సెక్స్ ఫాంటసీల్లో వింతలు.. ఇవి ప్రమాదమే..!

First Published | Apr 29, 2021, 10:35 AM IST

బోరింగ్ రోజు వారి సెక్స్ కి స్వస్తి పలికేలా.. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ.. శృంగార జీవితాన్ని ఆస్వాదించడాన్నే సెక్స్ ఫాంటసీ అంటాం. అది కొంచెం భిన్నంగా ఉంటుంది. 

సెక్స్ లైఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు.. ఎంత ఎంజాయ్ చేస్తున్నా.. కొందరికి సెక్సువల్ ఫాంటసీలు ఉంటాయి. కొన్ని తీయని అనుభూతిని ఇచ్చేలా ఉంటే... మరికొన్ని భయం కలిగేలా ఉంటాయి. కొందరు సరదా ఫాంటసీలు కోరుకుంటే... మరొకొందరు.. చాలా వైలెంట్ గా చేయాలని ఆశపడుతుంటారు.
ఈ క్రమంలో.. ఇలాంటి ఫాంటసీలపై నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. వారు కొన్ని సూచనలు చేశారు. సెక్స్ ఫాంటసీలు నేరవేర్చుకునే సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనే విషయాలను చెప్పారు.

బోరింగ్ రోజు వారి సెక్స్ కి స్వస్తి పలికేలా.. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ.. శృంగార జీవితాన్ని ఆస్వాదించడాన్నే సెక్స్ ఫాంటసీ అంటాం. అది కొంచెం భిన్నంగా ఉంటుంది
వినేవారికి కూడా కొత్తగా అనిపిస్తుంది. అయితే.. దీనిలో రోల్ ప్లేయింగ్, సెక్సీ లింగరీ, సెక్స్ టాయ్స్, స్ట్రిప్పింగ్ లాంటివి చాలా నార్మల్ గా ఉంటాయి. ఇలాంటివి ప్రయత్నించడం వల్ల వారి బంధం మరింత బలంగా మారే అవకాశం ఉంది.
అయితే.. ఈ సెక్స్ ఫాంటసీలు అందరికీ ఉండకపోవచ్చు. మనం పెరిగిన వాతావరణం.. పెద్దల పెంపకం ఇలాంటి కారణాల వల్ల కొందరు సెక్సువల్ ఫాంటసీలు ఉండకపోవచ్చు. అలాంటి వాటిని కూడా కొత్తగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి.. మీకు మాత్రమే ఫాంటసీ ఉంటే సరిపోదు.. మీ ఫాంటసీ విషయాన్ని మీ పార్ట్ నర్ కి చెప్పి.. వారికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే... దానిని మీరు ఎంజాయ్ చేయగలరు. కాబట్టి.. ఈ విషయంలో ఓ క్లారిటీ ఉండాలి. లేదంటే.. ఎంజాయ్ చేయలేరు.
ఇక కొందరికి పోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉంటుంది. దానిని చూసి సెక్సువల్ ఫాంటసీలు పెంచుకుంటారు. అయితే... వాటిల్లో చూపించినట్లు నిజ జీవితంలో చేయడం కష్టం అనే విషయాన్ని గుర్తించాలి.
అంతేకాకుండా.. మీకు పోర్న్ చూసే అలవాటు ఉందని.. మీ పార్ట్ నర్ కూడా ఉండాలని గ్యారెంటీ లేదు. కాబట్టి.. మీ వింత ఫాంటసీలు తీసుకువెళ్లి పార్ట్ నర్ పై రుద్దడానికి ప్రయత్నించవద్దు.
సరదాగా.. కొత్తగా ఉన్నంత వరకు ఫాంటసీలు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ... మరింత భయపెట్టేలా ఉండేవాటికి దూరంగా ఉండటమే మంచిది. వీడియోల్లో చూపించినంత సరదగా.. నిజ జీవితంలో ఉండకపోవచ్చనే విషయాన్ని గుర్తించాలి.
పబ్లిక్ ప్లేస్ లో సెక్స్ చేయాలనే ఫాంటసీని మర్చిపోవడమే కరెక్ట్. కొందరికి.. ఎలివేటర్స్ లో ముద్దు పెట్టుకోవాలని ఇలా పబ్లిక్ రొమాన్స్ కోరుకుంటారు. అది చూసేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

Latest Videos

click me!