ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే... కలయిక తర్వాత ఇలా చేయాల్సిందే..

First Published | Oct 30, 2019, 1:41 PM IST

కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే.. ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు.

చాలా మంది పెళ్లి వెంటనే పిల్లలను కనడానికి ఇష్టపడరు. కొంత కాలం తర్వాత ప్రయత్నిద్దామని భావిస్తుంటారు. అప్పటి వరకు ఏవేవో గర్భనిరోధక మాత్రలను వాడేస్తుంటారు. సరిగ్గా పిల్లలు కావాలి అనుకునే సమయానికి అది వీలు కాకుండా పోతుంది.
undefined
అయితే... కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే... గర్భం దాల్చడం చాలా సులభమంటున్నారు నిపుణులు. . దంపతులు చేసే కొన్ని చిన్ని చిన్న పొరపాట్ల కారణంగా గర్భం రావడం ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు. మరి అవేంటో  ఒకసారి మనమూ చూసేద్దామా...
undefined

Latest Videos


చాలా మంది దంపతులు పిల్లలు కలగడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది. అలా జరగడానికి దంపతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే.. కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకుంటారు. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే.. ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్లేదు.కానీ.. పిల్లలు కావాలనుకుంటున్నవారు మాత్రం స్త్రీలు కలయిక జరిగిన వెంటనే శుభ్రం చేసుకోకూడంటున్నారు నిపుణులు.
undefined
కలయిక వెంటనే నీటితో శుభ్రం చేస్తే.. వీర్యం మొత్తం బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రెగ్నెన్సీ రావడం కుదరదు. కాబట్టి... వెంటనే కాకుండా కలయిక తర్వాత ఒక గంట ఆగి నీటితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. సంతానం అవసరం లేదు అనుకునే వారు మాత్రం వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.
undefined
చాలా మంది అప్పటి వరకు గర్భనిరోధక మాత్రలు వాడి ఉండవచ్చు. అయితే... పిల్లలు కావాలి అనుకుంటే మాత్రం... కొన్ని నెలలకు ముందుగానే వాటిని వాడటం ఆపేయాలి. ఆ పిల్స్ ప్రభావం కొన్ని నెలలపాటు శరీరంలో ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ రాదు. కొన్ని నెలలకు ముందే వాటిని ఆపేసిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించాలి.
undefined
మద్యం లేదా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే ముందుగానే మానేయాలి. ఈ అలవాటు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
undefined
పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్లీ స్త్రీలో అండం తయారైన సమయంలో కలయికలో పాల్గొంటే...గర్భం దాల్చడం చాలా సులభంగా ఉంటుంది. అప్పుడు కాకుండా ఇతర సమయంలో సంభోగంలో పాల్గొన్నా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
undefined
మంచి ఆహారం తీసుకోవాలి. కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కడుపు పండాలన్నా కూడా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో పురుషులు తీసుకునే ఆహారం కూడా కీలక ప్రాత పోషిస్తుందని చెబుతున్నారు.
undefined
త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారు ఓవలేషన్ కిట్ ను మీ దగ్గర ఉంచుకొని, పీరియడ్స్ అయిన 5వ రోజు నుండి 15వ రోజు వరకూ బాడీ టెంపరేచర్ ను గమనిస్తుండాలి . ఈ సమయంలో ముఖ్యంగా 10-14రోజుల మద్య కాలవ్యవధిలో గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని సహాయంతో కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
undefined
కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఇది కామేచ్చను పెంచుతాయి. మరియు ఎనర్జీని అందిస్తాయి. అలాంటి ఆహారాల్లో బ్లాక్ రాస్బెర్రీస్, బ్రొకోలీ, ఫిగ్స్, వాటర్ మెలోన్, గుడ్లు, కుంకుమపువ్వు, లెట్యూస్, అల్లం, అవొకాడో, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఆహారాలు సహాయపడతాయి.
undefined
click me!