రేమించడం, ప్రేమించబడడం ఎంతో అద్భుతమైన భావన. ప్రేమ జీవితాన్ని మార్చేస్తుంది. మన అభిరుచులు, ఇష్టాలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు తారసపడినప్పుడు అటోమెటిగ్గా మనసులో ప్రేమ పుడుతుంది. హృదయం భావోద్వేగానికి లోనవుతుంది. 

ప్రేమించడం, ప్రేమించబడడం ఎంతో అద్భుతమైన భావన. ప్రేమ జీవితాన్ని మార్చేస్తుంది. మన అభిరుచులు, ఇష్టాలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు తారసపడినప్పుడు అటోమెటిగ్గా మనసులో ప్రేమ పుడుతుంది. హృదయం భావోద్వేగానికి లోనవుతుంది.
ప్రేమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసిక అందాన్ని పెంచుతుంది. ప్రేమలో శృంగారానికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రేమ, శృంగారం ఒకదానికొకటి విడదీయరాని బంధంగా ఉంటుంది. అందుకే మనసుకు చాలా దగ్గరైన మనిషితో రతిక్రీడకు తనువు, మనసు తహతహలాడుతుంది.

ఒక్కసారి మీరు మీకిష్టమైన వ్యక్తితో సాహచర్యం మొదలుపెడితే మీలో ఎంతో మార్పు వస్తుంది. మీకు తెలియకుండానే ప్రేమ మీలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. మీ వ్యక్తిత్వం, అలవాట్లు, అభిరుచులు మెల్లగా చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మార్పు అందర్లో ఒక్కలాగే ఉండదు. రాశి చక్రాన్ని బట్టి మార్పు ఉంటుంది.
కుంభరాశి : ప్రేమ వీరిని చాలామంచిగా మార్చేస్తుంది. ప్రేమలో మీరెల ఫీలవుతున్నారనేది మీరు బహిరంగంగా ఎలాంటి జంకు లేకుండా మాట్లాడతారు. నిజాయితీగా ఉంటారు. మీ రక్షణకు ఎలాంటి సందేహం లేదనే నమ్మకం కలిగిస్తుంది. మరొకరితో మీ మనసులోని భావాలను ట్రాన్స్ పరెంట్ గా మాట్లాడేలా చేస్తుంది.
మేష రాశి : ఈ రాశివారు సరైన వ్యక్తితో ప్రేమలో పడినప్పుడు ఎంతలా మారిపోతారంటే.. ఆ మార్పు వారినే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు మీ లాగ కాకుండా , మీరు మీలాగే ఉండరు. నిజానాకి అన్ని రాశుల్లో ఈ రాశివారే చాలా ఇండిపెండెంట్. అయితే ప్రేమలో పడితే తమకే తెలియకుండా ఎదుటివ్యక్తి మీద డిపెండెంట్ గా మారిపోతారు. వారికోసం తమ షెడ్యూల్ లో మార్పులు చేసుకుంటారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.
కర్కాటక రాశి : అన్ని రాశుల్లో కెల్లా ఎక్కువ భావోద్వేగమైనవారు మీరే. మీరు ఏదైనా మనసు చెప్పిందే వింటారు. భావోద్వేగాలనే ఫాలో అవుతారు. కానీ మీ హృదయాన్ని దోచిన వ్యక్తి తారసడితే పూర్తిగా మారిపోతారు. వారినుంచి ఏమీ ఆశించరు. అంతేకాదు వారు మీతో అప్యాయంగా లేకపోయినా అందుకు ప్రయత్నించకపోయినా తొందరగా నిరాశ పడతారు.
మకరరాశి : మీరు నిజంగా ప్రేమలో పడితే.. మీ భాగస్వామి సాన్నిథ్యాన్ని బాగా ఆస్వాదిస్తారు. విషయాలు జరగకుండా పోతాయేమో అనే భయంతో ఎక్కువగా ఆలోచించడాన్ని మానేస్తారు. క్షమ నేర్చుకుంటారు. పరిస్థితులను అంగీకరించడం అలవాటు చేసుకుంటారు.
మిథునరాశి : ఈ రాశివారు కాస్త సరసులే. అయితే సరైన వ్యక్తితో ప్రేమలో పడితే ఆ వ్యక్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ ప్రేమను పొందిన వారు మీ దృష్టిని ఆకర్షించి, మిమ్మల్ని తమ మాయలో పడేస్తారు. ఆ వ్యక్తితో ఒంటరిగా గడిపిన క్షణాలు మిమ్మల్ని అతనితో జీవిత కాల బంధానికి పురిగొలుపుతాయి.
సింహరాశి : మీరు ఒకరిని ఇష్టపడినప్పుడు.. మీ చుట్టూ ఉన్నవాళ్లంతా మీకు భయపడుతున్నారా, లేదా అనేది మీరు పట్టించుకోరు. ప్రతీ ఒక్కరి అటెన్షన్ మీ మీదే ఉండాలనే దృష్టి మారిపోతుంది. మొండిగా ఉండటం మానేస్తారు. కారణం మీరు ప్రేమించే వ్యక్తి సంతోషమే మీకు మీకంటే ముఖ్యం కాబట్టి.
తులారాశి : మామూలుగా ఈ రాశివారు గొడవలకు దూరంగా ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. వివాదం వస్తుందనుకుంటే అక్కడినుంచి తప్పుకుని తిరుగుతారు. అయితే ప్రేమ వీరిని మార్చేస్తుంది. మనసులోని భావాలను ఎలాంటి జంకు లేకుండా బహిర్గతం చేస్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తారన్న నమ్మకం మిమ్మలి ఎలాంటి సంకోచాలకూ పోనివ్వదు.
మీనరాశి : ప్రేమ మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది. మీకేం కావాలో స్ఫష్టంగా, కచ్చితంగా చెప్పగలుగుతారు. మిమ్మల్ని బాధించాలనుకున్నవారు మీలోని లోపాల్ని ఎత్తిచూపుతుంటారు. వీటిని పట్టించుకోకపోవడం కూడా ప్రేమ మీకు నేర్పుతుంది.
ధనుస్సు :మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు, మీ చంచలమైన మనసు ఒక దగ్గర ఆగిపోతుంది. మనసంతా ఒకరిమీదే కేంద్రీకృతమవుతుంది. మీ ప్రేమ ప్రయాణం మీ మనసులోనే సాగుతుంటుంది. మీ ఆలోచనలు ఒకచోటే ఉండడాన్ని ఇష్టపడతారు. ఇది మీ సహజస్వభావం కాకపోయినా ప్రేమ మీలో ఈ మార్పును తెస్తుంది. అలా మీ ప్రేమకు పాత్రుడైన ఆ వ్యక్తి మీద మీకు అసూయ కూడ కలుగుతుంది.
వృశ్చిక రాశి : ప్రేమలో పడడంతో మీ దుర్భలత్వమైనా అది మీకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మీకు బాధగా అనిపించినప్పుడు ద్వేషాన్ని చూపించడం, ప్రతీకారం తీర్చుకోవడం మానేస్తారు. దూకుడుగా లేదా ప్రతీకారం తీర్చుకునేలా మాటకు మాట బదులివ్వకుండా మీ బాధను, కోపాన్ని తెలియజేయడం నేర్చుకుంటారు.
వృషభరాశి : మీరు బైటికి చాలా కూల్ గా కనిపించినా, లోపల మాత్రం శృంగారం విషయంలో నిరాశాజనకంగా ఉంటారు. మీ జీవితంలోకి నిజమైన ప్రే రావడం అంటే మార్పులను ఇష్టంగా ఆహ్వానించడమే. మీరు ప్రేమలో పడినప్పుడు, మీరు మీ సొంత అభిరుచులను మరిచిపోయి కొత్త విషయాలను ప్రయత్నిస్తారు.
కన్యారాశి : మీరు ప్రేమలో పడినప్పుడు, లోపాలను అంగీకరించడం, తప్పుల్ని సహించడం నేర్చుకుంటారు. విమర్శించడాన్ని ఆపేస్తారు. మీ భాగస్వామిలో, మీలో, మీ చుట్టూ ఉన్నవారిలో లోపాలను గమనించినప్పటికీ, వాటిని సరిదిద్దాలని ఎప్పుడూ కోరుకోరు.

Latest Videos

click me!