వారానికి ఐదు గంటలా.. ఇలా చేస్తే పిల్లలు పుట్టడం కష్టమే!

First Published | Jun 12, 2020, 3:03 PM IST

మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి.. అందంగా ఉండాలంటూ చేసే కొన్ని పనుల వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు

పెళ్లైన వెంటనే పిల్లలను కనడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఓ రెండేళ్ల తర్వాత, మూడేళ్ల తర్వాతో పిల్లల కోసం ట్రై చేస్తారు. అయితే.. ఎంత ట్రై చేసినా కావాల్సిన సమయంలో పిల్లలు కలగక చాలా మంది దంపతులు ఇబ్బందులుపడుతున్పారు.
ఇక చేసేది లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే.. మనకి తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా సంతానం కలగడం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి.. అందంగా ఉండాలంటూ చేసే కొన్ని పనుల వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందేనన్నది నేటి మాట. అందుకే పార్కులు, జిమ్‌ సెంటర్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి.
ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తూ ఒళ్లు తగ్గించుకుంటూ, ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు పట్టణ ప్రజలు. ఎంత ఎక్కువసేపు వ్యాయామం చేస్తే అంత మంచిదని భావించేవాళ్లు కూడా లేకపోలేదు.
కానీ ఈ వ్యాయామం కూడా పిల్లలు పుట్టే విషయంలో కీలక పాత్ర వహిస్తుందని మీకు తెలుసా?
స్త్రీ పురుషులు ఎంతసేపు వ్యాయామం చేస్తారన్న దాన్నిబట్టి పిల్లలు కలగడమా? కలగకపోవడమా?అన్నది ఉంటుందని ఎప్పుడైనా విన్నారా..? నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే.
సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ.. వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుందట. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉందట.
అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిదట. వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుందట.

Latest Videos

click me!