శృంగారం భార్యభర్తల బంధాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ ప్రక్రియను ఆడ, మగ ఇద్దరూ ఆస్వాదించాలి. ఈ ప్రక్రియలో చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
అయితే.. మనం చిన్నవి అనుకునే పొరపాట్లు భవిష్యత్తులో శృంగార జీవితానికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరి అవేంటో వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఓలుక్కేయండి.
నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా..చాలా మంది శృంగారంలో పాల్గొనేటప్పుడు ముద్దు పెట్టుకోరు.
రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.
కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది.
శృంగారంలో భాగస్వామిని చిలిపిగా కొరకడం సాధారణమే. దీన్ని చాలా మంది ఇష్టపడతారు కూడా.
కానీ పూర్తిగా రంగంలోకి దిగక ముందే కొరకడం వల్ల ఫలితం ఉండదు.అది వారికి నొప్పిని, అసౌకర్యాన్నికలిగిస్తుంది. ఫలితంగా మీరంటేనే వారు భయపడే అవకాశం ఉంది.
మర్మంగాలను తప్పించి మిగతా శరీర భాగాల్ని పట్టించుకోకపోవడం ఫలితాన్ని ఇవ్వదు. మెకాలు, మణికట్టు, వీపు, పొట్ట భాగంలో ముద్దులు కురిపించడం వల్ల పార్టనర్ రతి క్రీడకు సన్నద్ధం అయ్యే అవకాశాలుంటాయి.ఆయా భాగాల్లో మృదువుగా తాకడం వల్ల తను మూడ్‌లోకి వచ్చి సహకరించే వీలుంది.