సెక్స్ సామర్థ్యం పెంచుకోవాలని ఆరాటపడేవారు చాలా మందే ఉంటారు. వారు.. ఈ కోరికలు పెంచుకోవడానికి ఎక్కడెక్కడో ఎవరో చెప్పిన మందులు, మూలికలు కూడా మింగుతుంటారు. అయితే... ఇవి కేవలం కొన్ని రకాల ఆహారపదార్థాలతోనే సాధ్యమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే... ఇప్పటి వరకు పురుషులు ఎలాంటి ఆహారం తీసుకుంటే... వారిలో కోరికలు పెరుగుతాయో మనందరికీ తెలుసు.. అయితే... స్త్రీలు కూడా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కోరికలు కలిగే అవకాశం ఉంటుందట.
ఉల్లిపాయ, గుమ్మడికాయ, తేనె, కీరదోస, గార్లిక్, యాపిల్, అవకాడో, వాల్ నట్, వాటర్ మిలన్, స్ట్రాబెర్రీ లాంటివి తినడం వల్ల పురుషుల్లో కోరికలు పెరుగుతాయి. మరి స్త్రీలు ఏం తింటే.. శృంగారంలో రెచ్చిపోవచ్చో ఇప్పుడు చూద్దాం..
మహిళల్లో చాక్లెట్స్ తింటే వారిలో శృంగార కోరికలు పెరుగతాయట. చాక్లెట్స్ లో ఉండే కొకోవా అనే పదార్థం కారణంగా.. ఇది సాధ్యమౌతుందట. దీనిలో న్యూట్రియంట్స్, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
మెంతులు.. మెంతులు, మెంతుకూర తినడం వల్ల కూడా.. మహిళల్లో శృంగార భావనలు కలిగే అవకాశం ఉంటుంది. దీనిలోని ఫైటోఈస్ట్రోజెన్‌లు మహిళల చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. అంతేకాకుండా.. ఈ కోరికలు కూడా బాగా పెరుగుతాయట. తద్వారా వారు పడక గదిలో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
మనం చాలా రకాల వంటల్లో మసాలా దినుసులు వాడుతూ ఉంటాం. దాల్చిన చెక్క, యాలకలు, అల్లం ఈ మసాలాలు తీసుకోవడం వల్ల కూడా కోరికలు పెరుగుతాయట. వంట్లోనే కాకుండా...టీ లో కూడా వేసి వీటిని తీసుకోవచ్చు.
ఇంగువ.. మనలో చాలా మంది వంట్లో ఇంగువను ఉపయోగిస్తారు. దాని వాసన బాగుంటుందని.. అది వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుందని భావిస్తుంటారు. అయితే... ఇది మహిళల్లో శృంగార భావనలు కలిగించడానికి సహాయం చేస్తాయట. దీనిని వేసిన వంటలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందట.
మహిళలు వరసగా ఆరు రోజులు కుంకుమ పువ్వును తీసుకుంటే... ఏడో రోజు నుంచి వారు పడకగదిలో చాలా యాక్టివ్ గా ఉంటారట.
ఇక రెడ్ వైన్ తీసుకునే మహిళలు కూడా కలయికను బాగా ఆస్వాదిస్తారట.