శృంగారంలో రోజుకో కొత్తదనం రుచి చూడాలంటే...

First Published | Jan 19, 2021, 1:21 PM IST

పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగారాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటే.. ఇలా కొంత స్పైసీ నెస్ యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూసేద్దామా..

శృంగారాన్ని కోరుకోని వారు ఉండరు. దానిని ప్రతిరోజూ ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. అయితే.. పెళ్లైన కొత్తలో ఈ విషయంలో మోజు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా.. ఎప్పుడెప్పుడు కలయికలో పాల్గొందామా అని ఎదురు చూస్తారు. అదే.. రోజులు, సంవత్సరాలు గడుస్తూపోతూ ఉంటే.. ఆ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించారు.
మనకు తెలీకుండానే మనం ఓ రోటీన్ లో పడిపోతాం. ఈ క్రమంలో తెలీకుండానే భార్యభర్తల మధ్య ఆ విషయంలో దూరం పెరిగిపోతుంది. చేయాలనే కోరిక కలిగినా.. అది కూడా ఎక్కువ సేపు నిలవదు. మరి.. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగారాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటే.. ఇలా కొంత స్పైసీ నెస్ యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూసేద్దామా..

1. ప్రేమలో ఉన్న సమయంలో.. పెళ్లైన కొత్తలో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలని.. ముట్టుకోవాలని చాలా తహతహలాడతారు. అయితే.. ఇదే ఫార్మూలాని తర్వాత కూడా వాడాలట. సమయం దొరికినప్పుడల్లా ప్రేమగా ముద్దు పెట్టుకోవడం.. తాకడం లాంటివి చేస్తే.. రోజులు గడిచినా.. ప్రేమ కొత్తగానే ఉంటుంది. అదేవిధంగా కలయికలో పాల్గొనాలనే కోరిక కూడా బలంగా పెరుగుతుందట.
2.కొందరు దంపతులు సంవత్సరాలుగా.. ఒకే విధానంలో శృంగారంలో పాల్గొంటారు. దాని వల్ల సంవత్సరాలు గడుస్తూ ఉండటంతో.. దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. దీంతో.. తెలీకుండానే దూరం పెరిగిపోతుంది. అయితే.. డిఫరెంట్ గా.. లేదా విభిన్న యాంగిల్స్ ట్రై చేస్తే.. శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారట.
3.కొందరు.. ఆఫీస్ వర్క్, ఇంటి పనులకు అలవాటు పడిపోయి వాళ్లకంటూ వాళ్లకి కూడా సమయం కేటాయించరు. అలా కాకుండా.. అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లాలి. రొమాంటిక్ డేట్ కి లేదంటే.. డిన్నర్ కి వెళ్లి సరదాగా గడపాలి. అలాంటప్పుడు కూడా ప్రేమ పెరుగుతుంది.
4.బయటకు చెప్పరు కానీ.. చాలా మందికి శృంగారంలో డిఫరెంట్ ఫాంటసీలు ఉంటాయి. వాటిని మీ పార్ట్ నర్ తో షేర్ చేసుకోవాలి. ఆ ఫాంటసీలు తీర్చుకునే ప్రయత్నాలు చేయాలి. ఇలా చేసినప్పుడు ఫన్ తోపాటు.. క్లోజ్ నెస్ కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలోనూ కలయికను బాగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
5.ప్రస్తుత కాలంలో పోర్న్ చూసేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటి అలవాటు మీకు కూడా ఉంటే.. మీ పార్ట్ నర్ తో కలిసి చూడండి. దాని వల్ల మీకు తెలియని చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలా కలిసి చూడటం వల్ల కూడా అదేవిధంగా కలయికలో పాల్గొనాలనే భావన మీకు కూడా కలుగుతుంది. తద్వారా కలయికను బాగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!