వారు మాత్రం శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారు..!

First Published | Nov 22, 2022, 10:13 AM IST

స్త్రీల్లలో శారీరకంగా, మానసికంగా సమస్యలు మొదలౌతున్నాయి. శృంగారం పై కోరిక తగ్గిపోవడం, యోని పొడిబారడం వంటి సమసస్యలు ఏర్పడుతున్నాయి. 

sex

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని కారణాల వల్ల... చాలా మంది కలయికను ఆస్వాదించలేకపోతున్నారు. వారిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా చేరిపోయారు.

sex

ఈ రోజుల్లో.. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా... మధుమేహ వ్యాధి గ్రస్తిన పడుతున్నారు. ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి కారణమౌతోంది. దీని ప్రభావం... శృంగారంపై కూడా పడుతుండటం గమనార్హం.


మధుమేహం కారణంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయి. శృంగారం మీద ఆసక్తి, ఉత్సాహం వీటి కారణంగా తగ్గిపోతుండటం గమనార్హం. స్త్రీలలోనూ ఇదే రకం సమస్య ఏర్పడుతోంది. స్త్రీల్లలో శారీరకంగా, మానసికంగా సమస్యలు మొదలౌతున్నాయి. శృంగారం పై కోరిక తగ్గిపోవడం, యోని పొడిబారడం వంటి సమసస్యలు ఏర్పడుతున్నాయి. 
 

sex life

మధుమేహంతో బాధపడుతున్న స్త్రీలకు నెలసరి సమస్యలు కూడా తలెత్తుతాయట. నెలసరి సమయంలో అండం విడుదల కాకుడా అడ్డుకుంటూ ఉంటుంది.  మరి... మధుమేహ వ్యాధి గ్రస్తులు... ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.

1.మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ గ్లూకోజజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు అయినా తీసుకోవాలి.
 

2. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్లు, బ్రోకలీ, వంటి తాజా కూరగాయలు తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే మరీ ఉత్తమం. ఇవి రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా చూసుకుంటాయి.
 

3.ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

4.ఎనిమిది గంటల నిద్ర మనిషికి చాలా అవసరం. కాబట్టి... కంటి నిండా నిద్రపోతూ ఉండాలి. పొగ తాగడం, మద్యం సేవించడం, కెఫిన్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

5.శృంగార సంబంధిత సమస్యలు ఉన్నట్లుగా అనిపిస్తే... వెంటనే వైద్యులను సంప్రదించి... అందుకు తగినట్లు చికిత్స తీసుకోవాలి.

Latest Videos

click me!