కలయికను ఆస్వాదించాలంటే.. వీలైనన్ని సార్లు ఇవి చెప్పండి..

First Published | Feb 8, 2021, 10:51 AM IST

ఇద్దరు మనుషులు కలిసి జీవించడాన్నే దాంపత్యం అంటారు. దాంపత్యానికి ముఖ్యం శరీరాల కలయిక మాత్రమే కాదు.. మనసుల కలయిక. భాగస్వామితో మానసిక అనుబంధం ఆ దాంపత్యాన్ని లేదా సహజీవనాన్ని మరింత అద్భుత ప్రయాణంగా మార్చేస్తుంది. 

undefined
అలాంటి జీవితం కోసం భాగస్వాములిద్దరూ ప్రయత్నించాలి. తమవంతుగా ఏం చేయాలో ఆలోచించాలి. కొన్ని ఇష్టాలు పెంచుకోవాలి.. మరికొన్ని కాస్త మార్చుకోవాలి. అలాంటివాటితో మీ దాంపత్య జీవితం మారిపోతుంది. ఇది అటోమెటిక్ గా మీ శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
undefined

Latest Videos

ఒకరి సాన్నిధ్యాన్ని ఒకరు ఎక్కువగా కోరుకోవడం.. ఒకరి అబ్సెన్స్ లో ఒకరు విరహాన్ని అనుభవించడం శృంగారాన్ని మరింత తీయగా మార్చేస్తుంది. కొన్ని చిట్కాలతో మీ జీవిత భాగస్వామి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచండి.
undefined
కొంతమందికి మనసులో ప్రేమ, అభిమానం, ఇష్టం అనేవి చెప్పలేనంతగా ఉంటాయి. కానీ బైటికి వ్యక్తపరచరు. దీంతో వారు ప్రేమను ఇవ్వడమే కాదు పొందడంలోనూ వైఫల్యం చెందుతారు. అందుకే మీ భాగస్వామి ముందు మీ మనసు పరవండి. వీలైనన్ని సార్లు కొన్ని మాటలు చెబుతూ ఉండండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
ఐలవ్యూ.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఈ మూడు పదాలు ఎంతంగా ప్రభావితం చేస్తాయంటే.. ప్రపంచంలో మరే పదాలు దీనిముందు పనికిరావు. మీ భాగస్వామికి ప్రేమగా, నిజాయితీతో చెప్పే ఈ మాటలు వారిపట్ల మీకున్న ఇష్టాన్ని తెలుపుతాయి. ఆ మాటలు విన్నప్పుడు వారిలో పొంగిపొరలే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
undefined
లేచినప్పటినుండి తిరిగి పడకమీదికి చేరేవరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఇది ఎప్పుడూ ఉండేదే. అందుకే సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి రాగానే రోజు ఎలా గడిచింతో మీ జీవితభాగస్వామిని ప్రేమగా అడగండి. మీ రోజు గురించి చెప్పండి. తను చెప్పే విషయాలు అంతే చక్కగా వినండి.
undefined
నువ్వుంటే నా జతగా : మీరు కనక సహజీవనంలో ఉండి ఉంటే.. మీ భాగస్వామి మీ నుండి బాగా ఇష్టపడే మాట.. నువ్వు లేకపోతే నాకేం తోచదు, నిన్ను చూడకపోతే ఏదో వెలితిగా ఉంటుంది, నీ సాంగత్యంలో నేను ఆనందం పొందుతాను.. ఇలాంటి మాటలు వారికి బాగా నచ్చుతాయి. అయితే చెప్పేవాటిల్లో ప్రేమ, నిజాయితీ ముఖ్యం.

పెళ్లికి ముందు ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు.. కానీ వేరే వ్యక్తితో మీ జీవితం ముడిపడి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నదే వాస్తవం..దాన్ని అనుభవించండి, ప్రేమించండి. మీ జీవిత భాగస్వామిగా తను దొరకడం ఎంత సంతోషకరమైన విషయంలో వీలైనప్పుడల్లా తనకు చెప్పండి.
undefined
రిలేషన్ ఏదైనా నమ్మకం ఎంతో ముఖ్యం. అందుకే మీ భాగస్వామి పట్ల మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారో, తనను ఎంతగా నమ్ముతున్నారో వీలైనప్పుడల్లా చెప్పండి. అంతేకాదు తను తీసుకునే నిర్ణయాల పట్ల మీకెంత గౌరవం ఉందో కూడా చెప్పండి.
undefined
ఎన్ని అనుబంధాలు, ఎంతమంది స్నేహితులున్నా మీ జీవిత భాగస్వామే మీ మొదటి ప్రయారిటీ. ఈ విషయాన్ని తనకు తెలిసేలా చెప్పాలి. మాట మనసుకు మంత్రం వేస్తుంది. ఆ మాటను ఎంతో అందంగా తనకు చెప్పండి. తను మీకెంత ముఖ్యమో తెలిసేలా చేయండి. దీంతో తను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో అనుభవపూర్వకంగా తెలుసుకోండి.
undefined
ఐయాం సారీ : కాపురం అన్నాక, కలిసి ఉన్నాక.. గొడవలు కామన్. ఒకరి మీద ఒకరు అరుచుకోవడమూ, అపోహలు పడడమూ మామూలే. నిజానికి ఇవే లేకపోతే జీవితం మరీ బోరింగ్ గా ఉంటుంది. అయితే వీటిని పెంచుకుంటూ పోకుండా వెంటవెంటనే తుంచేయాలి. దీనికోసం సారీ చెప్పడానికి వెనకాడకూడదు. భార్య ముందో, భర్త ముందో తగ్గడం వల్ల పోయేదేమీ ఉండదు. ప్రేమ రూపంలో అదే తిరిగి వస్తుంది.

నో చెప్పడమూ ముఖ్యమే : రెండు వేరు వేరు జెండర్స్, వేరు వేరు పరిస్థితుల్లో పెరిగిన మనుషులు ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు అభిప్రాయాలు అన్ని సార్లూ కలవాలని లేదు. అలాగని మొండిగా వాదించకూడదు. మీ ఆలోచనల్లో క్లారిటీ ఉండాలి. మీ భాగస్వామి నిర్ణయంతో మీరెందుకు ఏకీభవించలేకపోతున్నారో చెప్పగలగాలి.
undefined
జీవితంలో చిన్న చిన్న సందర్భాలే ఎంతో అపురూపంగా మారతాయి. మీ భాగస్వామితో గడపడం మీరెంత ఇష్టపడతారు చెప్పే చిన్న చిన్న చర్యలు మీ పట్ల వారిలో అంతులేని అనురాగాన్ని పెంచుతాయి.
undefined
ఎంత చక్కటి జంట విషయంలో అయినా కొన్ని జీవితకాలం కొనసాగగలమా అనే అనుమానం వస్తుంటుంది. అలాంటప్పుడు మీకు తనెంత ముఖ్యమో. తనను జీవితకాలం మీరు వదలకుండా ఎలా ఉండగలరో అనే విషయాలు చక్కగా వ్యక్తీకరించండి. మీరంత భావుకులు కాకపోతే.. జీవితాంతం నిన్ను వదలలేను.. నాతో జీవితం ముడిపడిపోయింది..ఇక జీవితచరమాంకం వరకు ఇంతేలాంటి మాటలతో వారిలో హోప్ కలిగించొచ్చు.
undefined
click me!