శృంగారంలో మజా.. వయాగ్రాని తలదన్నే ఫుడ్స్ ఇవి..

First Published | Dec 16, 2020, 3:19 PM IST

వయాగ్రా లేకుండా.. కేవలం మనకు లభించే కొన్ని ఆహార పదార్థాలు అంతకన్నా ఎక్కువ పవర్ ఫుల్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. అయితే.. ఒక్కోసారి వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.
వయాగ్రా పిల్స్.. పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి కూడా లేదట. ఈ విషయాలు తెలియక చాలా మంది దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అయితే.. వయాగ్రా లేకుండా.. కేవలం మనకు లభించే కొన్ని ఆహార పదార్థాలు అంతకన్నా ఎక్కువ పవర్ ఫుల్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి.
డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి. తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది.
కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి.
స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది.
మిగతా పండ్ల మాదిరిగా కాకుండా బెర్రీలను గింజలతో పాటు తింటారు కాబట్టి జింక్ దండిగా లభిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో స్తంభన సమస్యలు తలెత్తవు.
అంతేకాకుండా గుమ్మడి గింజలు శృంగార సామర్థ్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సహజసిద్ధంగా లభించే ఈ ఇలాంటి గింజలను ప్రతిరోజు తీసుకుంటే ఉంటే మీలో శృంగార సామర్థ్యాన్ని అత్యంత వేగంగా పెంచుతుంది.

Latest Videos

click me!