అలాంటి శృంగారాన్నే మహిళలు కోరుకుంటారట..!

First Published | Jan 21, 2021, 1:04 PM IST

అంతేకాదు.. మీకున్న కోరికలను కూడా ఆమెకు స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడు ఆమె కూడా మీకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంది. తద్వారా ఇద్దరూ కలయికను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.

శృంగారం వల్ల శారీరక తృప్తితోపాటు... మానసిక సంతృప్తి కూడా లభిస్తుందని ఇప్పటికే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అంతేకాదు.. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలిసిందే. అంతేకాదు... మనలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంతోపాటు.. ఆనందం కూడా లభిస్తుంది. అయితే.. మహిళలను ఎక్కువగా శృంగారాన్ని ఆస్వాదించాలంటే మాత్రం ఇలా చేయాల్సిందేనని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీ పార్ట్ నర్ శృంగారాన్ని ఆస్వాదించాలి అంటే.. ముందుగా.. మీ పార్ట్ నర్ కి బెడ్ మీద ఏది ఇష్టమో తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తే.. తనకు మూడ్ వస్తుంది..? ఏం చేస్తే మూడ్ పోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. అంతేకాదు.. మీకున్న కోరికలను కూడా ఆమెకు స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడు ఆమె కూడా మీకు నచ్చినట్లుగా వ్యవహరిస్తుంది. తద్వారా ఇద్దరూ కలయికను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు పడక గదిలో సైతం పరధ్యానంగా గడుపుతూ ఉంటారు. అలాం ఉండేవారితో శృంగారాన్ని స్త్రీలు పెద్దగా ఆసక్తి చూపించరట. అందుకే.. విషయంలో కాస్త అలర్ట్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మూడీగా.. ఇంట్రెస్ట్ లేకుండా.. ఏదో పనిచేస్తున్నట్లుగా.. కలయికలో పాల్గొనకూడదని.. దానిని ఇష్టంగా చేయాలని వారు సూచిస్తున్నారు. దీని కోసం ధ్యానం, వ్యాయామం లాంటి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.
చాలా మంది స్త్రీలు.. పెళ్లి తర్వాత లావుగా మారతారు. దీంతో.. వారికి వారే తాము అందంగా లేమని ఫీలైపోతూ ఉంటారు. వారిలో ఆత్మ విశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనూ వారు శృంగారాన్ని పెద్దగా ఆస్వాదించలేరేు. దీనికి ముందుగా మీరు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పని చేయాలి. వాళ్లు ఎలా ఉన్నా.. తమకు అందంగా నే కనిపిస్తారనే నమ్మకాన్ని కల్పించాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దంపతుల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అది ఏ విషయమైనా ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలిగితే.. వారి దాంపత్యం మరింత ఆనందంగా సాగుతుందని వారు చెబుతున్నారు.
మనసులో ఏది ఉన్నా... భార్యతో ఆనందంగా పంచుకోవాలి. అప్పుడే..వారి కలయిక లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఆనందాన్ని పొందగలుగుతారు.
మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్‌లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. వారు సంతృప్తి చెందరు కాబట్టి.. లైంగిక ప్రక్రియ పట్ల అంతగా ఆసక్తి చూపరు.
మగువలు తాము అనుకున్నన్ని సార్లు, తాము సంతృప్తి చెందేలా శృంగారంలో పాల్గొంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది. మహిళలకు సంతానోత్పత్తికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే ఓ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. సగం మందికిపైగా మహిళలు తాము కోరుకున్నంతగా సెక్స్ చేయడం లేదని ఆ అధ్యయనంలో తేలింది.
చాలా మంది ఆడవాళ్లు వారంలో మూడుసార్లకుపైగా శృంగారంలో పాల్గొనాలని ఆ సంస్థ చేపట్టిన సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది మహిళలు చెప్పారు. మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ శృంగారాన్ని కోరుకుంటారని కూడా ఆ సంస్థ వెల్లడించింది.

Latest Videos

click me!