Relationship: జీవిత భాగస్వామితో ఇలా అస్సలు ప్రవర్తించకూడదు..!

First Published | Aug 16, 2022, 10:50 AM IST

మొదటి పరిచయంలోనే ఎదుటి వ్యక్తిని నువ్వు అని సంబోధించడం మంచి పద్దతి కాదు. అది నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మీరు ఎదుటివారిని బ్లేమ్ చేస్తున్నట్లుగా.. మీరు చాలా మొరటు వ్యక్తిగా అనిపించే అవకాశం ఉంటుందట.
 

couple fight

పెళ్లి అనగానే మనం ఎన్నెన్నో ఊహించేసుకుంటాం. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. నిజానికి మనలో తెలియని కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ క్రమంలో.. పెళ్లికి ముందే వారితో చాలా విషయాలు మాట్లాడేస్తూ ఉంటాం. ఆ మాట్లాడే విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలట. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుందట. అసలు.. పెళ్లి చేసుకోబోయే, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా సరే... అస్సలు ప్రస్తావించకూడని విషయాలు ఏంటో ఓసారి చూద్దాం..

1.మనం మనకు తెలియని వ్యక్తులను ముందుగా మీరు అని ప్రస్తావిస్తూ ఉంటాం. అదే తెలిసిన, పరిచయం అయిన వ్యక్తితో చనువు తీసుకొని నువ్వు అనేస్తాం. అయితే... పెళ్లికి ముందే.. మొదటి పరిచయంలోనే ఎదుటి వ్యక్తిని నువ్వు అని సంబోధించడం మంచి పద్దతి కాదు. అది నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మీరు ఎదుటివారిని బ్లేమ్ చేస్తున్నట్లుగా.. మీరు చాలా మొరటు వ్యక్తిగా అనిపించే అవకాశం ఉంటుందట.


2. పెళ్లికి ముందు అయినా.. పెళ్లి తర్వాత అయినా సరే.... మీ పార్ట్ నర్ పనిని, వారి కుటుంబాన్ని, చదువు లాంటి విషయాల్లో తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇది ఎదుటివారికి చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ తక్కువ చేసి మాట్లాడకూడదు.

3. పెళ్లి తర్వాత దంపతుల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే.. ఆ గొడవల సమయంలో.. ఎప్పుడో మీ భాగస్వామి చెప్పిన తమ పాత రిలేషన్ షిప్స్ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావనకు  తీసుకురావడం కరెక్ట్ కాదు. వారి గత సంబంధాలను అవహేళన చేస్తూ.. వారిని బాధ పెడుతూ మాట్లాడటం.. మీ బంధానికే చేటు తీసుకువస్తుంది.

4.కొందరు పెళ్లి తర్వాత కూడా మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం లేదంటే.. ఫ్లర్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సరదాగా ఫ్లర్టింగ్ చేస్తున్నాం.. అదేమీ పెద్ద సమస్య కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ.. మీరు ఒకరితో రిలేషన్ లో ఉండి.. మరొకరితో ఫ్లర్ట్ చేయడం తప్పే అవుతుంది. అలాంటి చేయకుండా ఉండటమే మంచిది.

5.మీ జీవిత భాగస్వామి మీ కళ్ల ముందే ఉన్నా... ఇతరుల అటెన్షన్ మీ మీద ఉండేందుకు ప్రయత్నాలు చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు.. మీ బంధాన్ని ముగించేస్తాయి.

6.కొందరు తమ జీవిత భాగస్వామిని ప్రతి విషయంలోనూ వేలెత్తి చూపిస్తూ ఉంటారు. నీకు బాడీ ఎదిగింది కానీ.. బ్రెయిన్ ఎదగలేదు.. నీకు పరిపక్వత లేదు.. లాంటి మాటలతో ఇబ్బంది పెట్టకూడదు. అలా చెప్పడం మీ బంధానికి ఎప్పుడూ చేటు తీసుకువస్తుంది.

7.చాలా మంది తమ మాటలతో, చేతలతో కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. వారు ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనే విషయాలను మీరే చెప్పాలి.. మీరు చెప్పినట్లే చేయాలి అనుకోవడం తప్పు.

8.ఇక చివరగా... ఇతరులతో మీ జీవిత భాగస్వామిని అస్సలు పోల్చకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకం. మీ పార్ట్ నర్ చేసింది తప్పు అయితే.. తప్పు అని చెప్పాలి కానీ.. ఇంకొకరితో పోల్చడం మాత్రం అస్సలు చేయకూడదు.

9. అంతేకాకుండా.. బాడీ షేమింగ్ చేయడం అస్సలు మంచిది కాదు.. అలా ఉన్నావని.. ఇలా ఉన్నావని కామెంంట్స్  చేయడం మీ పార్ట్ నర్ ని విపరీతంగా ఇబ్బంది పెడుతుందని గుర్తుంచుకోండి.

Latest Videos

click me!