ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు... పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించరు..!

First Published | Mar 28, 2022, 1:33 PM IST

కేవలం ఒక్కరితోనే కమిట్ అయ్యి ఉండటం వీరికి నచ్చదు. ఎక్కువ కాలం ఒకే రిలోషన్ లో ఉండాలి అనే భయం ఉన్నవారు.. పెళ్లి పట్ల ఆసక్తి చూపించరు.

marriage

వివాహం గురించిన ఆలోచన మిమ్మల్ని భయపెడుతుందా లేదా ఒక వ్యక్తితో మీ జీవితాన్ని శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచాలనే ఆలోచన ఉందా? మీరు మీ కోసం కాకుండా.. ఒత్తిడి కారణంగా పెళ్లికి ఒప్పుకుంటున్నారా..? మీ మనసులో పెళ్లికి అంగీకరించాలని లేదా..? ఇలాంటి ఆలోచనలు మీకు నిత్యం వస్తున్నాయి అంటే...మీరు పెళ్లి పట్ల ఆసక్తి చూపించం లేదని అర్థం. అలా పెళ్లి పట్ల ఆసక్తి  చూపించకపోవడానికి కారణం మీకు పెళ్లి విషయంలో కొన్ని అభిప్రాయాలు ఉండటమేనట. మరి అవేంటో ఓసారి చూద్దామా..
 

Bridal


మీ జీవితాన్ని ఒక వ్యక్తితో గడపాలనే ఆలోచన మిమ్మల్ని భయపెడుతుంది. అంటే.. కేవలం ఒక్కరితోనే కమిట్ అయ్యి ఉండటం వీరికి నచ్చదు. ఎక్కువ కాలం ఒకే రిలోషన్ లో ఉండాలి అనే భయం ఉన్నవారు.. పెళ్లి పట్ల ఆసక్తి చూపించరు.  పెళ్లి అంటే భయపడిపోతూ ఉంటారు. వీరికి లాంగ్ టైమ్ రిలేషన్స్ నచ్చవు. ఒకే వ్యక్తితో జీవితాంతం తమ వళ్ల కాదని వారు భావిస్తూ ఉంటారు.
 

Latest Videos


 ఇక మరో కారణం.. దాదాపు చాలా మంది పెళ్లిళ్లను.. పెళ్లి తర్వాత వారి జీవితాలను మనం చూస్తూ ఉంటాం. అయితే.. ప్రేమగా ఉండేవారిని చూస్తే పర్లేదు. అలా కాకుండా.. ఎక్కువగా గొడవలు పడేవారిని చూస్తే.. మాత్రం భయపడిపోతుంటారు. తమ జీవితం కూడా అలానే జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అందుకే.. పెళ్లి అంటే తప్పించుకు తిరుగుతూ ఉంటారు. 

ఇక కొందరు ఎక్కువగా.. తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. మీ కెరీర్ మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. ప్రతి విజయంతో మీరు సంతృప్తి చెందినట్లు భావిస్తే, దాని కోసం ఎవరినైనా వివాహం చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. సంతోషంగా ఉండటానికి మీరు వివాహం చేసుకోవలసిన అవసరం లేదని మీరు భావిస్తారు.

మీరు పెళ్లిళ్లకు వెళ్లినప్పుడల్లా అక్కడ జరిగే కొన్ని సంఘటనల కారణంగా.. పెళ్లి మీద అయిష్టత ఏర్పడుతుంది. ఈ భావన మిమ్మల్ని వివాహం వైపు అడుగులు వేయకుండా ఆపుతుంది. మీరు వివాహాలకు హాజరు కావడాన్ని ద్వేషిస్తారు మరియు ఇది సరదాగా ఉంటుందనే ఆలోచనను పూర్తిగా అసహ్యించుకుంటారు.

click me!