మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

First Published | Mar 15, 2022, 11:21 AM IST

Expectations పెట్టుకోవచ్చు.. కానీ రియలిస్టిక్ గా ఉండే వాటిని మాత్రమే కోరుకోవాలి. అప్పుడు.. ఇబ్బందులు, బాధలు ఉండవు. లైఫ్ ఆనందంగా సాగుతుంది.

మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. హ్యాపీగా ఉండాలి అంటే.. ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. దీంతో.. అనవసరంగా లేని పోని  పనులు చేసి తల నొప్పులు తెచ్చుకుంటారు. మ్యారేజ్ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు. అలా కాకుండా ఉండాలి అంటే...  మ్యారేజ్ లైఫ్ ఆనందంగా సాగాలంటే.. ఈ కింద విధంగా ఫాలో కావాల్సిందే. మరి అవేంటో ఓసారి చూద్దామా..

చాలా మంది తమ భాగస్వామి నుంచి చాలా ఎక్కువ ఆశిస్తూ ఉంటారు.  ఏవేవో Expectations పెట్టుకొని.. అవి జరగలేదని బాధపడుతూ ఉంటారు.  Expectations పెట్టుకోవచ్చు.. కానీ రియలిస్టిక్ గా ఉండే వాటిని మాత్రమే కోరుకోవాలి. అప్పుడు.. ఇబ్బందులు, బాధలు ఉండవు. లైఫ్ ఆనందంగా సాగుతుంది.


చాలా మంది తమ జీవిత భాగస్వామిని కంట్రోల్ చేయాలని.. మానిప్యూలేట్ చేయాలని చేస్తుంటారు. దీని వల్ల.. మీరు మీ జీవిత భాగస్వామి ముందు నెగిటివ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా  ఉంటుంది. కాబట్టి.. అలా కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.

ఇక చాలా మంది తమ జీవిత భాగస్వామిని ప్రతి విషయంలోనూ విమర్శిస్తూ ఉంటారు. దాని వల్ల ఇద్దరి మధ్య  విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ కారణంగా.. ఒకరిపై మరొకరికి ద్వేషం కలుగుతుంది. ఇక.. హ్యాపీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే.. ఈ విమర్శించుకోవడాలు ముందు మానేయాలి.

love life

ఇక కొందరు తమ పార్ట్ నర్ పట్ల.. విపరీతమైన పొసెసివ్ నెస్, ఎక్కువ జెలస్ కలిగి ఉంటారు. దాని వల్ల.. నమ్మకం తగ్గిపోతుంది. ఇది.. మీ మ్యారేజ్ లైఫ్ ని దెబ్బ తీస్తుంది. కాబట్టి.. ఎక్కువ జెలస్ మంచిది కాదు.

ఇక ఏదైనా పొరపాటు జరిగితే.. అది నీవల్లే అంటే నీ వల్లే అంటూ  వాదించుకుంటూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. దాని వల్ల.. ఇద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. కాబట్టటి.. అవి లేకుంటే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

ఇక చాలా మంది ప్రతి విషయం తామే కరెక్ట్ అంటూ వాదిస్తూ ఉంటారు.  తమ తప్పు  ఉన్నా.. తాము చేసిందే కరెక్ట్ అంటూ ఉంటారు.  దాని వల్ల.. దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

Latest Videos

click me!