ఎవరైనా ప్రేమ జంటను చూసిన ప్రతిసారీ.. నాకు కూడా ఓ లవర్ ఉంటే బాగుండు అని కోరుకోని సింగిల్ అబ్బాయిలు ఉండరేమో. దాదాపు అందరూ.. తమకు కూడా లవర్ కావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో.. వారు అమ్మాయిలను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
అసలు.. సింగిల్ బాయ్స్.. తమ గురించి అమ్మాయిలు ఏమని అర్థం చేసుకోవాలని అనుకుంటారు..? వాళ్లు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక కారణం ఉంటుందట. అదేంటో చూద్దాం..
ఈ రోజుల్లో అబ్బాయిలు.. తమకు జోడి వెతుక్కోవడం కోసం డేటింగ్ యాప్స్ నే ఉపయోగిస్తున్నారు. తాము అందంగా.. ముస్తాబై.. ఫోటోలు పెడుతుంటే.. కొందరు అమ్మాయిలు ఫేక్ ఫోటోలు పెడుతున్నారట.
అలా చేయడం వల్ల ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో.. ఎవరు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారు. కాబట్టి.. డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలు తమ వరిజినల్ ఫోటోలు పెడితే బాగుంటుందని కోరుకుంటున్నారట.
చాలా మంది అమ్మాయిలు.. తమ ప్రజెంట్ లవర్ ని.. పాస్ట్ లవర్ తో గానీ.. వేరే ఎవరైనా ఫ్రెండ్ తో కానీ పోలుస్తూ ఉంటారట. అతను నా కోసం అలా చేసేవాడు.. ఇలా చేసేవాడు.. నువ్వు మాత్రం ఏమీ చేయడం లేదు అంటూ పోలుస్తూ ఉంటారట
ఇలాంటివి అబ్బాయిలకు అస్సలు నచ్చవట. అంతేకాదు.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి పాస్ట్ లవర్ స్టోరీలు, రిలేషన్ షిప్స్ గురించి తెలుసుకోవాలని అస్సలు అనుకోరట.
కొందరు అమ్మాయిలు.. అబ్బాయిలని చూస్తేనే భయపడిపోతారు. కనీసం మాట్లాడటానికి కూడా ప్రయత్నించరు. దీని గురించి అబ్బాయిలు ఏమంటున్నారో తెలుసా.. మేము కూడా మనుషులమే.
మాతో మాట్లాడినంత మాత్రన మీమేమీ కొరుక్కుతినం. మీ అంతట మీరు వచ్చి మాతో మాట్లాడితే.. ఇంకా స్పెషల్ గా మిమ్మల్ని భావిస్తామంటూ చెబుతున్నారు.
అబ్బాయిలు నిజాయితీగా ఉండాలని అమ్మాయిలు కోరుకున్నట్లే.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిలు కూడా నిజాయితీగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారట. తమకు స్వతంత్రంగా ఉండే అమ్మాయిలు అంటే వారికి ఎక్కువగా నచ్చుతారట.
చాలా మంది అబ్బాయిలకు ఎమోషనల్, తెలివైన అమ్మాయిలు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారట.
ప్రతి అమ్మాయి.. తమ జీవితంలోకి వచ్చే అబ్బాయి.. తమకు గౌరవం ఇవ్వాలని కోరుకున్నట్లే... తమకు కూడా గౌరవం ఇచ్చే అమ్మాయి రావాలని కోరుకుంటారట.
తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి తమతో సౌకర్యంగా ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారట.
పొగొడ్తలకు పడిపోని అమ్మాయి ఎవరూ ఉండరు అని చాలా మంది ఉంటారట. అయితే.. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా పొగడ్తలంటే ఎక్కువగా ఇష్టపడతారట.