భర్తకు భార్య అస్సలు చెప్పకూడని విషయాలు ఇవే..!

First Published | Jun 30, 2021, 12:22 PM IST

తమ మాజీ అయితే అలా చేసేవారు.. ఇలా చేసేవారంటూ వాళ్ల ప్రస్తావన తీసుకురాకూడదట. 

భార్యభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ.. కొన్ని విషయాల్లో దాపరికాలు ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిలేషన్ మొదలుపెట్టిన కొత్తలో.. ఒకరి గురించి మరొకరికి తెలుసుకోవాలే ఆరాటం ఉంటుంది.
ఈ క్రమంలో.. మీ గురించి చెప్పమని అడుగుతూ ఉంటారు. దీంతో చాలా మంది ఆవేశంగా.. తమ గురించి అన్ని విషయాలు , తమ పాస్ట్ లవ్ స్టోరీలు, బ్రేకప్ లు అన్నీ చెప్పేస్తారు. అయితే.. మొదట వాటిని యాక్సెప్ట్ చేసినా.. తర్వాత మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇవి కాకుండా.. అసలు భార్యలు భర్తల దగ్గర.. భర్తలు భార్యలు దగ్గర కొన్ని సీక్రెట్స్ దాచిపెట్టాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

చాలా మంది పెళ్లి తర్వాత కూడా తమ మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని తొందరగా మర్చిపోలేరు. మర్చిపోకపోవడంలో తప్పులేదు.. కానీ.. ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ ముందు ఉంచడం మాత్రం చాలా తప్పు.
ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు.. తమ మాజీ అయితే అలా చేసేవారు.. ఇలా చేసేవారంటూ వాళ్ల ప్రస్తావన తీసుకురాకూడదట. వాళ్లని ఎంతలా అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని కూడా చెప్పకపోవడమే మంచిదట. అలా చెప్పడం వల్ల.. ఇప్పటికీ మీకు మీ మాజీ పై ఫీలింగ్స్ ఉన్నాయనే అర్థం వచ్చే ప్రమాదం ఉంది.
మీ జీవిత భాగస్వామి స్నేహితులు మీకు నచ్చకపోతే.. ఆ విషయాన్ని వారికి చెప్పకపోవడమే మంచిది. మీరు మీ లిమిట్స్ లో మీరు ఉంటూ దూరంగా ఉంటే చాలు. ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ కి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక అంతేకాదు.. చాలా మంది మగవారు.. తమ భార్యల స్నేహితురాళ్లపై కామెంట్స్ వేస్తూ ఉంటారు. చాలా హాట్ గా ఉందంటూ.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. దాని వల్ల.. మీ భార్య ముందు మీరు చులకన అయిపోతారు. మీ బంధానికి బీటలు పడే అవకాశం ఉంది.
భార్యభర్తల మధ్య ప్రేమను.. ప్రతిసారీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాల్లో.. నా మీద నీకెంత ప్రేముందో చూపించు అని అడిగినట్లు.. నిజ జీవితంలో అడగ కూడదు. దాని వల్ల పెద్దగా ఫలితం ఉండదు. వాళ్లు మీకోసం చేసే పనిలో.. చూపించే శ్రద్ధలోనే ప్రేమ వెతుక్కోవాలి. ప్రతిసారీ నిరూపించుకోమని పరీక్షలు పెట్టాల్సిన పనిలేదు.
మీ పార్ట్ నర్ మీ కోసం ఏదైనా ప్రేమగా చేస్తే.. మీ గత మాజీ కూడా ఇలానే చేసేవారంటూ గుర్తు చేయకూడదు. దాని వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. మరోసారి మీ పార్ట్ నర్ మీకోసం ఏదైనా చేయాలంటే తొందరగా ముందుకు రారు. ప్రతి విషయంలో మీ మాజీ తో పోలుస్తున్నారనే బాధ వారిలో పెరిగిపోతుంది.
ఇక కొందరు మగవారు.. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. లేదంటే పేరెంట్స్ కి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. దాని వల్ల.. నీకు నేను కావాలా.. వాళ్లు కావాలా తేల్చుకో అంటూ అలాంటి పరిస్థితి కల్పించకూడదు.
ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంది. అది చెడు అలవాటు అయితే.. ప్రేమగా చెప్పి మార్చుకోవాలి. అంతే కానీ.. ఆ అలవాట్లను చూపిస్తూ వాళ్లని తక్కువ చేయాల్సిన అవసరం లేదు.
కొందరు తమ పార్ట్ నర్ చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా అంత మంచిదేమీ కాదు. ఇక పరుష పదజాలం కూడా వాడకూడదు. బూతులు లాంటివి ఉపయోగించకపోవడం మంచిది.

Latest Videos

click me!