ఈ అలవాట్లున్న మగవారికి పిల్లలు పుట్టడం కష్టం..

First Published | Feb 16, 2024, 1:18 PM IST

పురుషులకు ఉండే కొన్ని చెడు అలవాట్లు వారికి సంతాన సమస్యలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ అలవాటు మీ స్పెర్మ్ కౌంట్ ను బాగా తగ్గించడమే కాకుండా.. మీ లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. 
 

ఆరోగ్యంగా భావించి మీరు అనుసరించే కొన్ని అలవాట్లు మీకు ఎంతో హాని చేస్తాయి. ఇది కేవలం మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక మగవాళ్ల విషయానికొస్తే.. వీళ్లకున్న కొన్ని చెడు అలవాట్లు లైంగిక సమస్యలకు దారితీస్తుంది. ఏ అలవాట్లు పురుషులలో స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయో, సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిశ్చల జీవనశైలి

మంచి సెక్స్ లో పాల్గొనడానికి పురుషులు శారీరకంగా చురుకుగా ఉండాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది మీ మనస్సుకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా మీ లిబిడోను కూడా పెంచుతుంది. అలాగే మీ స్టామినా కూడా పెరిగేలా చేస్తుంది. అయితే మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకుడా నిశ్చల జీవనశైలిని అనుసరిస్తే మాత్రం మీరు అంగస్తంభలోపం సమస్యతో బాధపడొచ్చు. 
 


ధూమపానం

స్మోకింగ్ ఆరోగ్యానికి మంచిది కాదన్న ముచ్చట అందరికీ తెలిసిందే. మీకు తెలుసా? స్మోకింగ్ అలవాటున్న పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని ఒక అధ్యయనం సూచిస్తుంది. స్మోకింగ్ చేయని పురుషుల కంటే స్మోకింగ్ చేసే చేసే పురుషులకు లైంగిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది.
 

నిద్రలేమి సమస్య

మగవారు సరిగా నిద్రపోకపోతే టెస్టోస్టెరాన్, సెక్స్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గుతాయి. ఇది శరీర కండరాలు, ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. అలసటకు కూడా కారణమవుతుంది. ఇది సహజంగా పురుషాంగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. 
 

తక్కువ సెక్స్ 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేర్వేరు జంటలకు సెక్స్ భిన్నంగా ఉంటుంది. కొంతమంది వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటారు. ఇంకొందరు వారానికి ఒకసారి కూడా పాల్గొనరు.
ఇలాంటి సందర్భాల్లో.. పురుషులు ఎక్కువగా అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి దీన్ని వదిలించుకోవాలంటే వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

పుచ్చకాయ 

పుచ్చకాయ పండు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.  ముఖ్యంగా ఇది మీ లైంగిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో సిట్రులిన్ అర్జినిన్ ఉంటుంది. ఇది మీ రక్త నాళాలను విస్తృతం చేస్తుంది. అలాగే ఇది పురుషాంగంతో సహా శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రవాహాన్నిపెంచుతుంది. 
 

ట్రాన్స్ ఫ్యాటీ ఫుడ్స్ 

ఇది పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ కౌంట్ ను బాగా తగ్గిస్తుంది. అలాగే ఇది వారి సెక్స్ లైఫ్ ను మరింత దిగజార్చుతుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు పొందడానికి పురుషులు వీలైనంత వరకు ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది.

డిజిటల్ స్క్రీన్ 

ప్రస్తుత కాలంలో చాలా మంది నిశ్చల జీవనశైలిని అనుసరించడం వల్ల డిజిటల్ స్క్రీన్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. వారానికి 20 గంటలకు మించి మొబైల్, ల్యాప్టాప్ టీవీ చూసే పురుషులకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి పురుషుల్లో 44% మందికి స్పెర్మ్ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Latest Videos

click me!