సెక్స్ ని మించి పురుషులు కోరుకునేది ఏంటో తెలుసా..?

First Published | Oct 26, 2022, 12:55 PM IST

వారు కేవలం శృంగారాన్ని మాత్రమే కోరుకుంటారు అనుకోవడం మాత్రం పొరపాటే. వారు కలయికను మించి ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. 

పురుషులు శృంగారాన్ని ఇష్టపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారు తాము ప్రేమించిన వ్యక్తితో కలయికలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తారు. అయితే... వారు కేవలం శృంగారాన్ని మాత్రమే కోరుకుంటారు అనుకోవడం మాత్రం పొరపాటే. వారు కలయికను మించి ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. యుక్త వయసులో ఉన్నప్పుడు సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చు. కానీ వారి వయసు పెరిగే కొద్ది వారు ప్రేమ కన్నా ఎక్కువగా వేరే వాటిని కోరుకుంటారట. అవేంటో ఓసారి చూద్దాం...
 

1.పురుషులు ఈ విషయాన్ని నోరు తెరచి చెప్పరు కానీ... వారు తమ స్త్రీల దగ్గర నుంచి సెక్స్ కన్నా ఎక్కువగా.. పొగడ్తలు వినాలని కోరుకుంటూ ఉంటారట. తమ రూపాన్ని, తమ డ్రస్సింగ్ స్టైల్ ని, తాము మాట్లాడే నైపుణ్యాన్ని పొగిడితే.. చాలా హ్యాపీగా ఫీలౌతారు. దీనినే వీరు ఎక్కువగా కోరుకుంటారు.



2.మగవారు అన్నిటికంటే గౌరవం ఎక్కువ పొందాలని కోరుకుంటారు. ఇతర వ్యక్తులు, ముఖ్యంగా వారి భాగస్వాములచే అగౌరవపరచబడడాన్ని వారు సహించలేరు. తమ పార్ట్ నర్ నుంచి గౌరవం ఎక్కువగా లభిస్తే వీరు ఎక్కువ ఆనందిస్తారు.
 

3. పురుషులు తమ పార్ట్ నర్ ఎక్కువగా తమతో గొడవ పడటాన్ని ఎక్కువగా ఇష్టపడరు. ప్రతి నిమిషం తమ పార్ట్ నర్ తమతో గొడవ పడటం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. గొడవ పడకుండా ఆరోగ్యకరంగా మాట్లాడటాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. సంభాషణ కోసం ఇద్దరు వ్యక్తులు ప్రశాంతంగా కూర్చుని సమస్యను పరిష్కరించడం వీరికి నచ్చుతుంది.
 

4.తమ భాగస్వామి తమను చూసి ఎంత గర్వ పడుతున్నారో తెలుసుకోవడాన్ని పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకరి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి వారు తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించడం ప్రేమను చూపించడానికి గొప్ప మార్గం. పురుషులు తమ పని లేదా ప్రయత్నాలను గుర్తించినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు.

5.పురుషులు  వారి భాగస్వామి తమ పట్ల కృతజ్ఞత చూపడాన్ని వారు ఇష్టపడతారు. వారు మీకోసం చేసిన దానిని గుర్తించి థ్యాంక్స్ లాంటివి చెప్పినప్పుడు వీరు హ్యాపీ ఫీలౌతారు.

Latest Videos

click me!