couple fight
పెళ్లి అంటే.. కలిసి జీవించడం. ఒకరికోసం మరొకరు కలిసి జీవించడానికే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే... పెళ్లి చేసుకున్నాం కదా అని అన్నింటినీ భరించాల్సిన అవసరం లేదు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత భార్యభర్తలు అయినా.. కొన్ని విషయాలను మాత్రం అస్సలు భరించాల్సిన అవసరం లేదట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
1.ఎంత భార్యభర్తలు అయినా... ఒకరిపై మరొకరు ఫిజికల్ అబ్యూస్ ని భరించాల్సిన అవసరం లేదు. కొట్టడం, తన్నడం, చెంప దెబ్బలు కొట్టడం అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. మీ భాగస్వామి అలాంటివి చేస్తే... ఆ బంధానికి మీరు ముగింపు పలకడమే ఉత్తమం
2.కొందరు ఫిజికల్ గా దాడి చేయకపోయినా.. ఎమోషనల్ గా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే.. ప్రతిదానికీ విమర్శించడం, అవమానపరచడం, తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి భరిస్తూ ఉండటం వల్ల.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి... వీటిని కూడా భరించకూడదు.
3.మీ భాగస్వామి మీరు కాకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు అంటే కూడా మీరు ఆ బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు.ఆ బంధానికి ముగింపు పలకడమే మంచిది.
4.మీ భాగస్వామి ప్రతి విషయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారంటే కూడా వారితో బంధాన్ని కొనసాగించడం కరెక్ట్ కాదు. అన్ హెల్దీ రిలేషన్ షిప్ ని మీరు భరించాల్సిన అవసరం లేదు.
5.మీ వైవాహిక జీవితానికి ఆటంకం కలిగించే ఏదైనా అలవాటు మీ భాగస్వామికి ఉన్నా కూడా మీరు భరించాల్సిన అవసరం లేదు. అంటే వారికి వీపరీతంగా మద్యం సేవించడం, గ్యాబ్లింగ్ లాండి అడిక్షన్స్ ఉంటే మీరు ఉపేక్షించకూడదు.
6.ఇక మీ భాగస్వామి ప్రతి విషయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం కూడా భరించకూడదు. భార్యభర్తలు ఇద్దరూ ఒకరికి మరొకరు కచ్చితంగా అటెన్షన్ ఇవ్వాలి. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తున్నా, మీ ఫీలింగ్స్ పట్టించుకోపోయినా ఆ బంధం కొనసాగడం కష్టమే.
7.దాంపత్య జీవితంలో ఒకరిని మరొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం.అలా కాకుండా.. మిమల్ని ప్రతి విషయంలోనూ అగౌరపరచాలి అని చూస్తున్నారంటే.. మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని అర్థం. నిజాయితీ లేని బంధం కూడా దాంపత్య జీవితానికి మంచిది కాదు.